For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్రులు మెచ్చిన టమోటో నువ్వుల పచ్చడి

|

Tomato -Seasom Seeds Chutney
సాధారణంగా టమోటోలతో ఏ వంట చేసినా చాలా టేస్ట్ గా ఉంటుంది. ఎక్కువగ టమోటో చట్నీ, టమోటో గుజ్జు, టమోటో బాత్, టమోటో పులవ్, టమోటో పికెల్ ఇలా చాలా వెరైటీలను చేస్తుంటారు. ఏవంటైనా సరే చూడగానే నోరూరించాల్సిందే. అంత మధురమైన టేస్ట్ ఉంటుంది.

మనం నువ్వులను అరుదుగా వాడుతుంటాం. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి ఈ రెండింటి కాంబినేషల్లో తయారు చేసే చట్నీ అద్భుతమైన టేస్ట్ ఇస్తుంది. ఇది గీ రైస్, ప్లెయిన్ వైట్ రైస్, దోస, చపాతీలలోనికి కూడా మంచి రుచిగా ఉంటుంది. సాంబార్, రసం అన్నంలోని బెస్ట్ సైడ్ డిష్ ఇది. మరి ఇంకెందుకు ఆలస్యం టమోటో నువ్వుల చట్నీని తయారు చేసేయండి.

కావల్సిన పదార్థాలు:
టమోటోలు: 2
నువ్వులు: 2 tsp
పచ్చిమిర్చి: 2
ఎండు మిర్చి: 3-6
చింతపండు పేస్ట్: 2 tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత

తయారు చేయు విధానం:
1. ముందుగా నువ్వులను ఫ్రైయింగ్ పాన్ లో వేసి వేయించికొని పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత డీప్ బాటమ్ పాన్ ను స్టౌ మీద పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేసి, అందులో పచ్చిమిర్చి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత ఎండు మిర్చి కూడా వేసి వేయించుకోవాలి. అలాగే టమోటో ముక్కలు కూడా వేసి నీరు పోయేంత వరకూ వేయించు కోవాలి. తర్వాత చింతపండు గుజ్జును టమోటోముక్కల్లో వేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు మిక్సీలో ముందుగా వేయించి పెట్టుకొన్న నువ్వులను, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకొన్న టమోటో చింత గుజ్జుతో సహా వేసి, ఉప్పు కూడా వేసి మరో సారీ గ్రైండ్ చేసుకోవాలి. అంతే నువ్వుల టమోటో చట్నీ రెడీ. దీన్ని వేడి వేడి గ్రీ రైస్ తో టింటే చాలా రుచిగా ఉంటుంది.

English summary

Tomato -Seasom Seeds Chutney | కమ్మని టమోటోనువ్వుల పచ్చడి

A good tomato chutney take some beating, and this version is great because it's not too sweet. Great tasting Traditional Tomato Chutney made with the finest ingredients.
Story first published:Friday, February 1, 2013, 11:38 [IST]
Desktop Bottom Promotion