For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెజిటేబుల్ ఆమ్లెట్-టేస్టీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి

|

ఉదయం తీసుకొనే అల్పాహారం ఆరోజంతటికి చాలా ముఖ్యమైనది. ఎందకంటే ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీనులు, న్యూట్రిషయన్ అంది, ఆరోజంతటికి మనకు కావల్సిన శక్తినందిస్తుంది. దాంతో మనం ఉత్సాహంగా పనిచేయడానికి సహాయపడుతుంది. అందుకే ఉదయం తయారుచేసే బ్రేక్ ఫాస్ట్ రిసిలు వివిధ రకాలుగా..వివిధ వెరైటీలు ఉన్నాయి. అదేవిధంగా, బ్రెడ్ మరయు గుడ్డు రెండు ప్రతి ఇంట్లోనూ డామినేట్ చేస్తుంటాయి. ముఖ్యంగా బ్యాచులర్ గా లేదా ఒక్కరే ఉండే వారి ఇల్లల్లో చాలా సందర్బాల్లో బ్రెడ్ మరయు ఆమ్లెట్టే. దీన్ని సాదారణంగా తయారు చేసి వంటకాదు, వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరం మరియు కడుపు నిండుగా ఉంటుంది. గుడ్డులో అనేక న్యూట్రీషియన్స్ బెనిఫిట్స్ కలిగి ఉన్నాయి. కాబట్టే అవి ఉదయం తీసుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యానికి ఆరోగ్యకరం.

Vegetables Omelette: Breakfast Recipe

ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ రిసిపిలో వెరైటీల్లో ఆమ్లెట్స్ లో చాలా రకాలున్నాయి. మీకు ఆఫీసుకు ఆలస్యం అయిందంటే కొన్ని స్పైసీలను(ఉప్పు, రెడ్ చిల్లీ,బ్లాక్ పెప్పర్) ఉపయోగించి ఆమ్లెట్ తయారు చేసేస్తుంటారు . అదేవిధంగా, కొన్ని వెజిటేబుల్స్ (ఉల్లిపాయ, టమోటో, స్ప్రింగ్ బీన్స్,కొత్తిమీర తరుగు) మిక్స్ చేసుకొని , హెల్తీ మరియు కడుపు నిండేట్లుగా ఒక ఆమ్లెట్ రిసిపిని తయారు చేసుకోండి. చాలా రుచిగానూ..ఆరోగ్యానికి ఆరోగ్యకరంగాను ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. బ్రేక్ ఫాస్ట్ రిసిపి తయారు చేసేసుకోండి.

కావల్సిపదార్థాలు:
గుడ్లు: 2-3
ఉల్లిపాయలు: 1(సన్నగా కట్ చేసుకోవాలి)
టమోటో: ½ (సన్నగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 2 (సన్నగా కట్ చేసుకోవాలి)
స్ర్పింగ్ బీన్స్ : 1 (సన్నగా కట్ చేసుకోవాలి)
బ్లాక్ పెప్పర్ పౌడర్: చిటికెడు
రెడ్ చిల్లీ పౌడర్: ½ tsp
పాలు: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె లేదా బట్టర్: 1tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ ల్లో గుడ్లను పగుల గొట్టి అందులో పోయాలి. అందులోనే మిగిలిన పదార్ధాలు, అంటే ఒక చెంచా పాలు, ఉల్లిపాయ ముక్కలు, టమోటోలు, స్ర్పింగ్ బీన్స్, పచ్చిమిర్చి, ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా గిలకొట్టాలి.
2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ స్టౌ మీద పెట్టి వేడయ్యాక దాని మీద కొద్ది నూనె లేదా బట్టర్ రాసి మిక్స్ చేసి పెట్టుకొన్న ఎగ్ వెజిటేబుల్ మిశ్రమాన్ని ఆమ్లెట్ గా వేయాలి. మీడియం మంట మీద రెండు మూడు నిముషాల పాటు ఒక వైపు కాలిన తర్వాత మరో వైపుకు టర్న్ చేసుకొని ఆవైపు కూడా బేక్ చేసుకోవాలి.
3. ఆమ్లెట్ టర్న్ చేయడానికి వుడెన్ స్పూన్ ఉపయోగించడం వల్ల మద్యకు కట్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఆమ్లెట్ రెడీ అయిన తర్వాత ఒక టి రెండు నిముషాలు స్టౌమీద అలాగే ఉంచి ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకోవాలి. అంతే వేడి వేడి హెల్తీ వెజిటేబుల్ బ్రేక్ ఫాస్ట్ రెడీ . చివరగా కొత్తిమీర తరుగుతో గార్ని చేసి సర్వ్ చేయాలి.

English summary

Vegetables Omelette: Breakfast Recipe | వెజిటేబుల్ ఆమ్లెట్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్


 Breakfast is one of the most important meals of the day. There are many breakfast recipes that you can prepare. However, bread and eggs seems to dominate most of the household. Even people who stay alone rely on bread and omelette for breakfast. This is not just commonly prepared breakfast recipe, but it is healthy and filling too. Eggs have many nutritional benefits that are good for the overall health.
Story first published: Friday, March 15, 2013, 9:01 [IST]
Desktop Bottom Promotion