For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీ పనీర్ నవరతన్ కుర్మా రిసిపి

|

వెజిటేరియన్స్ కు పనీర్ ఒక అత్యంత ముఖ్యమైన ఆహారంగా మారింది. చాలా వరకూ ప్రతి ఒక్కరూ మెనులో పనీర్ ను ఒక ఉత్తమ ఎంపికగా పెట్టుకొని, పార్టీల్లో అద్భుతమైన రుచికరమైన వంటల్లో ఇది ఒకటిచా ఎంపిక చేసుకుంటారు.

మరి పనీర్ రుచిచూడాలనుకొనే వారికోసం, ఈరోజు ఒక అద్భుతమైను రుచికరమైన పనీర్ రిసిపిని మీకు పరిచయం చేస్తున్నాం. ఈ వంటకు పనీర్ తో పాటు, క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ మరియు బంగాళదుంప వంటివాటిని కూడా చేర్చుతున్నాం. అందుకే ఈ వంటకు పనీర్ నవరతన్ కుర్మా అని పేరు. మరి ఈ స్పెషల్ పనీర్ కుర్మా ఎలా తయారుచేయాలో చూద్దాం...

Tasty Paneer Navratan Korma Recipe

కావల్సిన పదార్థాలు:
కాలీఫ్లవర్-1 (చిన్న, పుష్పాల వేరు)
కాప్సికమ్ 1 (మీడియం,చిన్నచిన్నపువ్వులుగా విడిపించుకోవాలి)
ఫ్రెంచ్ బీన్స్ 8-10 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
క్యారెట్ 2 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
గ్రీన్ బటానీలు ½cup
బంగాళ దుంపలు 2 (మీడియంగా తరిగి పెట్టుకోవాలి)
మొక్కజొన్న: ½ cup
పనీర్ - 250gms (సన్నముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
పుట్టగొడుగులను 8-10 (చిన్న ముక్కలుగా తరిగినవి)
జీడిపప్పు: ½ cup
ఉల్లిపాయ పేస్ట్: 2tbsp
అల్లం: 1మీడియం సైజ్ (తురుముకోవాలి)
వెల్లుల్లి పేస్ట్: 1tbsp
పెరుగు: ½cup
బ్లాక్ పెప్పర్ పౌడర్: 1tsp
గరం మసాలా పొడి: 1tsp
చెక్క : చిన్న ముక్క
యాలకులు -4
లవంగాలు: 5
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: 2tbsp
నీరు -3 ½cup
ఫ్రెష్ క్రీమ్: 1tbsp(అలంకరించుట కోసం)

తయారుచేయు విధానం:
1. ముందుగా వెడి నీటిలో జీడిపప్పును 10 నిముషాల నానెబెట్టుకోవాలి.
2. 10నిముషాల తర్వాత వీటిని తీసి చిక్కటి పేస్ట్ గా చేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత మూడు కప్పులు నీటిని పోసి, అందులో వెజిటేబుల్ ముక్కలు వేసి 10నిముషాలు ఉడికించుకోవాలి.ఉడికిన తర్వాత నీటిని వంపేసి, వెజిటేబుల్స్ ను పక్కన తీసి పెట్టుకోవాలి.
4. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత అందులోనే ఉల్లిపాయ పేస్ట్ వేసి 5నిముషాలు వేగించుకోవాలి. తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్, బ్లాక్ పెప్పర్ పౌడర్, పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి.
6. మద్యమద్యలో కలియబెడుతుండటం వల్ల పెరుగు ఉండలు కట్టకుండా ఉంటుంది.
7. కొద్దిసేపటి తర్వాత అందులో జీడిపప్పు పేస్ట్ వేసి మరో రెండు మూడు నిముషాలు వేయించుకోవాలి.
8. ఇప్పుడు అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న వెజిటేబుల్స్, మష్రుమ్స్, ఉప్పు వేసి మరో రెండు మూడు నిముషాలు ఉడికించుకోవాలి.
9. తర్వాత అరకప్పు నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి.
10. చివరగా అందులో పనీర్ ముక్కలు, గరం మసాలా, వేసి మిక్స్ చేసి, మూత పెట్టి5-10మీడియం మంట మీద ఉడికించుకోవాలి. ఒక సారిగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి తాజా క్రీమ్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే రుచికరమైన పనీర్ నవరతన్ కుర్మా రెడీ .ఈ రుచికరమైన వంటను రోటీ లేదా పరోటాలతో సర్వ్ చేయండి.

English summary

Tasty Paneer Navratan Korma Recipe

cauliflower, capsicum, beans, carrots, green peas, potatoes, corn, paneer, mushrooms, కాలీఫ్లవర్, కాప్సికమ్, బీన్స్, బటానీలు, బంగాళ దుంపలు, మొక్కజొన్న, పనీర్, పుట్టగొడుగు
Story first published: Tuesday, March 4, 2014, 17:38 [IST]
Desktop Bottom Promotion