For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్దిపప్పుతో పప్పుచారు -డయాబెటిక్ స్పెషల్

|

ప్రస్తుత రోజులో డయాబెటిక్ ఒక సాధారణ వ్యాధిగా ఉంది. దాంతో చాలా మంది వారి ఫేవరెంట్ ఫుడ్స్ తినడానికి చాలా కఠినంగా ఉంటారు. అయితే, మీరు మీకు ఇష్టమైన ఆహారాలు తినకుండా ఉండటం కాదు, మనకు నచ్చిన ఆహారాలు కూడా మీనకు నచ్చిన పద్దతిలో తయారుచేసుకొనే ప్రయత్నించవచ్చు.

ఈ రోజు మీకోసం ఒక డయాబెటిక్ స్పెషల్ రిసిపి మీకోసం తయారుచేస్తున్నాం. అది ఒక కొత్త వంట దాల్ కబిలా. ఇది సాధారణంగా ఒక ముగలాయ్ రిసిపి . ఇది డయాబెటిక్ పేషంట్స్ కు బాగా నప్పుతుంది. తక్కువ మసాలాలతో దీన్ని తయారుచేయచ్చు. మరి ఈ రుచికరమైన ముగలాయ్ స్పెషల్ ఎలా తయరుచేయాలో చూద్దాం...

Tasty Dal Kabila For Diabetics

కావల్సిన పదార్థాలు
ఉద్దపప్పు: 1cup
చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 2
యాలకలు: 2
ఎండుమిర్చి: 1(మద్యకు కట్ చేయాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
టమోటో: 2(కట్ చేసినవి)
పసుపు: 1tsp
కారం: 1tsp
ధనియాల పొడి: 1/2tsp
నిమ్మరసం: 2tsp
జీలకర్ర: 1tsp
ఉప్పు : రుచికి సరిపడా
నీళ్ళు: 2cups
కొత్తిమీర: 2tbsp

తయారుచేయు విధానం:
1. ఉద్దిపప్పును నీటిలో వేసి శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.
2. తర్వాత, నీళ్ళు వంపేసి , కుక్కర్ లో వేసి, నీళ్ళు పోసం, ఉప్పు కొద్దిగా వేసి మీడియం మంట మీద, రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడి చేసి అందులో చెక్క, లవంగాలు, జీలకర్ర, యాలకలు వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
4. తర్వాత అందులో ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో 2నిముషాలు మీడియం మంట మీద వేగించుకవోాలి.
5. ఇప్పుడు అందులో టమోటో, ధనియాల పొడి, పసుపు, కారం, గరం మసాలా పౌడర్, ఉప్పు వేసి 5నిముషాలు ఫ్రై చేయాలి.
6. తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న ఉద్దిపప్పు మరియు నిమ్మరసం కూడా వేసి, మిక్స్ చేయాలి మిక్స్ చేస్తూ 5నిముషాలు వేగించుకోవాలి.
8. ఒకసారి ఇలా అన్నింటిని మిక్స్ చేసి, ఉడికించిన తర్వాత, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి. ఈ రుచికరమైన రోటికి ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది.

English summary

Tasty Dal Kabila For Diabetics

Diabetes is a disease which restricts you from eating all your favourite foods. But that doesn't mean that you cannot have tasty food if you have diabetes. We, at Boldsky aim to give the best to your taste-buds and take care of your health as well.
Story first published: Thursday, November 28, 2013, 17:07 [IST]
Desktop Bottom Promotion