For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టోపు బటర్ మసాలా: శ్రావణమాసం స్పెషల్

|

శ్రావణ మసాం మరో పది రోజుల్లో మొదలవభోతోంది. మరి ఈ శ్రావణ మాసంలో వెజిటేరియన్ వంటలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. మాంసాహారులు కూడా శాహారులుగా మారి చాలా పవిత్రంగా శ్రావణ మాసంలో పూజలు చేస్తుంటారు. శ్రావణ మాసంలో వివిధ రకాల వెజిటేరియన్ వంటను తయారుచేసుకోవచ్చు. ఎప్పుడూ వండినవాటితో బోరుకొడుతుంటే, కాస్త వెరైటీగా మరియు టేస్టీగా తయారుచేసుకోవచ్చు. ఇలా వెరైటీ వంటల్లో టోఫుతో తయారుచేసే వంటలకు చాలా క్రేజ్ ఎక్కువ. రెగ్యులర్ వెజిటేరియన్ మరియు పనీర్ కు డిఫరెంట్ గా టోఫు వంటలు వెరైటీగా ఉంటాయి. అంతే కాదు, టోఫులో చాలా తక్కువ క్యాలరీలుంటాయి. ఇది బరువు పెరగనివ్వదు.

పనీర్ బటర్ మసాలాలాగే, టోఫు బటర్ మసాలను కూడా తయారుచేవయచ్చు. అందుకు టోఫును ఫ్రై చేసుకొని, ఆ తర్వాత టమోటో, జీడిపప్పు మిశ్రం యొక్క గ్రేవీలో వేసి మొత్తగా ఉడికించి తయారుచేస్తారు. ఈ వంటకు ఉపయోగించే మసాలాలు మరియు టోఫు ఫ్లేవర్, టోఫు బటర్ మసాలా శ్రావణ మాసంకు ఒక ఫర్ఫెక్ట్ డిష్. మరి ఈ టోఫు బటర్ మసాలా ఎలా తయారుచేయాలో చూద్దాం...

Tofu Butter Masala Recipe For Shravan

కావల్సిన పదార్థాలు:

టోఫు: 500gms (cubes లోకి కట్)
జీడిపప్పు: 1/4cup
టమోటాలు: 3 (గుజ్జుచేయాలి)
పచ్చిమిర్చి: 2(చీలిక)
అల్లం పేస్ట్: 1tbsp
పెరుగు: 1/2cup
పసుపు పొడి: 1tsp
కారం పొడి: 1tsp
ధనియాల పొడి: 2tsp
గరం మసాలా పొడి: 1tsp
పంచదార: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
జీలకర్ర: 1tsp
పాలు: 1/2cup
బటర్: 1tbsp
నూనె: 1tbsp
అల్లం తురుము: కొద్దిగా గార్నిష్ కోసం

తయారుచేయు విధానం:

1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో టోఫు వేసి ఒక 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకొని, తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత జీడిపప్పును మిక్సీ జార్ లో వేసి కొద్దిగా నీళ్ళు పోసి, చిక్కటి పేస్ట్ లా తయారుచేసుకోవాలి.
3. తర్వాత పాన్ లో బటర్ కరిగిన తర్వాత అందులో జీలకర్ర వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పసుపు, కారం, ధనియాలపొడి, గరం మసాలా వేసి 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత అందులోనే టమోటో గుజ్జు మరియు జీడిపప్పు పేస్ట్ వేసి మిక్స్ చేస్తూ 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. ఇప్పుడు అందులోనే కోల్డ్ మిల్క్, పంచదార, ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
7. తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసిపెట్టుకొన్న టోఫు ముక్కలు వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 5-6నిముషాలు ఉడికించుకోవాలి.
8. పూర్తిగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి అల్లం తురుముతో గార్నిష్ చేయాలి. అంతే టోఫు బటర్ మసాలా రెడీ. ఈ స్పెషల్ వెజిటేరియన్ రిసిపి రైస్ మరియు రోటీలతో ఎంజాయ్ చేయండి.

English summary

Tofu Butter Masala Recipe For Shravan


 The vegetarian recipe trail continues as the month of Shravan progresses. Today we have a pure vegetarian tofu recipe for you which is sure to delight your taste-buds. Tofu is one of the best vegetarian ingredient which you can cook to take a break from your regular vegetables and paneer. Apart from that tofu has very low calories and does not add to your weight.
Story first published: Monday, July 21, 2014, 13:07 [IST]
Desktop Bottom Promotion