For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

థాయ్ వెజిటేబుల్ రెడ్ కర్రీ-నో స్పైసీ ఓన్లీ టేస్టీ

|

రెడ్ కర్రీ అనే పేరుతోనే ఇది ఎంత స్పైసీగా ఉంటుందో తెలుస్తుంది. ఇది ఒక హాట్ అండ్ స్పైసీ డిష్. కానీ మీకో సర్ ఫ్రైజ్ ఏంటంటే ఈ థాయ్ రెడ్ కర్రీ అంత స్పైసీ డిష్ కాదు. మరియు ఇది చాలా సులభంగా తయారు చేయవచ్చు. ఇది చాలా సింపుల్ డెలిషియస్ వెజిటేరియన్ రిసిపి, మీకు రెగ్యులర్ రిసిపిలతో బోర్ కొట్టినప్పుడు ఇటువంటి వంటకాలను ప్రయత్నించవచ్చు.

రెడ్ కర్రీని వెజిటేబుల్స్ తో తయారు చేయడం కొంత సులభంగానే ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి ముఖ్యంగా కావల్సిందల్లా థాయ్ రెడ్ కర్రీ పేస్ట్. ఇది మార్కెట్లో లభిస్తుంది. ఈ రెడ్ కర్రీ పేస్ట్ లో ఉపయోగించిన మూలికలే ఈ వంటకానికి కారం మరియు పులుపు టేస్ట్ ను అంధిస్తుంది. ఈ అన్యదేశ డిష్ యొక్క రుచి మరింత టేస్ట్ గా ఉండటానికి కొబ్బరి పాలు. కొబ్బరిపాలు అదనపు రుచిని మరియు గ్రేవీ క్రీమీగా మార్చి, టేస్ట్ రెట్టింపు చేస్తుంది. మరి ఈ వెజిటేబుల్ థాయ్ రెడ్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం...

Thai Red Curry With Vegetables

కావల్సిన పదార్థాలు:
వంకాయ: 1 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
బెల్ పెప్పర్ (క్యాప్సికమ్): 1 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
బ్రొకోలి(Brocolli): 1 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
బేబికార్న్(Babycorn): 5 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ : 1 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి: 3 రెబ్బలు (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
అల్లం: 1(చిన్న ముక్కలుగా చేసుకోవాలి లేదా పేస్ట్)
రెడ్ కర్రీ పేస్ట్: 2- 3tbsp
సోయా సాస్: 1tbsp
కొబ్బరి పాలు: 1cup
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా కూరగాయ ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి, వేడి చేసి, అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి 5నిముషాలు వేగించుకోవాలి.
3. ఇప్పుడు అందోల అల్లం, వెల్లుల్లి వేసి మరో రెండు నిముషాలు వేగించుకోవాలి.
4. తర్వాత అందులో వంకా, క్యాప్సికమ్, బ్రొకోలీ, బేబీకార్న్ ముక్కలు వేసి మరో 5నిముషాలు మీడియం మంట మీద అన్నింటిని మెత్తగా ఉడికించుకోవాలి.
5. తర్వాత అందులో రెడ్ కర్రీ పేస్ట్, సోయాసాస్, ఉప్పు, వేసి, మరో 5నిముషాలు వేగించుకోవాలి. తర్వాత అందులోనే కొబ్బరి పాలను కూడా పోసి, బాగా మిక్స్ చేయాలి .
6. తర్వాత మూత పెట్టి మంట మీడియంలో పెట్టి పది నిముషాల ఉడికించుకోవాలి.
7. ఒక్కసారిగా కూరగాయ ముక్కలన్నీ ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే థాయ్ వెజిటేబుల్ రెడ్ కర్రీ రిసిపి రెడీ. ఈ రుచికరమైన, స్పైసీ థాయ్ రిసిపిని అన్నం లేదా నూడిల్స్ తో సర్వ్ చేయాలి.

English summary

Thai Red Curry With Vegetables

The name red curry suggests a fiery, hot and spicy dish. But you will be surprised to know that Thai red curry is not a very spicy dish and is easy on your stomach. Thai red curry is a simple and delicious vegetarian recipe which you can try if you are seeking relief from your regular recipes.
Story first published: Monday, August 5, 2013, 12:18 [IST]
Desktop Bottom Promotion