For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెజిటబుల్ కిచిడీ

|

కిచిడి ట్రెడిషినల్ ఇండియన్ డిష్. సాధారణంగా దీన్ని బియ్య, పప్పుతో తయారు చేస్తారు. ఇది తయారు చేయడం సులభం మాత్రేమే కాదు, ఇందులో న్యూట్రీషియన్స్ కూడా అధికమే. ఇది పెరుగు, రైతాతో సర్వ్ చేసేటటువంటి మెయిన్ డిష్.

మిక్స్డ్ వెజిటేబుల్ కిచిడి చాలా సులభంగా తయారు చేసే రైస్ వంటకం. మరియు రైస్ తో కొన్ని పప్పులు చేర్చి తయారు చేసే పాపులర్ రైస్ ఐటమ్. వెజిటేబుల్ కిచిడి తయారు చేయడానికి పప్పు, రైస్ తో పాటు వివిధ రకాల వెజిటేబుల్స్ కూడా చేర్చి తయారు చేస్తారు. దీన్ని

Vegetable Khichdi
కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం: 2cups
పెసరపప్పు : 1cup
లవంగాలు: 5
అల్లం వెల్లులి ముద్ద: 2tsp
బఠాణీలు : 150grms
క్యారట్ : 1
ఉల్లిగడ్డలు: 3
కారం: 1tsp
పసుపు : 1tps
జీలకర : 1tsp
ఆవాలు : 1tsp
బే ఆకులు: 2
గరం మసాలా: 1tsp
నూనె : తగినంత
నీరు : తగినంత
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేసే పద్ధతి:
1. ముందుగా బియ్యం, పప్పు కలిపి గంటసేపు నానబెట్టాలి.
2. తర్వాత ఒక పాత్రలో నూనె పోసి కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడాక మిగిలిన మసాలా దినుసులన్నీ వేయాలి.
3. ఇప్పుడు కూరగాయ ముక్కలు, బఠాణీలు వేయించాలి. తర్వాత బియ్యం, పప్పు వేసి పది నిమిషాలు వేయించి అందులో ఐదు కప్పుల నీరు పోసి ప్రెషర్ కుక్కర్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికిస్తే ‘వెజిటబుల్ కిచిడీ'రెడీ. పెరుగు రైతాతో కలిపి తింటే మంచి రుచిగా ఉంటది.

English summary

Vegetable Khichdi | వెజిటబుల్ కిచిడీ


 Mix vegetable khichdi is a simple recipe for preparing the popular rice and lentil based recipe called khichadi. Added vegetables to the dal and rice mixture makes the vegetable khichadi a complete meal in itself. Enjoy with fresh curds.
Story first published: Thursday, February 21, 2013, 10:40 [IST]
Desktop Bottom Promotion