For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉడిపి సాంబార్: కర్నాటక స్పెషల్

|

టెంపుల్ టౌన్ గా పిలువబడే ఉడిపిలో చాలా ఫేమస్ అయినటువంటి రిసిపి ఉడిపి సాంబార్. ఈ పాపులర్ అయినటువంటి రిసిపిని కర్ణాటకాలో చాలా పేమస్ అయినటువంటి టెంపుల్ టౌన్ ఉడిపిలో దీన్ని ఎక్కువగా సర్వ్ చేస్తారు. ముఖ్యంగా ఈ ఉడిపి సాంబార్ ఇడ్లీ మరియు దోసలలోకి బెస్ట్ కాంబినేషన్.

ఈ ఉడిపి స్పెషల్ సాంబార్ కు స్పెషల్ సాంబార్ పౌడర్ అవసరం లేదు. ఈ సాంబార్ ను ప్రత్యేకంగా వివిధ రకాలా కూరగాయలను ఉపయోగించి తయారుచేయవచ్చు. అలాగే ఎటువంటి కూరగాయలు లేకున్నా కూడా సాంబార్ ను తయారుచేయవచ్చు.

Udipi Sambar-Karnataka Special

కావలసిన పదార్థాలు:

కందిపప్పు: 50grsm
బంగాళదుంప ముక్కలు: 1/2cup
క్యారట్ తరుగు: 1/2cup
ఉల్లిపాయతరుగు: 1/2cup
ఉప్పు: రుచికి తగినంత
చింతపండు: చిన్న నిమ్మకాయంత (నానబెట్టి రసం తీయాలి)
బెల్లం తురుము: 2tsp
నూనె: 2tbps

పేస్ట్ కోసం:

జీలకర్ర:1/2tsp
మినప్పప్పు: 1tsp
ఎండుమిర్చి: 4
పచ్చి శనగపప్పు: 2tsp
ధనియాలు: 2tbsp
మిరియాలు: 6
కొబ్బరితురుము: 1/2cup

పోపు కోసం:

ఆవాలు: 1/2tsp
మినప్పప్పు: 1/2tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
ఇంగువ: చిటికెడు
పచ్చిమిర్చి: 3
కొత్తిమీర: చిన్నకట్ట

తయారు చేయు విధానం:

1. కందిపప్పును శుభ్రంగా కడిగి, తగినంత నీరు పోసి కుక్కర్ లో ఉంచి ఐదు విజిల్స్ వచ్చాక దించేయాలి ఒక గిన్నెలో బంగాళదుంప, క్యారట్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, తగినంత నీరు పోసి ఉడికించాలి.
2. తర్వాత పాన్ లో ఒక టేబుల్ స్పూను నూనె వేసి కాగాక జీలకర్ర, మినప్పప్పు, పచ్చి శనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, కొబ్బరి తురుము ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. ఇప్పడు చింతపండు రసం, ఉప్పు వేసి ఐదు నిముషాలు మరిగించాలి. ఉడికించి మెత్తగా చేసుకున్న కందిపప్పు, కూరగాయల ముక్కలు, మసాలా పేస్ట్, బెల్లం తురుము వేసి కలపాలి తగినంత నీరు జత చేసి, మంట తగ్గించి 15 నిముషాలు ఉంచి దించేయాలి.
4. పాన్‌లో టేబుల్ స్పూను నూనె వేసి కాగాక అందులో ఆవాలు, మినప్పప్పు, ఇంగువ, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి వేయించి, సాంబార్‌లో వేయాలి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
అంతే ఉడిపి సాంబార్ రెడీ.

English summary

Udipi Sambar-Karnataka Special

Udupi sambar is a very popular dish known after the famous temple town, Udupi. This is the recipe served in the famed Udipi restaurants (the exponents of Mangalorean cuisine worldwide) with dosas and idlis. You do not need sambar powder with this recipe. Omit whichever veges you cannot find. You can make this without veggies too.
Story first published: Wednesday, April 2, 2014, 12:07 [IST]
Desktop Bottom Promotion