For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అన్యోన్యంగా గడపడానికి ఈ అడ్డంకులను తొలగించుకోండి...

|

భార్య భర్తల మధ్య దృఢమైన దాంపత్య బంధానికి తోడ్పడేది ఏది? నమ్మకం, ప్రేమ, స్నేహం.. ఇవన్నీ. పెళ్ళైన వారిలో చాలా మంది వ్యక్తులు(ఆడ, మగ ఎవరైనా సరే)తమ జీవితం విజయవంతంగా నడవాలని కోరుకుంటారు. అయితే కొందరిలో అది అసంపూర్తిగా మిగిలిపోతుంది. ఒక జంట జీవితం ఎటువంటి ఒడుదుడుకులూ లేకుండా సాఫీగా సాగాలంటే జీవితకాలానికి భార్య సగభాగమైతే భర్త సగభాగం అవ్వాలి. అప్పుడే వారి జీవితంలో ఎటువంటి అపార్థాలు, సమస్యలు ఉండవు.

చాలా కుటుంబాలలో భార్య భర్త మద్య అన్యోన్య దాంపత్యం కావాలంటే తమ భర్తలే మారిపోవాలనే ఆలోచన తప్ప అందుకు తామూ మారాలనే ఆలోచనే రాదు. అన్యోన్యంగా తమ జీవితం సాగించాలంటే ప్రతి జంటా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవేమిటో తెలుసుకుందాం.

1. భార్యాభర్తలిద్దరూ పార్ట్‌ నర్స్‌లా ఉండాలి తప్ప. భర్త 'రిమోట్‌', తను 'కంట్రోల్‌'లా ఉండాలని అత్యాశకు పోవద్దు.

2. పెళ్లినాటికి ఎవరో తెలియని పరిస్థితిలో అప్పటికి కొన్ని దృడమైన అభిప్రాయాలని ఏర్పరుచుకుంటారు. పెళ్లయిన కొత్తల్లో ఆకర్షణ తగ్గిపోగానేక భూతద్దంలోంచి చూసినట్టు అవతలి వాళ్లలో లోపాలు పెద్దవిగా కనబడుతాయి.

Dos and Don'ts Tips to make your life smarter

3. అలవాట్లూ, అభిరుచులూ, ఆదర్శాలూ, అభిప్రాయాలూ ఒకటిగా ఏ ఇద్దరికీ ఉండవు . చిన్న చిన్న విషయాల్లో మొండి పట్టుదలలకి పోకుండా సర్దుకుపోవాలి. తమ భర్తలని మార్చాలని భార్యలూ, వాళ్లనే మార్చాలని భర్తలూ అనుకోవడం వల్లే ఘర్షణలు మొదలవుతాయి. ఇద్దరి మద్య దూరం పెరుగుతుంది, చివరకు విడాకులకు దారితీస్తుంది.

4. జీవితాంతం ప్రయత్నించినా భర్త చేత ఓ భార్య సిగరెట్టు తాగటాన్ని మాన్పించలేకపోవచ్చు.

5. అలాగే ఎన్నాళ్లు మొత్తుకున్నా ఓ భర్త భార్య చేత బిగ్గరగా అరవడాన్నీ మాన్పించలేకపోవచ్చు. అలాంటి కేసుల్లో రాజీపడిపోవడమే ఉత్తమమైన మార్గం.

6 . సానుభూతి, సహకారం వల్లనే కోట్లాది దంపతులు పూర్తిగా అయిష్టత కల విషయాలు తమ జీవిత భాగస్వాముల్లో ఉన్నా హేపీగా జీవించగలుగుతున్నారు.

7. 6. మరో ముఖ్యం విషయం తన మాటే నెగ్గాలనే పంతమే చాలా ఘర్షణలకి మొదటి మెట్టు. ఘర్షణ రేగే ఇద్దరు వ్యక్తులూ బయటి వాళ్లయితే మొహాలు చూసుకోకపోయినా గడుస్తుంది. కానీ ఆ ఇద్దరూ ఇంట్లోని భార్యాభర్తలైతే? సర్దుకుపోగల నైపుణ్యాన్ని అలవరచుకోలేని బలహీనత వల్లే పంతాలు మొదలవుతాయి.

8. కొన్ని సందర్భాల్లో విమర్శనలు తట్టుకోలేకపోవటం వల్ల అభిప్రాయ భేదాలు వస్తాయి. తమని మరొకరు విమర్శిస్తున్నారనే ఉక్రోషాన్ని దాటి ఆ విమర్శలో హేతువు గురించి ఆలోచించే స్థితికి ఎదిగితే ప్రతి మనిషి విమర్శని కూడా స్వీకరించగలుగుతాడు.

9. ఇక మనిషి జీవితంలో పొగడ్తకి మనసెంతగా పొంగుతుందో గాయపరిస్తే అంతగా కుంగిపోతుంది కూడా. 'నీ బొంద' నీకెంత తెలుసు నోర్ముయ్ అని భర్తా, మీకు చెప్పినా ఆ గోడకి చెప్పినా ఒకటే అని భార్య మాటల్ని తూణీరాలుగా విసురుకుంటే పర్యవసానం తీవ్రమైన విభేదాలే.

10. తమ తప్పుల్ని ఒప్పుకోలేకపోవడం దానిని కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పుచేయడం ఈ లక్షణం చాలామంది దంపతుల దాంపత్య జీవితానికి అవరోధంగా మారుతుంది. ఎదుటి మనిషి తప్పుని ఎత్తి చూపేముందు భార్యాభర్తలు తమని తాము సరిదిద్దుకుని రాజీపడితే ఎలాంటి అవరోధాలనైనా తేలిగ్గా అధిగమించవచ్చు.

English summary

Dos and Don'ts Tips to make your life smarter | అన్యోన్య దాంపత్యానికి అడ్డంకులివే....!

There are many reasons which results in separations of loved ones which changes life of both the person involved. Some of prominent reasons of problems are jealously, pride and ego. Ego usually comes out of fear of losing control or proving yourself right or when someone is feeling insecure.
Story first published: Wednesday, January 30, 2013, 16:29 [IST]
Desktop Bottom Promotion