For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బేబీకార్న్-పనీర్ పులావ్: హెల్తీ అండ్ టేస్టీ

|

బేబీకార్న్ పనీర్ పులావ్ చాలా సింపుల్ అండ్ టేస్టీ రిసిపి. కొన్ని మసాలా దినుసులతోటి, బేబీకార్న్, పనీర్ తో తయారుచేసే ఈ పులావ్ రిసిపిని చాలా వెరైటీగా తయారుచేసుకోవచ్చు. నార్త్ ఇండియన్స్ తో పాటు, సౌత్ ఇండియన్స్ కూడా ఎక్కువగా ఇష్టపడే ఈ వంటను పిల్లలు మరియు పెద్దలు ఎక్కువ ఇష్టపడుతారు. ఇలాంటి వెరైటీ వంటలను మీరు రుచి చూడాలంటే ఒక సారి ప్రయత్నించాల్సిందే...

బేబీకార్న్ డైట్ అనుసరించే వారికి ఒక మంచి ఫుడ్. ఇందులో చాలా తక్కువ క్యాలరీలు కలిగి ఉంటుంది . విటమిన్ బి పుష్కలంగా ఉండి జీర్ణక్రియకు గ్రేట్ గా సహాయపడుతాయి. అలాగే ఇందులో ఉండే ఫొల్లెట్స్ మొదడు చురుకుగా పనిచేయడానికి సహాయపడుతాయి. ఇక రెండవ హెల్తీ కాంబీనేషన్ పనీర్ పోషకాల గణి అని చెప్పవచ్చు. ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది.ఇది ఎముకలకు బలాన్ని అందిస్తుంది. మరియు బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ రెసిస్టెంట్ సిండ్రోమ్ పెరుగుదలను నివారిస్తుంది. ప్రోటీనలు, అందిస్తుంది, స్టొమక్ డిజార్డర్ ను నివారిస్తుంది. లోపెయిన్ బ్యాక్ మరియు జాయింట్ పెయిన్స్ లో నివారించడంలో ఇది గ్రేట్. మరి ఇన్ని సుగుణాలున్నా ఈ రెండింటి కాబినేషన్ లో రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం...

Yammy Baby Corn-Paneer Pulao

కావలసినవి:
బాస్మతి బియ్యం : 1cup
బేబీకార్న్‌లు : 12
పనీర్: 1cup
ఉల్లిపాయ: 1 లేదా 2
కొబ్బరి పాలు (పలుచగా): 2cups
బిర్యానీ ఆకు : 1
పసుపు: చిటికెడు
దాల్చిన చెక్క : చిన్న ముక్క
లవంగాలు : 3
యాలక్కాయలు : 2
ఉప్పు: రుచికి సరిపడా
నూనె లేదా నెయ్యి : 4tbsp

గుజ్జు కోసం:
కొత్తిమీర కట్టలు: 2
వెల్లుల్లి (చిన్నవి) : 5
అల్లం : చిన్న ముక్క
కొబ్బరి తురుము : 2tbsp
పచ్చిమిర్చి : 4
గరం మసాలా పొడి : 1/2tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యాన్ని కనీసం అర గంట పాటు నానపెట్టుకోవాలి.
2. ఉల్లిపాయని నిలువు ముక్కలుగా కోసుకోవాలి. బేబీకార్న్‌ను కుక్కర్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
3. ఒకవేళ బేబీకార్న్‌ను పలుచగా గుండ్రటి ముక్కలుగా కోసుకుంటే కనుక కుక్కర్‌లో ఉడికించాల్సిన అవసరం లేదు.
4. గుజ్జుకోసం కావాల్సిన పదార్ధాలన్నింటినీ మిక్సీలో తక్కువ నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి.
5. పులావ్‌ ను కుక్కర్‌ లో నేరుగా వండుతుంటే కనుక అందులోనే నూనె వేడిచేసి బిర్యానీ ఆకు, దాల్చినచెక్క, యాలక్కాయ, లవంగాలను వేసి వేగించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేగించాలి.
6. తర్వాత అందులోనే బేబీకార్న్, రుబ్బిన మసాల వేసి పచ్చి వాసన పోయే వరకు వేగించాలి. ఇందులో నానపెట్టిన బియ్యం వేసి ఒక నిమిషం పాటు ఉంచి కొబ్బరి పాలు పోసి ఉడికించాలి.
7. తరువాత ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టి సన్నటి మంట మీద పదినిమిషాల పాటు విజిల్ పెట్టకుండా ఉడికించాలి. అంతే బేబీ కార్న్ పనీర్ పులావ్ రెడీ. వేడివేడి పులావ్‌ని ఉల్లిపాయ రైతాతో లేదా నచ్చిన ఇంకేదైనా రైతాతో తినొచ్చు.
సూచన: పన్నీర్ ను నేరుగా బేబీకార్న్ తో వేసుకోవచ్చు లేదా పన్నీర్ ను లైట్ గా ఫ్రై చేసుకొని పలావ్ మొత్తం రెడీ అయిన తర్వాత మిక్స్ చేసుకోవచ్చు.

English summary

Yammy Baby Corn-Paneer Pulao

Baby Corn Biryani is really very delicious and goes well with raita. The aroma of this veg biryani recipe is amazing. This recipe can also be carried in a lunchbox. Baby corn pulao is a very popular and delectable dish from the Indian cuisine.
Desktop Bottom Promotion