For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెజిటేబుల్ బిర్యానీ: వీకెండ్ స్పెషల్

|

ఇది ఒక ఎక్సొటిక్ రైస్ డిష్. మసాలా దినుసులు, మరియు కొన్ని రకాల వెజిటేబుల్స్ తో తయారుచేస్తారు. ఈ ఆరోమా వాసన కలిగిన ఈ వెజిటేబుల్ డిష్ పిల్లలకు పెద్దలకు చాలా ఇష్టం. అంతే కాదు. వెజ్ బిర్యాని చాల సులువుగా తయారిచేసుకోవచ్చు. అంతే కాకుండ అన్ని రకాల కూరగాయలు ఉపయెగించడం వలన, విటమిన్స్ ఎక్కవ శాతం పొందగలం. దీనికి ఎక్కువ మసాల అవసరం వుండదు.

ముఖ్యంగా ఈ స్పెషల్ డిష్ ను ఎటువంటి కార్యక్రమానికైనా తయారుచేసుకోవచ్చు. మరి మీరు కూడా సింపుల్ వెజిటేబుల్ బిర్యానీ టేస్ట్ చేయాలంటే ఈ వీకెండ్ లో ట్రై చేయండి...

Vegetable Biryani: Weekend Special

కావలసిన దినుసులు:
బాస్మతి బియ్యం : 500grm
పచ్చిమిరపకాయలు : 8
లవంగాలు : 6
యాలకలు : 3
చెక్క : చిన్నముక్క
పలావ్ ఆకు : 1
జీడిపప్పు : 10
పలావ్ పువ్వు(స్టార్ ఆన్సీ): 1 లేదా 2
ఉల్లిపాయ : 1
బీన్స్ ముక్కలు : 1cup
క్యారెట్ ముక్కలు : 1cup
పచ్చిబటాని : 1cup
టమాట ముక్కలు : 1cup
ఆలుగడ్డ ముక్కలు : 1cup
స్వీట్ కార్న్ : 1cup
ఉప్పు : రుచికి సరిపడా
నెయ్యి : 2tbsp

తయారుచేయు పధ్ధతి:
1. ముందుగా బియ్యం అరగంట ముందు నాన పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక కడాయిని స్టౌ మీద పెట్టి అది వేడెక్కిన తరవాత నెయ్యి వేసి జీడిపప్పును, పలావ్ ఆకును, మసాల దినుసులను వేయించి ప్రక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అదే కడాయిలొ పచ్చి మిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి.
4. ఇప్పుడు అవి వేగుతుండగ వెజిటేబు ముక్కలన్ని ఒకదాని తరవాత ఒకటి వేసి కలుపుకొని రెండు నిమషాలు మూత పెట్టి వుండకించి ఉప్పువేసుకోవాలి.
5. వెజిటేబుల్ ఆఫ్ బోయిల్ అయిన తరవాత అందులో బియ్యం వేసుకొవాలి. ఒక గ్లాసు బీయ్యనికి గ్లాసున్నర నీళ్ళుపోసి ఎలట్రికల్ కుక్కర్ లో పెట్టుకోవాలి.
6. అందులో ముందుగా వేయించి పెట్టుకున్న మసాలు దినుసులు కూడ వేసుకోవాలి. ఇది ఉడకడానికి సుమారుగా 20 నిముషాలు పడుతుంది.
7. వెజ్ బిర్యానిని ఉల్లిపాయల రైయితాతో తింటే చాలా రుచికరంగా ఉంటుంది. అంతే! ఎంతొ రుచికరమైన వెజ్ బిర్యాని రెడీ.
(ప్రెషర్ కుక్కర్ లో అయితే గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని మూడు విజిల్స్ వచ్చెవరకు పెట్టుకవాలి)/(ఎలట్రికల్ కుక్కర్ లో ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు నీళ్ళు కూడ వేసుకోవచ్చు గాని కొంచెం అన్నము గట్టిగా వుంటుంది).

English summary

Vegetable Biryani: Weekend Special

This is a very exotic rice dish with spicy vegetables. The rich aroma makes this dish very inviting among kids n all. Also, this biryani is a special dish on party occasions and goes very well with onion raita or any curries.
Story first published: Saturday, March 15, 2014, 12:44 [IST]
Desktop Bottom Promotion