For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెజిటేబుల్ పాన్ కేక్:హెల్తీ బ్రేక్ ఫాస్ట్

|

బ్రేక్ ఫాస్ట్ తప్పని సరిగా తినాలంటుంటారు. ఎందుకంటే దినచర్య మొదలయ్యేది బ్రేక్ ఫాస్ట్ తోనే కాబట్టి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాంశాలు పుష్కలంగా అందుతాయి. దాంతో రోజంతా ఉత్సహాంగా, పూర్తి ఎనర్జీతో ఉండవచ్చు.

ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ కడుపు నింపేదిగా ఉండాలి. అదే సమయంలో ఆరోగ్యానిక మేలు చేయాలి. శరీరానికి తగినంత శక్తినివ్వాలి. కాబట్టి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, త్రుణధాన్యాలు, పాలు పండ్ల, తేనె తో తయారు చేసే బ్రేక్ ఫాస్ట్ లు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. వీటిలో గ్రీన్ వెజిటేబుల్స్ తో వెజిటేబుల్ పాన్ కేక్ తయారుచేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. మరియు కడుపు నిండుగా ఉండే అనుభూతిని కలిగిస్తుంది. మరి దీన్ని ఎలా యతారుచేయాలో ఒకసారి చూదాం..

Vegetable Pancakes For Breakfast

కావల్సిన పదార్థాలు:
మైదా: 3tbsp
కార్న్ ఫ్లోర్: 2tbsp
బియ్యం పిండి : 3tbsp
బేకింగ్ పౌడర్:1tsp
బంగాళాదుంప:1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
క్యారెట్:1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
క్యాప్సికమ్: 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 2 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
జీలకర్ర పొడి: ½tbsp
పసుపు: ½tbsp
కారం: ½tbsp
స్ప్రింగ్ ఆనియన్(చిన్న ఉల్లిపాయలు): 2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
నిమ్మ రసం: 1tbsp
ఆయిల్ : సరిపడా
నీళ్ళు : 1cup
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయువిధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, నీళ్ళు కూడా పోసి, చిక్కగా, జారుడుగా పిండిని కలుపుకోవాలి.
2. తర్వాత కలుపుకొన్న పిండిలో పైన సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటిని వేసి, మాగా మిక్స్ చేయాలి. పిండి మీర చిక్కగా లేదా మరీ పల్చగా లేకుండా సమంగా, కలుపుకోవాలి.
3. కలుపుకొన్న ఈ మిశ్రమాన్ని ఒక సదినిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
4. పది నిముషాల తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, మీడియం మంట పెట్టి పాన్ మీద ఒక గరిటె పిండి తీసుకొని దోసెలా వేయాలి. తర్వాత దోసెమీద మరియు దోసె చివర్లు నూనె వేసి, బాగా కాలనివ్వాలి.
5. నూనె చిలకరించిన తర్వాత మూత పెట్టి 2-3నిముషాలు కాలనివ్వాలి. తర్వాత మూత తీసి చూసి దోసె పసుపుపచ్చవర్ణంలో తిరిగి ఉంటే, దోసకాలిందనుకొని, అవసరం అయితే రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి.
6. ఇలా మొత్తం పిండిని, ఇదే విధంగా దోసె పోసుకోవాలి. అంతే వెజిటేబుల్ పాన్ కేక్ రెడీ..

English summary

Vegetable Pancakes For Breakfast


 Breakfast recipes rank the highest in terms of importance. Breakfast is your most important meal of the day.
 This vegetable pancakes is an easy breakfast recipe and not at all time consuming.
Story first published: Thursday, September 5, 2013, 10:50 [IST]
Desktop Bottom Promotion