For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెజిటేబుల్ పొంగల్: పండుగ స్పెషల్

|

వెజిటేబుల్ పొంగల్ ఇది ఒక క్లాసిక్ సౌత్ ఇండియన్ మీల్ రిసిపి. దీన్ని బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎప్పుడైనా తినవచ్చు. ఈ పొంగల్ రిసిపిని మన సౌంత్ ఇండియన్ ఇల్లలో వారానికి ఒక సారైన వండాల్సిందే. ఈ స్పెషల్ పొంగల్ రిసిపిని సాధారణంగా పెసరపప్పు, బియ్యంతో తయారుచేస్తారు. అయితే మరింత టేస్టీగా మరియు హెల్తీగా తయారుచేయాలంటే ఇందులో కొన్ని వింటర్ వెజిటేబుల్స్ మిక్స్ చేయడం వల్ల అద్భుత టేస్ట్ కలిగి ఉంటుంది.

చక్కెర పొంగల్ : పొంగల్ స్పెషల్ రిసిపి

ఈ సింపుల్ పొంగల్ రిసిపిని తయారుచేయడం చాలా సులభం మరియు చాలా సింపుల్ గా తయారుచేయవచ్చు. ఈవంటను పెద్దలు మాత్రమే కాదు, చిన్నపిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడుతారు. ముఖ్యంగా ఈ వంటకు వివిధ రకాల వెజిటేబుల్స్ జోడించడం వల్ల విటమిన్స్, మినిరల్స్, ఫైబర్ పుష్కలంగా అందుతాయి. మరియు ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ కూడా అంది, ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది కడుపు నింపు, రుచికరంగా టేస్టీగా సంతోషపరచడంతో పాటు రోజంతా ఎనర్జీగా ఉండేందుకు సహాయపడుతుంది.

కారా పొంగల్ టేస్టీ అండ్ హెల్తీ

Vegetable Pongal: Healthy and Tasty

కావల్సిన పదార్థాలు:
బియ్యం: 200grms
పెసరపప్పు: 100grms
క్యారెట్,బీన్స్, పచ్చిబఠాణీ, టమోటో(అన్నీ కలిపి): 100grms
పచ్చిమిరపకాయలు: 2
కరివేపాకు: రెండు రెమ్మలు
మిరియాలు: 1tsp
జీలకర్ర: 1tsp
అల్లం: చిన్న ముక్క
ఇంగువ: చిటికెడు
నూనె : 2tbsp
నెయ్యి: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా బియ్యం, పెసరపప్పును కలిపి కడిగి తగినన్ని నీళ్ళు పోసి, అరగంట సేపు నాననివ్వాలి.
2. తర్వాత కూరగాయలన్నీ చిన్న ముక్కలుగా తరగాలి.
3. ఇప్పుడు ఒక పద్దగిన్నెలో నూనె, నెయ్యి వేసి వేడయ్యాక అందులో ఇంగువ, జీలకర్ర, మిరియాలువేసి దోరగా వేగినివ్వాలి.
4. వేగిన తర్వాత అందులో మద్యలోకి కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి.
5. అవి వేగిన తర్వాత అందులో క్యారెట్, బీన్స్ ముక్కలు, బఠాణీ గింజలు వేసి సన్న మంట మీద మగ్గనివ్వాలి.
6. ఇప్పుడు అందులో టమోటో ముక్కలు వేసి, అవీ మగ్గిన తర్వాత నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి మరుగనివ్వాలి.
7. నీరు బాగా మరిగేటప్పుడు అందులో బియ్యం, పెసరపప్పు, వేసి మెత్తగా ఉడికించాలి. అంతే చివరగా కొద్దిగా నెయ్యి వేసి దింపుకోవాలి అంతే వెజ్ పొంగల్ రెడీ.

English summary

Vegetable Pongal: Healthy and Tasty

Pongal has become one of our go-to comfort foods these days. Pongal is a classic one item meal most popular as a breakfast in South India. It would not be an overstatement to say that most South Indians would have eaten it at least once. Vegetable pongal is one whole meal which has the vitamins, minerals and fiber from vegetables, plus proteins and carbohydrates from dhal and rice. It is a very filling and a satisfying dish which keeps your day going with loads of energy. Here's how to make it with step by step photos and instructions.
Desktop Bottom Promotion