25 ఏళ్ళకల్లా ఎందుకు వివాహం చేసుకోవాలి?

Posted By:
Subscribe to Boldsky

Why You Should Get Married By 25?
పెళ్ళి అంటే చాలు చాలామంది భయపడిపోతారు. కొద్ది మంది మాత్రమే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. పెళ్ళి చేసుకుంటే, స్వేచ్ఛ పోతుందని వారి బ్రహ్మచారి జీవితం అంతమవుతుందని భావిస్తారు. కాని మానవుడు ఒక సంఘ జీవి. మరి తరాలు పుట్టుకురావాలంటే, మానవుడు వివాహం తప్పక చేసుకుతీరాలి. అయితే, ఆ వివాహం జంటలకు ఏ వయసులో అవ్వాలనేది సమస్యగా ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు అంటే మహిళ మరియు పురుషుడు వివాహం చేసుకోవాలని భావిస్తే, వివాహం పట్ల వయసు సంబంధమై కొన్ని అంశాలుంటాయి. బహుశ మీ తల్లి లేదా తండ్రి సరైన వయసులో పెళ్ళి చేసుకోవాలని ఇంటిలో చెప్పటం వినే వుంటారు.

అయితే, ఆమె మీకు పెళ్ళి చేసేయాలనే భావిస్తారు కాని, ఆమె అలా ఎందుకు చెపుతోందనేది మీరు గ్రహించరు. సరైన వయసులో అంటే షుమారుగా 25 సంవత్సరాలు వచ్చే సరికి పెళ్ళి చేసుకోవడం పురుషులకు, స్త్రీలకు కూడా మంచిది. ఎందుకని, ఎట్లా అని పరిశీలిస్తే....జీవితం ప్రణాళిక చేసేటందుకు అధిక సమయం ఉంటుంది. మీరు కనుక 28 లేదా 30 సంవత్సరాల వయసుపైబడి పెళ్ళి చేసుకుంటే, త్వరగా పిల్లలు పుట్టాలని కూడా అందరూ చెపుతారు. ఇక మీరు ఒంటరిగా అనుభవించేందుకు సమయం తక్కువ. అయితే, 25 సంవత్సరాలకు పెళ్ళి చేసుకుంటే, మీ వివాహ జీవితాన్ని రెండేళ్ళపాటు ఆనందించవచ్చు. జంటలకు తమ పట్ల అవగాహన ఏర్పరచుకోడానికి వివాహ జీవితం ఆనందించటానికి కూడా సమయం ఉంటుంది.

ఛెప్పలేని ఆనందం - 25 సంవత్సరాల వయసుకు పెళ్ళాడితే, మరింత సరదాగా ఇద్దరూ రాత్రులలో తిరగవచ్చు. స్నేహితులను కలువవచ్చు. ఇద్దరికి తెలియని ఆనందంగా ఉంటుంది. వివాహ జీవితం భాధ్యతలకే కాదు, ఆనందానికి కూడాను.

శారీరకంగా చురుకుదనం - 25 సంవత్సరాలకే పెళ్ళి అయితే, శారీరకంగా అప్పటికి మీరు ఎంతో చురుకుగా ఉంటారు. సంతానోత్పత్తికి అది సరైన సమయం. కుటుంబ నియంత్రణలు మొదలైనవి మీకు మరింత ఆనందం ఇస్తాయి. లేటుగా పెళ్ళి అయితే, పిల్లలు త్వరగా పుట్టాలని భావిస్తారు. శరీరం చిన్నదిగా ఉంటే, లైంగిక జీవనం చురుకు, పిల్లలు పుట్టించే సామర్ధ్యం అధికం.

అనుభవించేందుకు సమయం - 25 సంవత్సరాలకే పెళ్ళి చేసుకుంటే, ఆ వయసులో మిమ్మల్ని పిల్లలు పుట్టించాలని ఇబ్బంది పెట్టరు. కనుక మీ భార్యతో లేదా భర్తతో బాగా ఆనందించవచ్చు. జీవితంలో స్ధిర పడిన వారైతే, పని ఒత్తిడి కూడా ఉండదు. ఒక చిన్న వయసు వారిగా మీకు పార్టనర్ తో గడపటానికి అధిక సమయం ఉంటుంది. మీకు జీవితంలో ఏం కావాలి? కెరీర్ ఎలా ఉండాలి? అనే అంశాలపై సరైన నిర్ణయాలుంటాయి.

సరైన సమయంలో పురుషులు లేదా స్త్రీలు ఎందుకు పెళ్ళి చేసుకోవాలనేదానికి ఈ కారణాలు ప్రధానంగా చెప్పవచ్చు.

English summary

Why You Should Get Married By 25? |ఏ వయసులో పని ...ఆ వయసులో చేసేయ్!

Time to experience: When you get married at 25, you are not under the pressure to have a family. So, you get more time to can spend quality time with your spouse. As you are trying to settle in your career, you may or may not be compelled with work pressure to a greater extent.
Story first published: Monday, July 16, 2012, 15:23 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter