మంచోడివే! మనది స్నేహం ...ఆ పని చేయద్దు..?

Posted By:
Subscribe to Boldsky

జీవితంలో ఒక ఫ్రెండ్ మరియు లవర్ ఇద్దరూ ప్రధానమే. ఒక వ్యక్తి స్నేహితులు లేకుండా అట్లే ఒక ప్రేమికుడు లేదా ప్రేమికురాలు లేకుండా ఉండలేరు. అయితే, కొన్ని పరిస్ధితులలో మనకున్న వారు స్నేహితులా? ప్రేమికులా అనేది నిర్ణయించుకోవలసి వస్తుంది. మీరు ప్రేమలో పడితే, స్నేహం మాయమవుతుంది. అలానే స్నేహంలో పడితే ప్రేమకు కూడా గోవింద కొట్టవచ్చు. అంటే ప్రేమ కావాలా? స్నేహం కావాలా అనేది మీరు ఎంచుకోవాల్సిన అవసరం లేదు. మీరు కనుక అది ప్రేమా లేక స్నేహమా అనేది తేల్చుకోలేకుంటే....ఏం చేయాలనేది పరిశీలించండి. స్నేహం, ప్రేమ ఈ రెంటిమధ్య ఎలా సమతుల్యత సాధించాలి?

Ways To Balance Love And Friendship

రెండూ వేరు వేరు - మీ ప్రేమ జీవితాన్ని స్నేహంగా భావించకండి. రెండూ వేరు వేరు అంశాలనేది మీరు గ్రహించాలి. మీ ప్రేమ జీవిత సమస్యలు స్నేహితులతో పంచుకోవడమనేది వేరు. కాని రెంటిని కలిపేసి ఒకటే సంబంధంగా చూడటం లేదా వ్యవహరించటం సరైన పద్ధతి కాదు.

కొంత ప్రత్యేక సమయాన్ని తీసుకోండి - మీ లవర్ ను స్నేహితుల సమక్షంలో కలవకండి. అంటే, మీ ఫ్రెండ్ ని ప్రేయసితో వెళ్ళేటపుడు తీసుకెళ్ళకండి. అదే రకంగా మీ పార్టనర్ సమక్షంలో మీ స్నేహితులు కూడా మిమ్మల్ని కలిసేందుకు ఇష్టపడరు. ఎవరి పరిస్ధితి వారిదే. మీరు మీ లవర్ తో ఉండేటపుడు ఎంతో కాంక్షతో సున్నితంగా ఉంటారు. కాని మీరు మీ ఫ్రెండ్స్ తో ఉండేటపుడు అలా ఉండరు. ఈ సమయాలలో మీరు మాట్లాడే తీరే మారిపోతుంది.

ప్రేమికులతో , స్నేహాలతో కలగా పులగం చేసి ఒకే సారి వ్యవహరించకండి. మీ లవర్ మీ స్నేహితులను నిర్ణయించరాదు. అట్లే మీ స్నేహితులు మీ లవర్ ను ఎంపిక చేయరాదు. రెండిటిని దూరం దూరంగా ఉంచండి. ఇవి వేరు వేరు సంబంధాలుగా గుర్తించండి. మీ లవర్ ను మీరే వ్యవహరించగలరు. కాని మీ స్నేహితులకు ఆమె తెలియకపోవచ్చు. అదే రకంగా మీ స్నేహితుల గురించి ఆమెకు తెలియకపోవచ్చు. కనుక ఆమెను వారి అవసరాలగురించి అడగకండి.

అయితే కొన్నిసార్లు ప్రేమను స్నేహాన్ని బ్యాలన్స్ చేయవలసి వస్తుంది. అపుడు మీరు ఒక దానిని నిర్లక్ష్యం చేస్తారు. కాని అది పరిష్కారం కాదు. కొత్తగా వచ్చిన ప్రేమ కొరకు పాత స్నేహాలను దూరం చేసుకోకండి. మీ కష్ట సుఖాలలో స్నేహితులు తోడుగా ఉంటారు. మీ లవర్ లేదా మీ ఫ్రెండ్ ఇద్దరూ ప్రధానమే, మీ పరిస్దితిని వారికి అర్ధం చేయండి. ఇద్దరికి మీ జీవితంలో సమాన హోదా ఉందని తెలుపండి.

ఈ కొద్ది మార్గాలు పాటించి మీ స్నేహాన్ని, ప్రేమను బ్యాలన్స్ చేయవచ్చు. ఇద్దరికి ఆచరించాల్సిన విధానాలు వేరు వేరుగా ఉంటాయి. అయితే, మీరు కనుక ప్రేమ, స్నేహం రెంటినీ ఇంకనూ బేలన్స్ చేయలేకుంటే, మీ పరిస్ధితిని ఇద్దరితోను చర్చించండి. సరైన స్నేహితుడు లేదా ప్రేమికులు పరిస్ధితిని తప్పక అర్ధం చేసుకుంటారు. ఈ మీ సమస్యకు పరిష్కారం తప్పక దొరుకుతుంది.

English summary

Ways To Balance Love And Friendship | ప్రేమ - స్నేహాల సమతౌల్యానికి మార్గాలు!

Avoidance is not accepted: Sometimes you find it difficult to balance between love and friendship together. This is the time, you start ignoring one. Well, this is not a solution. If you avoid your long term friend for the new love in your life, you might end up losing the precious friend who stood by you in all modes of life.
Story first published: Saturday, July 14, 2012, 11:39 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter