For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముల్లంగి సాంబార్ రిసిపి: సౌత్ ఇండియన్ స్పెషల్

|

ముల్లంగి...ముఖ్యంగా సౌత్ ఇండియాలో దీని వాడకం ఎక్కువ. సాంబార్, చట్నీ ఇలా వివిధ రకాలుగా వండుకుని తింటారు. ఇది మంచి రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది

సాంబార్ సౌత్ ఇండియన్ స్పెషల్ వెజిటేరియన్ రిసిపి. సౌత్ ఇండియాలో ఈ సాంబార్ రిసిపిని ఒక్కో స్టేట్ లో ఒక్కో రకంగా డిఫరెంట్ స్టైల్లో తయారుచేసుకుంటారు. రుచికి కూడా వేటికవే సాటి. ఈ క్లాసిక్ డిష్ ను పప్పు, తాజా వెజిటేబుల్స్ ఉపయోగించి తయారుచేస్తారు.

READ MORE: మిక్స్డ్ వెజిటేబుల్ సాంబార్

సాంబార్ అంటే కొత్తగా చెప్పేదేముంది అంటారా?? పప్పుచారుకు, సాంబార్ కు గల తేడా ఏంటంటే... కందిపప్పు ఉడికించి, చింతపండు పులుసు, కూరగాయలు వగైరా వేసి మరిగిస్తాం. కాని సాంబార్ అంటే ప్రత్యేకంగా చేసుకున్న సాంబార్ పొడి లేదా పేస్ట్ వేయాలి. దీనివల్ల కొత్త రుచి వస్తుంది.చాలా సులభంగా తయారుచేవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి..

Yummy Radish Sambar Recipe: South Indian Special: Telugu Vantalu

కావల్సిన సందర్భాలు:
కందిపప్పు - 1/3 cup
చింతపులుసు - 10 ml
ఉల్లిపాయ - 1
ముల్లంగి - 3
ధనియాలు - 1 tbsp

READ MORE: ఉడిపి సాంబార్: కర్నాటక స్పెషల్
బెంగాల్ గ్రామ్ దాల్ - 1 ½ tsp
ఎండుమిర్చి - 4
కొబ్బరి తురుము -2 tsp
పచ్చిబియ్యం -1/4 tsp
నూనె - 2 tsp
ఆవాలు- ¼ tsp
మెంతులు - ¼ tsp
ఇంగువ - a pinch
కరివేపాకు - కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా

READ MORE: స్పైసీ టమోటో సాంబార్ రిసిపి: లచ్ రిసిపి

తయారుచేయు విధానం:
1. ఒక బౌల్ నీళ్ళలో కందిపప్పు వేసి 15నిముషాలు నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ లో వేసి మొత్తగా ఉడికించుకోవాలి.
2. తర్వాత పప్పును మెత్తగా చేసి తర్వాత చల్లారనివ్వాలి.
3. కుక్కర్ లో ముల్లంగికూడా వేసి మరో రెండు నిముషాలు ఉడికించుకోవాలి.
4. అంతలోపు పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో ధనియాలు, శెనగపప్పు, ఎండుమిర్చి మరియు పచ్చిబియ్యం కొన్ని వేసి దోరగా వేగించుకోవాలి. మీడియం మంట మీద దాల్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
5. అదే మిశ్రమంలో కొబ్బరి తురుము వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. మొత్తం వేగించుకొన్న తర్వాత ఒక ప్లేట్ లో వేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత వీటిని మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది హోంమేడ్ సాంబార్ రిసిపి.

READ MORE: పచ్చి మామిడికాయ సాంబార్: సౌత్ ఇండియన్ స్పెషల్
6. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో ఆవాలు, మెంతులు, ఇంగువ మరియు కరివేపాకు వేసి వేగించుకోవాలి.
7. ఒక నిముషం తర్వాత అందులో కొద్దిగా చింతపులుసు, పసుపు, ఉప్పు మరియు వేసి 5నిముషాలు ఉడికించుకోవాలి.
8. ఇప్పుడు అందులో ముందుగా పేస్ట్ చేసుకొన్ని సాంబార్ పౌడర్ ను వేసి ఉడికించిన పప్పు మరియు ముల్లంగి కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి .
9. మీ రుచికి సరిపడా కారం, ఉప్పు సరిచూసుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి, నెయ్యితో వేడి వేడి అన్నంతో సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన ముల్లంగి సాంబార్ రిసిపి రెడీ...

English summary

Yummy Radish Sambar Recipe: South Indian Special: Telugu Vantalu

Today, we here to present one of the most authentic south Indian dishes known as Radish sambar. This radish sambar recipe is very tasty and healthy. It is easy to prepare and the best part is that it does not require the artificial sambar powder to enhance its taste.
Story first published: Monday, July 6, 2015, 13:40 [IST]
Desktop Bottom Promotion