వివాహిత మహిళలకు మరీ వండర్!

Posted By:
Subscribe to Boldsky

సాధారణంగా నైట్ అవుట్ పార్టీలంటూ పెళ్ళికాని యువతులు రాత్రి అంతా ఏ పురుషుడూ లేకుండా పార్టీలు చేసుకొని ఆనందిస్తారు. తమ బాయ్ ఫ్రెండ్ లగురించి ఎన్నో కబుర్లు చెప్పుకుంటారు. డ్యాన్స్ లు చేస్తారు. ఆటలు ఆడతారు. ఆనందిస్తారు. అయితే, అవివాహిత యువతులకంటే కూడా అసలు రిలీఫ్ కావలసింది వివాహిత మహిళలకే ఈ రకమైన నైట్ అవుట్ పార్టీలు కావాలి.

Go On A Married Girls Night Out!

గోల గోల చేస్తూ ఆనందించే అమ్మాయిల సరసన ఉండటం వీరికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు చక్కగా ఆనందిస్తారు. అన్నిటికి మించి మీ పార్టనర్ కు ఒక రాత్రి ఎంతో స్వేచ్ఛగా ఉంటుంది. అయితే, వివాహిత మహిళలకు ఈ నైట్ అవుట్ పార్టీల వలన అధిక ప్రయోజనం అని చెప్పటానికి కొన్ని కారణాలు పరిశీలించండి.

మీ విసుగదల, ఒత్తిడి వదిలేస్తారు. వైవాహిక జీవితం కష్టంగా ఉంటుంది. అందులోనూ మహిళలు ఉద్యోగస్తులైతే మరింత కష్టం. వారికి ఒకపక్క ఇంటిపనులు, మరోపక్క ఆఫీస్ ఉద్యోగం ఒత్తిడినిస్తాయి. మీరు మీ విసుగుదలనంతా మీ భర్తపై ప్రదర్శించేకంటే, ఒక రాత్రి నైట్ పార్టీ చేసుకుని జోకులేసుకుంటూ, భర్తలపై విసుర్లు వేస్తే మీకు ఎంతో రిలీఫ్ గా ఉంటుంది.

మీకు, అందరికి సంతోషం కలిగించండి - పురుషులు ఎపుడూ తమ భార్యలు తమను అంటిపెట్టుకుని ఉంటారని, వదలరని వారికి స్వేచ్ఛ లేదని వాపోతూంటారు. కనుక మీ పురుషుడు పార్టీకి వెళ్ళాలన్నా, మ్యాచ్ చూడాలన్నా అతనిని వదిలేయండి. మీరు మీ మహిళా స్నేహితులతో కలసి నైట్ పార్టీ అదే రోజు గ్రాండ్ గా చేసుకోండి. కొంత మేరకు ఇద్దరకు ఆరోజుకు రిలీఫ్ లభించినట్లవుతుంది.

మితిమీరకుండా సరసాలు - యువతులు పెళ్ళి అయినప్పటికి అందమైన యువకుడు కనపడితే చాలు కొద్దిపాటి సరసం ఆడేస్తారు. మరి నైట్ అవుట్ లో మరోమారు మీ చిన్ననాటి అనుభవాలు పొందుతూ కొద్ది గంటలు ఆనందించేయండి. అది మీలోని కోరికలను తీర్చేస్తుంది. పురుషులు మహిళలగూర్చి ఎలా మాట్లాడుకుంటారో, మహిళలు కూడా పురుషులగురించి మాట్లాడుకుంటారు. మరి వారు వివాహితులే అయితే, వారి పురుషులు లేదా స్త్రీల గురించి కూడా చర్చించుకుంటారు. మరి మీరు కనుక మీ ఇతర యువతుల కష్టాలు వింటే, మీరు మీ భర్తలతో ఎంత లక్కీయో భావించుకుంటారు.

మీరు చేసుకునే పార్టీలో, ప్రతి యువతి కూడా లవ్ గురు పాత్ర ఇతర యువతుల కొరకు ధరించవచ్చు. మీరు పరిష్కరించుకోలేని మీ సమస్యలకు ఆమె పరిష్కారం చూపుతుంది. ఇతరులు కూడా అటువంటి సమస్యలు వారివి వివరించుకుంటారు. తగిన పరిష్కారాలు లభిస్తాయి. మరి వివాహమైన మహిళల నైట్ అవుట్ పార్టీ ఫలితం ఏమిటి? ఆ ఒక్క రాత్రి వారి జీవితాలలోని బోర్, కష్టం లేదా మరేదేని విసిగించే అంశం వారికి దూరం అవుతుంది. ఇక మరుసటి రోజు నుండి వారి వారి భర్తలను తేలికగా హేండిల్ చేసేస్తారు.

English summary

Go On A Married Girls Night Out! | నైట్ అవుట్ లో నానా హంగామా?

Play Love Guru. Each member of your girl gang can be the 'love guru' or relationship expert for the rest. If you have a problem in your marriage that doesn't seem to get resolved, then discuss it with your girlfriends. They might have gone through something similar and can give you some good council.
Story first published: Thursday, July 12, 2012, 11:33 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter