For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీ అండ్ న్యూట్రీషినల్ పాలక్ పొరియల్

|

ఆకు కూరల్లో ముఖ్యంగా పాలకూర. పాలకూరలో ఉన్న పోషకాలు మరి ఏ ఆక్కూరలోనూ అంత ఎక్కువగా ఉండవని అంటుంటారు. ఇందులో విటమిన్ ఏ, సీ, ఫైబర్, ఫోలిక్ యాసిడ్ మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు, పెద్దలు అందరూ తాజా ఆకుకూరలను తమ నిత్యాహారంలో తప్పకుండా తీసుకోవాలి. ఆకుకూరలు ఎన్నోరకాలుగా వండుకోవచ్చు.

పాలకూరతో పొరియల్ (పాలక్ ఫ్రై)తయారుచేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. ఇది రైస్ మరియు రోటీలకు బెస్ట్ కాంబినేషన్. ఈ పాలక్ పొరియల్ తయారుచేయడానికి చాలా తక్కవ సమయం పడుతుంది. ఈ పొరియల్ కు నీరు జోడించకుండానే తయారుచేస్తారు. చాలా సులభంగా మరియు త్వరగా తయారవుతుంది. మరి ఈ న్యూట్రీషియన్ పాలక్ పొరియల్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

World Earth Day Special: Palak Poriyal Recipe

కావల్సిన పదార్థాలు:
బచ్చలికూర: 2కట్టలు(సన్నగాతరిగినవి)
ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 4 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 2 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
శెనగపప్పు: 1tbsp
ఉద్దిపప్పు: 1tbsp
కొబ్బరి: 4tbsp(తురిమిన)
పసుపు: 1tsp
ధనియాల పొడి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
జీలకర్ర: 1tsp
నూనె: 1tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా ఆకు కూరను శుభ్రంగా కడిగి, తర్వాత సన్నగా తరిగి పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, శెనగపప్పు, ఉద్దిపప్పు, వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
3. పోపుదినుసులు, బ్రౌన్ కలర్ కు మారగానే అందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద మరో 5నిముషాలు వేయించుకోవాలి.
4. తర్వాత అందులో కట్ చేసుకొన్న ఆకుకూరను వేసి మరో 5-10 మీడియం మంట మీద వేగించుకోవాలి .
5. 5నిముషాల తర్వాత ఉప్పు, పసుపు మరియు ధనియాలపొడి వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి.
6. ఇప్పుడు అందులో పచ్చికొబ్బరి తురుమున వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకటి రెండు నిముషాల వేగించుకొని తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ న్యూట్రీషియన్ పాలర్ పొరియల్ రెడీ. అన్నం, చపాతీతో సర్వ్ చేయవచ్చు.

English summary

World Earth Day Special: Palak Poriyal Recipe

It's World Earth Day today. This is a day when all of us must take the vow and put in all the possible efforts to save our Mother Earth. As global warming threatens extinction of human life, we must do all that we can to protect our Earth. And the only way we can do this is through the 'Go Green' mantra.
Story first published: Thursday, March 20, 2014, 18:15 [IST]
Desktop Bottom Promotion