For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోట్లో నీరూరించే మాగాయ రుచి మహా గొప్పది...!

|

సాధారణంగా మార్కెట్లో పచ్చిమామిడికాయలు కనబడితే చాలు. నోట్లో నీళ్ళూరాల్సిందే. ఇక పచ్చిమామిడికాయ ముక్క మీద ఉప్పు, ఎర్రని కారం చల్లితే ఇక అంతే తినేవరకూ చూపు పక్కకు మరలదు. ఇక ఊరగాయ సంగతి సరేసరి. లొట్టలేయాల్సిందే. పచ్చిమామిడికాయలు మార్కెట్లో మెళ్ళి మెళ్ళిగా అడుగుపెడుతున్నాయి. సీజన్ మొదలైయింది. ఆవకాయ ప్రియుల ఎప్పుడెప్పుడా కొత్తఆవకాయ తిందామని ఎదురుచూస్తున్నారు.

పచ్చిమామిడికాయతో వివిధ రకాల వంటలు, మామిడి పులిహోర, పచ్చిమామిడికాయ పచ్చడి, పచ్చిమామిడికాయ తొక్క ఆవకాయ ఇలా సీజన్ అంతా తయారు చేసి రుచిచూస్తుంటారు. కానీ ఆవకాయ తరువాత అంతగానూ ఇష్టపడి తినే పచ్చడి మాగాయ. మాగాయ మహాపచ్చడి, మాగాయ రుచి మహా గొప్పది . ఏ కూరలు చేసే ఓపిక లేనప్పుడు , పెరుగన్నం లో మాగాయ కలుపుకుని తిన్నామనుకోండి , గిన్నెడన్నమూ ఒక్కరికి కూడా సరి పోదు ! అంత రుచిగా ఉండే ఈ పచ్చడి ఎలా చెయ్యాలో చూద్దాం. ఈపచ్చడికి స్పెషల్ గా రసాలు, జలాలు అంటూ వెతకవలసిన అవసరం లేదు. మామూలు కాయలైనా పుల్లగా ఉంటే చాలు చేసెయ్యొచ్చు.

 Tangy Raw Mango Pickle Recipe

కావలసిన పదార్ధాలు :
మామిడికాయలు : 2
కారం : 3tbsp
ఉప్పు: రుచికి తగినంత
ఆవపిండి : 1tsp
మెంతిపిండి : 1/2tsp
నూనె: 1cup
కరివేపాకు : రెండు రెమ్మలు
పసుపు : చిటికెడు
తాలింపుకు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిరెబ్బలు

తయారు చేయు విధానం:
1. ముందుగా మామిడికాయను చెక్కుతీసి కడిగి తుడిచి వాలికలుగా ముక్కలు కొయ్యాలి.

2. తర్వాత ఈ ముక్కలలో ఒక స్పూన్ ఉప్పు,చిటికెడు పసుపు వేసి బాగా కలిపి రెండు మూడు గంటలు ఉంచాలి.

3. ఇప్పుడు ఊరిన రసంలో నుండి ముక్కలు వేరుచేసి ఎండలో పెట్టాలి. మంచి ఎండలో రెండు గంటలు ఉంచితే చాలు.

4. ఈ మామిడి రసంలో కారం, ఆవపిండి, మెంతి పిండి, తగినంత ఉప్పు వేసి, చివరగా మామిడి ముక్కలు కూడా వేసి బాగా కలపాలి.

5. నూనె వేడి చేసి తాలింపు వేసి, చిదిమిన వెల్లుల్లిరెబ్బలు, కరివేపాకు వేసి, ఈ తాలింపును పచ్చడిలో కలిపితే ఎర్రగా నోరూరిస్తూ మాగాయపచ్చడి రెడీ. ఇష్టం ఉన్నవారు తాలింపులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు.

English summary

Tangy Raw Mango Pickle Recipe | ‘మాగాయ’ రుచి మహా గొప్పది...!

Pickles have always been one of the most preferred delicacies in many cuisines. Pickles are prepared by preserving vegetables or fruits in water or vinegar for few weeks and then mixing them with oil. In India, pickles are teamed up as a sweet, spicy or tangy side dish with rice as well as rotis.
Story first published: Friday, February 22, 2013, 17:46 [IST]
Desktop Bottom Promotion