For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ అండ్ టేస్టీ టమోటో కుర్మా స్పెషల్ సైడ్ డిష్

|

టమోటో తయారు చేసే కొన్ని వంటలు చాలా అద్భుతంగా మంచి టేస్ట్ ఉంటాయి. అన్నం, దోసెలోనికి రొటీన్ చట్నీ, సాంబార్లు తిని బోర్ కొడుతుంటే
కొంచెం వెరైటీగా టమోటో కుర్మా చేసి టేస్ట్ చేయండి. టమోటో కుర్మా బాగా ప్రజాదరణ పొందిన సౌత్ ఇండియన్ రిసిపి. ఇది రైస్ లేదా దోసె లేదా ఏదైని సైడ్ డిష్ గా ఇది బాగా సూట్ అవుతుంది. ఈ టమోటో కుర్మా చట్నీ కాదు అలా అని సాంబారూ కాదు. ఇది టమోటోలతో తయారు చేసే ఒక సాధారణమైన కర్రీ .

దక్షిణ భారత దేశ వంటకాల్లో ఉపయోగించే కొన్ని ఘాటైన మసాలా దినుసులు ఉపయోగించి తయారు చేసే టమోటో కుర్మా . దీనికి కొద్దిగా కొబ్బరి మరియు ఎక్కువగా కరివేపాకు చేర్చడం వల్ల మరింత అద్భుతమైన టేస్ట్ ను అందిస్తుంది. మరి మీరు ఈ టమోటో కుర్మాను టేస్ట్ చేస్తారు కదూ....

Tomato Kurma: A Tangy Southern Curry
టమోటో: 4(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 2 (chopped)
అల్లం: 1చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు: 5 (చితగొట్టుకోవాలి)
పసుపు: 1/2tsp
కారం: 1tsp
ధనియాల పొడి: 1tsp
గసగసాలు: 1tsp
సోంపు: 1tsp
జీలకర్ర: 1tsp
కొబ్బరి తరుము: 2tbsp
జీడిపప్పు: 8
ఆవాలు: 1/2tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp


తయారు చేయు విధానం:

1. ముందుగా గసగసాలు, జీలకర్ర, సోంపు, కొబ్బరి తురుము, జీడిపప్పు మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ తయారు చేసుకోవాలి.
2. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో నూనె వేసి, కాగినత తర్వాత ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత కరివేపాకు, మరియు పచ్చిమిర్చి వేసి వేగించాలి.
3. తర్వాత ఉల్లిపాయ ముక్కకూడా వేసి 3-4నిముషాల పాటు వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ కు మారిన తర్వాత అల్లం, వెల్లుల్లి ని వేసి మరో రెండు నిముషాలు వేగిస్తూ బాగా మిక్స్ చేయాలి.
4. ఇప్పుడు అందులోనే టమోటో ముక్కలు మరియు ఉప్పు తో పాటు పసుపు, కారం మరియు ధనియాల పొడి వేసి, అన్ని బాగా కలగలుపుతూ మరో 5నిముషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
5. ఈ వేగించే మిశ్రంమీద ఆయిల్ తేలుతూ గ్రేవీలా తయారవుతుంది. ఇప్పుడు రెండు కప్పుల నీళ్ళు పోసి బాగా ఉడికించాలి. ఇప్పుడు అందులో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకొన్నగసగసలా మిశ్రమాన్ని మిక్స్ చేసి బాగా కలగలిపి మరో ఐదునిముషాల పాటు ఉడికించాలి. మద్య మద్యలో కలుపుతుండాలి. అంతే టమోటో కుర్మా రెడీ. ఈ టమోటో కుర్మాను దోసకి చాలా టేస్టీగా ఉంటుంది. అంతే కాదు లెమన్ రైస్ మరియు పులావ్ వంటి వాటి చాలా బాగా ఉంటుంది.

English summary

Tomato Kurma: A Tangy Southern Curry | టమోటో కుర్మా...వహ్ క్యా టేస్ట్ హై


 It is amazing to know how a delectable Indian curry can change the flavour of a boring rice dish or an average dosa. Tomato Kurma is one such South-Indian recipe that is very popular as a side dish with dosa or rice. Tomato kurma is not a chutney or sambhar. It is plainly a curry recipe made with tomatoes.
Story first published: Tuesday, February 26, 2013, 11:45 [IST]
Desktop Bottom Promotion