For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలూ మసాలా రిసిపి : టేస్టీ అండ్ హెల్తీ

|

వర్షాకాలం ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతోంది ఈ ఫర్ ఫెక్ట్ వాతారణానికి ఫర్ ఫెక్ట్ గా ఆహారం తీసుకోవాలని అనిపిస్తున్నదా? చలికి కారంగా ఏదైనా సైడ్ డిష్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారా? అయితే ఆలూ మసాలా ఫ్రై ఫర్ ఫెక్ట్ సైడ్ డిష్. ఆలూ మసాలా ఫ్రై సైడ్ డిష్ చాలా సులభంగా, సింపుల్ గా తయారుచేయవచ్చు.

చాలా తక్కువ మసాలా దినుసులతో రుచికరంగా ఆలూ మసాలా ఫ్రై తయారుచేయవచ్చు. ఇది ప్లెయిన్ వైట్ రైస్ మరియు రోటీలకు చక్కటి కాంబినేషన్. మరి ఈ సింపుల్ అండ్ ఈజ్ ఆలూ మసాలా ఫ్రై ఎలా తయారుచేయాలో చూద్దాం...

Yammy Aloo Masala Recipe: Telugu Vantalu


కావల్సిన పదార్థాలు:
ఆలూ(బంగాళదుంపలు): 6
పచ్చిమిర్చి : 8-10
జీలకర్ర: 2tbsp
ఆవనూనె: సరిపడా
కరివేపాకు రెబ్బలు: 2
ఎండుమిర్చి 3
ధనియాలపొడి: 2tsp
గరం మసాలా: 1tbsp

READ MORE: ట్యాంగీ మసాలా ఆలూ: బెస్ట్ రోటీ కాంబినేషన్
కొత్తిమీర: 1కట్ట
ఉప్పు: రుచికి తగినంత
వెల్లుల్లి రెబ్బలు: 3

READ MORE: ఆలూ గోబీ మసాలా -అద్భుతమైన టేస్ట్

తయారుచేయు విధానం:
1. ముందుగా ఆలూని శుభ్రంగా కడిగి తొక్క తీసి సన్నగా...పొడవుగా కట్ చేసి నీళ్లలో వేసుకోవాలి.
2. తర్వాత పచ్చిమిర్చిని పొడుగ్గా తరిగి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలూ, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
4. తర్వాత అందులోనే ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేయాలి.
5. ఒక నిముషం తర్వాత తరిగిన ఆలూ వేసి మూత పెట్టేయాలి. ఆలూ కొద్దిగా వేగిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, ధనియాలపొడి వేయాలి.
6. కొద్దిసేపటికి ఆలూ ఉడికిన తర్వాత గరం మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేసి కొత్తిమీరను చల్లాలి. అంతే ఆలూ మసాలా రెడీ. దీన్ని వైట్ రైస్ మరియు రొట్టెల్లోకి వడ్డిస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Yammy Aloo Masala Recipe: Telugu Vantalu

Yammy Aloo Masala Recipe, Telugu Vantalu. The rains have just started pouring in and it is the perfect weather to munch on something perfectly spicy. When the rains start coming, you can enjoy the weather with some 'garam chai' and some really spicy masala aloo fry.
Story first published: Wednesday, July 22, 2015, 14:16 [IST]
Desktop Bottom Promotion