For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ మెట్టినింటివారితో స్నేహంగా వుండడం ఎలా?

|

How to Become Friends With Your in Laws
మెట్టినింటి వారితో స్నేహంగా ఎలా వుండాలి అనేది కొత్త-పాత ఎలాంటి అనుబంధాలకైనా పెద్ద సవాలుగా అనిపించవచ్చు. ఈ క్రింది పనులు చేస్తే మీరు ఒక మంచి పె౦పకంలోంచి వచ్చిన వారిగా మీ మెట్టినింటివారి మన్ననలు పొందుతారు.

1. ఎప్పుడూ మర్యాదగా వుండండి, కానీ మరీ కష్టంగా ప్రయత్నించ కండి. మీ మెట్టినింటి వారిని ఏమండీ అని సంబోదించండి - వాళ్ళు వేరేలా చెప్తే తప్ప.

2. మొదటి సారి ఆ కుటుంబాన్ని చూడడానికి వెళ్ళేటప్పుడు, అబ్బాయిలు అయితే మోడరన్ డ్రస్ వేసుకోవచ్చు. బాగా గాడీగా ఉండేవి, పెద్ద సైజు వి వేసుకోకండి. అమ్మాయిలయితే శరీరం తక్కువగా కనపడేలా బట్టలు వేసుకోండి. ఒక మంచి డ్రస్ లేదా మోకాలి పైకి వచ్చే స్కర్ట్ అయినా పర్వాలేదు - వాళ్ళూ కాస్త సరదాగా వుండే వారైతే. అదే కాస్త సాంప్రదాయ కుటుంబం అయితే మోకాళ్ళ క్రిందికి వచ్చేలా చూడండి. ఒక మంచి జీన్స్ ట్రౌసర్ వేసుకోవడం అన్నివేళలా మంచిది. అది కూడా మరీ బిగుతుగా గానీ లో కట్ గా కానీ ఉండకుండా చూసుకోండి. పై భాగంలో మీరు ఓ మంచి టీ-షర్ట్ లేదా అందంగా అమ్మాయిలకు బాగుండేవి, క్లీవేజ్ కనపడకుండా ఉండేవి వేసుకోండి. మేకప్ మరీ ఎక్కువగా వుండకూడదు - మృదువైన సహజమైన వేషధారణ మంచిది.

3. వాళ్ళు మాట్లాడే విధానాన్ని గమనించి దాన్ని అనుసరించండి, కానీ ఎగతాళిగా కాదు. పిల్లల్ని మిత్రులుగా భావించి వారి ముందే ఎలాంటి విషయమైనా మాట్లాడే కుటుంబాలు వున్నాయి - అలాగే ఇలా చేయని వారూ ఉన్నారు, వారి ముందు ఎలా పడితే అలా మాట్లాడారు, అరచుకోవడం, అశ్లీలంగా మాట్లాడడం చేయరు. ప్లీజ్, థాంక్ యూ, అనే రెండు మాటలు మంత్రాల్లా పని చేస్తాయని గుర్తుంచుకోండి.

4. మీరు వాళ్ళింట్లో వున్నప్పుడు, ఏదైనా రూమ్ లోకి వెళ్ళే ముందు తలుపు మీద తట్టి వెళ్ళండి. ముఖ్యంగా బాత్ రూమ్ లోకి - ఎందుకంటే అత్తగారో మామగారో లోపల వుండగా పొరపాటన మీరు లోపలి వెళ్తే బాగుండదు కదా !

5. కుటుంబ వేడుకలకు వెళ్ళండి - మీకు మరీ కొత్తగా వుండి వెళ్ళకపోయినా మీకు కుటుంబం అంటే ఇష్టం లేదనే భావన కలుగుతుంది. వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఆడపిల్ల అయితే అత్తగారితో, మీరు మగవారైతే మామగారితో ఒక సంభాషణ మొదలు పెట్టండి - ఒక టీవీ షో గురించి, లేదా మీకిష్టమైన ఆతల గురించి ఇలా మీ ఇద్దరికీ ఆసక్తి వున్న విషయాల గురించి మాట్లాడండి. మీ అత్తగారు ఒక టీవీ షో చూస్తుంటే దాని గురించి మాటలు కలపండి - అలాగే మామగారితో కూడా - కానీ మరీ ఎక్కువగా ప్రయత్నించకండి.

6. సురక్షితమైన ప్రశ్నలు అడిగి వారిని తెలుసుకునే ప్రయత్నించండి. మీ భాగస్వామి చిన్నతనం గురించిన ప్రశ్నలు అడిగి మొదలు పెట్టండి ఎందుకంటే దాని గురించి మాట్లాడుకోవడానికి, నవ్వుకోడానికి అందరికీ ఏదో ఒకటి గుర్తుంటుంది. ఈ సంభాషణ మొదలు పెట్టడం తేలిక - గది గోడలమీద మీ భాగస్వామి చిననాటి పటాన్ని చూసి దానికి సంబంధించిన ప్రశ్నలతో సంభాషణ మొదలు పెట్టొచ్చు.

7. అవసరమైనపుడల్లా ప్రశంసిస్తూ ఉండండి. మీ అత్తా గారో, మామగారో కొత్త హెయిర్ స్టైల్ తెచ్చుకుంటే అది ప్రస్తావించండి. వాళ్ళు తయారై బైటికి వెళుతుంటే ఈ డ్రస్లో మీరు చాలా బాగున్నారని చెప్పండి, మీ పృష్ట భాగం, మీ ఛాతీ నో బాగుందని చెప్పడం చేయకండి. భోజనం చేసేటపుడు మీరు కూడా వంట చేతైనవారైతే ఈ పదార్ధం ఎలా చేసారని అడగండి - మీకు వంటరాదనుకోండి అంటే అబ్బో ఇది చాలా బాగుందే నాకు దీని తయారీ తెలుసుకోవాలని ఉంది అని నవ్వుతూ అనడం ద్వారా మీ అత్తగారితో కలిసి పని చేసే అవకాశం వస్తుంది. ఆవిడ వంట బాగా చేసేట్లయితే నాకు వంటచేయడం రాదు కానీ నేర్చుకోవాలనుంది మీ వంట చాలా బాగుంది, ధన్యవాదాలు అనిచేప్పండి. మీరూ అదే మతం వారైతే తప్ప మత సంబంధమైన విషయాలు ఎత్తకండి.

8. మీరు ఆయనను చూడడానికి వెళ్ళినపుడు రోజంతా ఆయన గదిలోనే ఉండిపోకండి, ఇది చూడడానికి బాగుండదు.

9. మీరు ఒక స్వతంత్ర వ్యక్తీ అని వారికి తెలియచేయండి, వాళ్ళింటి నించి మరీ రాత్రిపూట ఆలస్యంగా రాకండి, అలాగే చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళకండి, మీరు స్కూల్లో వుంటే పుస్తకాలతో వెళ్ళడం మంచిది, మీరు ఇద్దరూ కలిసి చదువుకుంటున్నారని వాళ్లకి తెలియనివ్వండి. ఎపుడూ నవ్వుతూ స్నేహపూర్వకంగా ఉండండి. అవకాశం ఇచ్చినపుడు మీకెలా సాయపడగలనో అడగండి.

English summary

How to Become Friends With Your in Laws | మెట్టినింటివారితో స్నేహంగా మెలగడం ఎలా..

How to become friends with the in laws, this may seem to be a hard challenge for any relationships, new or old the guidelines below reflects a person of good upbringing and any in law will be pleased to have you.
Story first published:Wednesday, January 2, 2013, 12:11 [IST]
Desktop Bottom Promotion