For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈజీ అండ్ టేస్టీ కోకనట్ రైస్

|

సాధారణంగా మన ఇల్లలో ఒక్కోసందర్భంలో అన్నం మిగిలిపోతుంటుంది. అటువంటప్పుడు దాన్ని పడేయాల్సిన పనిలేదు. దాంతో వెరైటీగా చేస్తే ఆ అన్నం కాలి అయిపోతుంది. మీ ఇంట్లో కనుక తాజాగా కొబ్బరి తరుము ఉన్నట్లైతే కోకనట్ రైస్ తయారు చేసేసుకోవచ్చు. ఇది తయారు చేయడానికి చాలా తక్కువ సమయం తీసుకుంటుంది. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది.

కోకనట్ రైస్ కు అవసరం అయ్యే వస్తువులు కూడా తక్కువే. కాబట్టి మీరు కూడా ఈ ఈజీ అండ్ టేస్టీ కోకనట్ రైస్ ఒక సారి తయారు చేసి టేస్ట్ చూసేయండి.

బియ్యం: 1cup(uncooked)
కొబ్బరి తురుము: 3/4cup
ఆవాలు: 1tsp
శెనగపప్పు: 1tbsp
ఉద్దిపప్పు: 2tsp
ఎండు మిర్చి: 2(finely chopped)
పచ్చిమిర్చి: 3(finely chopped)
కరివేపాకు: 5
అల్లం: 1tsp (finely chopped)
నూనె: 1tbsp
ఇంగువ: చిటికెడు
జీడిపప్పు: 8-10
ఉప్పు: రుచికి సరిపడా

Tasty Coconut Rice Recipe

తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యాన్ని శుభ్రం చేసి తగిన సరిపడా నీళ్ళు పోసి ఉడికించికోవాలి. తర్వాత అన్నంను వెడల్పు ప్లేట్ లో వేసి చల్లార బెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు వేసి చిటపటలాడాక అందులో శెనగపప్పు, ఉద్దిపపప్పు, జీడిపప్పు వేసి లైట్ గా రోస్ట్ చేయాలి.
3. తర్వాత ఎండు మిర్చి, పచ్చిమిర్చి, అల్లం, ఇంగువ మరియు కరివేపాకు వేసి పది నిముషాల పాటు తక్కువ మంట మీద వేయించుకోవాలి.
4. ఇప్పుడు అందులోనే కొబ్బరి తురుము మరియు వేసి ఒక నిముషం వేయించుకోవాలి. తర్వాత ఉప్పు వేసి కలుపుకోవాలి.
5. తర్వాత అందులో ముందుగా వండి, చల్లార్చి పెట్టుకొన్న అన్నం కూడా వేసి వేపుడు మిశ్రమంతో బాగా మిక్స్ చేయాలి. అంతే కోకోనట్ రైస్ రెడీ. దీన్ని మీకు నచ్చిన పికెల్ లేదా గ్రేవీతో తినవచ్చు.

English summary

Tasty Coconut Rice Recipe | టేస్టీ కోకోనట్ రైస్

If you are worried about the leftover rice you had prepared last night, then don't worry. If you have a fresh grated coconut in hand, your problem is solves. As the rice prepared with coconut works wonder, be it the taste or even the preparation time. Coconut rice is one of the staple foods of South India and many people prepare this in order to save time as it is easy to prepare.
Story first published: Saturday, February 23, 2013, 12:38 [IST]
Desktop Bottom Promotion