For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీ క్యాప్సికమ్ వ్రాప్ : హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి

|

వీక్ కెండ్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇక సోమవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఏంచేయాలబ్బా....అని అలోచిస్తుంటారు. స్కూల్ కు వెళ్ళే పిల్లల కోసం, కాలేజ్ వెళ్ళే వారికోసం, ఆఫీసులకు వెళ్ళే వారికోసం చాలా త్వరగా, సింపుల్ గా మరియు హల్తీ బ్రేక్ ఫాస్ట్ కోరుకుంటారు. అంటువంటి బ్రేక్ ఫాస్ట్ రిసిపిల్లో ఉండేది టేస్టీ క్యాప్సికమ్ వ్రాప్ .

ఈ బ్రేక్ ఫాస్ట్ రిసిపి చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. ఇది హెల్తీ కూడా. ఉదయం తినడానికి సమయం లేకపోతే, సిల్వర్ ఫోయిల్లో చుట్టి బాక్స్ లో తీసుకెళ్ళి, ఉదయం టైం ఉన్నప్పుడు వెంటనే తినేసేయవచ్చు. అంతే కాదు, రాత్రి సమయంలో తయారుచేసిన చపాతీల్లో ఒకటి రెండు మిగిలినా కూడా వేస్ట్ కాకుండా ఇలా కూడా ప్రయత్నించవచ్చు. మరి మీరు కూడా ఈ సులభమైన, టేస్టీ క్యాప్సికమ్ రోల్ ను టేస్ట్ చేయాలంటే ఎలా తయారుచేయాలో తెలుసుకోవాలికదా....

Tasty Capsicum Wrap For Breakfast

కావల్సిన పదార్థాలు:
గోధుమలు పిండి: 2 cups
క్యాప్సికమ్: 2 (పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి)
టమోటాలు: 2(మీడియంసైజువి సన్నగా తరిగినవి)
ఉల్లిపాయలు: 1 (చిన్న, చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 2 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
బ్లాక్ మిరియాలు పొడి: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
పసుపు పొడి: ½ tsp
టమోటో కెచప్: 1tbsp
ఉప్పు : రుచికి సరిపడా
నూనె: 2tbsp
నీరు- 2 cups

తయారుచేయు విధానం:
1. ముందుగా గోధుమపిండిలో కొద్దిగా ఉప్పు నీళ్ళు పోసి మృదువుగా కలిపి పెట్టుకోవాలి.
2. 10-15నిముషాల తర్వాత పిండి నుండి కొద్దిగా తీసుకొని, చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీల ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లి పాయ ముక్కలు వేసి 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసు9కోవాలి.
4. తర్వాత అందులోనే క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, పెప్పర్ పౌడర్, జీలకర్ర, పసుపు వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి.
5. తర్వాత టమోటో, పచ్చిమిర్చి మరియు టమోటో కెచప్ కూడా వేసి మరో రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. మొత్త ఫ్రై అయిన తర్వాత అరకప్పు నీళ్ళు పోసి , మూత పెట్టి 5నిముషాలు ఉడికించుకోవాలి.
6. ఒకసారి ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
8. తర్వాత పాన్ ను వేడి చేసి రుద్దిపెట్టుకొన్న చపాతీలను ఒక టీస్పూన్ నూనె చిలకరిస్తూ పాన్ మీద రెండు వైపులా కాల్చుకోవాలి.
9. ఒక వైపు కాలిన తర్వాత ఆ చపాతీని రోల్ గా చుట్టి మరో వైపు కూడా రెండు నిముషాలు కాల్చుకోవాలి.
10. చపాతీ రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్ లోకి తీసుకొని ఈ చపాతీ రోల్ ల్లో ముందుగా రెడీ చేసి పెట్టుకొన్న క్యాప్సికమ్ స్టఫ్ ను పెట్టి రోల్ చేయాలి.తర్వాత చేత్తో రెండు వైపులా కవర్ చేయాలి.
11. అవసరం అయితే సిల్వర్ ఫోయిన్ ను కవర్ చేయవచ్చు. ఇలా మొత్తం చపాతీలను స్టఫ్ చేసి క్యాప్సికమ్ రోల్స్ తయారుచేసుకోవచ్చు. అంతే టేస్టీ క్యాప్సికమ్ రిసిపి రెడీ.

English summary

Tasty Capsicum Wrap For Breakfast

Monday mornings are always dreaded. After the weekend, you feel totally lethargic to get up from the bed and get ready for school or work. Thinking of cooking up a breakfast makes the morning even more dreadful. But surely you cannot miss out on the most important meal of the day. So, you just need to think smart.
Story first published: Friday, January 2, 2015, 10:55 [IST]
Desktop Bottom Promotion