For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాట్ అండ్ స్పైస్ పీస్ టమోటో రైస్ : రైస్ స్పెషల్

|

ప్రతి వంటింట్లో ఉల్లిపాయ మహారాజు, టమాట మహారాణి. ఈ రెండు ఉంటే చాలు గంపెడు కూరగాయలున్నట్టే . ఇప్పుడు కాస్త వాతావరణం చల్లబడి మంచి టమాటాలు అందుబాటైన ధరలో దొరుకుతున్నాయి. ఇక మనకు పండగే :) ... త్వరగా, శ్రమలేకుండా చేయగలిగే టమోటో రైస్ చేసుకోవచ్చు. కొద్దిగా టేస్ట్ డిఫరెంట్ గా ఉండాలంటే కొన్ని మసాలాలు మరియు పచ్చిబఠానీలతో వండితే చాలా రుచికరంగా ఉంటుంది.

ఈ స్పైసీ టమోటో పీస్ రైస్ రిసిపిని తయారుచేయడం చాలా సులభం, చాలా త్వరగా కూడా తయారుచేయవచ్చు. ఈ పీస్ టమోటో రైస్ రిసిపిని ఎలా తయారుచేయాలో క్రింది విధంగా చూద్దాం..

Tomato Rice With Peas Recipe

కావల్సిన పదార్థాలు
బియ్యం: 2cups
టమోటో: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ఉల్లిపాయ: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి.
పచ్చిబఠానీలు: 5tbsp
పచ్చిమిర్చి: 1(చిన్న ముక్కలు తరిగి పెట్టుకోవాలి
అల్లం&వెల్లుల్లి: 1tsp
కారం: 1tsp
టమోటో సాస్: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు: 2cup
నెయ్యి: 2tbsp

తయారుచేయు విధానం:
1. ప్రెజర్ కుక్కర్ లో కొద్దిగా నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
2. తర్వాత కుక్కర్ లో టమోటో ముక్కలు వేసి 5నిముషాలు ఫ్రై చేయాలి.
3. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మరియు కారం, వేసి ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత అందులోపచ్చిబఠీనీలు కూడా వేసి, ఫ్రై చేస్తూ 5నిముషాలు ఉడికించుకోవాలి.
5. ఇప్పుడు మీ రుచికి తగినట్లు టమోటో సాస్ మరియు ఉప్పు వేసి మిక్స్ చేసి మరో 5నిముషాలు పూర్తిగా ఉడకనివ్వాలి .
6. ఇప్పుడు అందులో వాష్ చేసి పెట్టుకొన్న బియ్యం వేసి ఒకటి రెండు నిముషాలు ఫ్రై చేసుకొని , సరిపాడా నీళ్ళుపోసి మొత్తం మిశ్రమాన్ని కలగలిపి తర్వాత మూత పెట్టాలి.
7. నాలుగు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించి తర్వాత స్టౌఆఫ్ చేయాలి. అంతే పీస్ టమోటో రైస్ రిసిపి రెడీ.

English summary

15 Minute Tomato Rice With Peas Recipe

Tomato rice also known as tomato bath is a famous dish in South India. This sweet and spicy rice recipe is simple, quick and easy to prepare.
Story first published: Saturday, April 25, 2015, 14:43 [IST]
Desktop Bottom Promotion