For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యమ్నీ మష్రుమ్ రెడ్ పెప్పర్ రిసిపి

|

వెజిటేరియన్ వంటల్లో ఒక హెల్తీ వెజిటేబుల్ మష్రుమ్. ఈ హెల్తీ వెజిటేబుల్ వ్యాధినిరోధకతను పెంచుతుంది, మరియు శరీరంకు అవసరం క్యాల్షియం లెవల్స్ ను పెంచడంలో సహాయపడుతుంది . మరియు ఎక్కువ శక్తిని అంధిస్తుంది.

ఈ వెజిటేబుల్ వల్ల ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలున్నాయి . అందుకే మష్రుమ్ మరో హెల్తీ వెజిటేబుల్ రెడ్ పెప్పర్ ను కాంబినేషన్ లో ఒక డిష్ తయారుచేయవచ్చు.

దీన్ని తయారు చేయడం చాలా సులభం మరియు చాలా తర్వగా తయారుచేసేయవచ్చు. మరి ఈ వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం....

Yummy Mushroom Red Pepper Recipe

కావల్సిన పదార్థాలు:
మష్రుం: 250grms
ఉల్లిపాయ: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
టమోటో: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు : 2(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
రెడ్ పెప్పర్: 1(సన్నగా కట్ చేసుకోవాలి)
బ్లాక్ పెప్పర్ కార్న్: 1tsp
పసుపు: 1/2tsp
నూనె: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: కొద్దిగా (గార్నిష్ కోసం)

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
2. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత అందులోనే టమోటో ముక్కలు, మిరియాలు వేసి తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తున్నప్పుడే అందులో కొద్దిగా పసుపు కూడా వేయాలి.
4. టమోటో మెత్గగా వేగిన తర్వాత అందులో శుభ్రం చేసి పెట్టుకొన్న మష్రుమ్ మరియు రెడ్ పెప్పర్(క్యాప్సికమ్)కూడా వేసి ఈ పదార్థాలను పాన్ లో వేసి 5 నిముషాలు ఫ్రై చేసి మూత పెట్టాలి.
5. మద్యలో ఒకసారి మూత తీసి రుచికి సరిపడా ఉప్పు వేసి, మిక్స్ చేయాలి .
6. మష్రుమ్ మెత్తగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే మష్రుమ్ రెడ్ పెప్పర్ రెడీ.

English summary

Yummy Mushroom Red Pepper Recipe

Mushroom is one of the many veggies loved by vegetarians. This healthy vegetable boosts the immunity, helps to increase your calcium level and also provides you with a lot of energy. Since this vegetable has a lot of health benefits, this is a must try mushroom recipe.
Story first published: Tuesday, April 21, 2015, 15:51 [IST]
Desktop Bottom Promotion