For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒంటరితనాన్ని పోగొట్టుకోవడం ఎలా

|

అందరికి ఎప్పుడో ఒకప్పుడు ఒంటరిగా ఉండే సందర్భం ఎదురవుతుంది. ఇది ఏమీ తప్పు విషయం కాదు. ఎన్నో విధాల ప్రధాన జీవన విధానంలో కొందరు ఒంటరి తనానికి గురవుతారు. ప్రత్యామ్నాలను, వెతికే సందర్భాలలో ఇలాంటి పరిస్థితికి లోనవుతారు. ఇలాంటి సమయాలలో మన భావాలను ,ఇష్టాలను అర్ధం చేసుకునే వారి కోసం వెతుకటం జరుగుతుంది. ఒంటరితనానికి , ఏకాంతానికి తేడా అర్ధం చేసుకోవాలి. ఒంటరిగా ఉండటం భాదాకరం గా అనిపించేటప్పుడు అది ఒంటరితనం అదే సంతోషంగా ఉన్నప్పుడు అదే ఏకాంతం. ఇతరులతో కలవాలని అనిపిస్తున్నప్పుడు అది ఏకాంతం కాదు. ఎవరో ఒకరు ఈ పరిస్థితిని అర్ధం చేసుకొని ఒంటరితనంతో ఇబ్బంది పడే పరిస్థితి నుండి తప్పిచేందుకు తోడ్పడతారు.

ఆన్ లైన్ కమ్యునిటీలలో చేరటం , కొన్ని సందర్భాలలో చాలా సహాయకరంగా ఉంటుంది.ఇలాంటి పరిస్థితులలో అనుభవాలను పంచుకోటానికి అవకాశం ఉంటుంది.

How to Deal With Loneliness

ఒంటరితన్నాన్ని అధిగమించటం

ఇటువంటి పరిస్థితిలో దగ్గర మనుషులతో గడపటం మాట్లాడటం మంచి ప్రభావాన్ని చూపెడతాయి. నిజానికి ఇలాంటి సమయంలో గడపాలనుకున్న వారితో ఉండలేక పోయినా మానవ సంబంధాలు బలపడటంలో ఇది సహాయపడుతుంది. ఎక్కువగా వినడం, మాట్లాడటం వంటివి చెయ్యడం మంచిది. మాట్లాడేటప్పుడు వినటం అనేది సంబంధాలని పెంచుకోవడంలో చాలా సహాయపడుతుంది.

కార్యకలాపాలలో పాలుపంచుకోవడం, స్పోర్ట్స్ లీగ్ లో చేరడం, ఏదైనా క్లాస్ లో చేరడం వంటివి ఉపయోగకరంగా ఉంటాయి. స్వతంత్రంగా మీ కమ్యూనిటీలో జరిగే కార్యకలాపాలలో పాలుపంచుకోవడం ఉత్తమం. సిగ్గరులైతే, కొంత మందితో కలిసి ఒక గ్రూప్ గా లేదా ఆన్లైన్ లో ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది.

మీకు మీరే చొరవ తీసుకొనడం ద్వారా సామాజిక సంబంధాలను మెరుగుపరుచుకోండి.ఇతరులు మీ వద్దకి వచ్చే వరకు వేచి ఉండకండి. మీరే చొరవ తీసుకోండి. వీలయితే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీకి ఆహ్వానించండి. ఇతరుల పట్ల ఆసక్తి ముందుగా మీరు కనబరిస్తే సహజంగా వారికి మీ పట్ల ఆసక్తి కలుగుతుంది.

మీ కుటుంబంతో సమయాన్నిగడపండి. ఒక్కొక్కప్పుడు మంచి సంబంధాలు లేనప్పుడు కూడా మీ ఆహ్వానంతో సమయాన్ని వెచ్చించడానికి వారు ఇష్టపడవచ్చు. స్నేహితులతో సమయాన్ని గడుపుతూ వారి ద్వారా కొత్త స్నేహితులని పొందవచ్చు. దీని ద్వారా మీ ఒంటరి తనం నుంచి తప్పించుకోవచ్చు.

సామాజిక కార్యకలాపాలు మీకు మీరుగా చెయ్యడానికి ప్రయత్నించండి. చాలా సార్లు భాగస్వామో, స్నేహితులో లేకపోవడం కంటే కార్యకలాపాలో, అభిరుచులో లేకపోవడమే ఇబ్బందికరంగా ఉంటుంది. మీకోసం మీరు సమయాన్ని వెచ్చించండి. ఓక మంచి రెస్టారెంట్ కో సినిమాకో లేదా డిన్నర్ కో వెళ్ళడం వంటివి చెయ్యండి.

ఇలాంటప్పుడు పెంపుడు జంతువుని పెంచుకోవడం వంటిది మంచి ఆలోచన. మీరు ఒంటరితనంతో బాధపడేటప్పుడు స్థానిక జంతుశాల నుండి ఏదైనా కుక్క లేదా పిల్లిని తెచ్చుకుని పెంచుకోండి. వాటి ప్రేమాభిమానాలని చురగొనడం మీకు ఒంటరి తనం నుంచి ఉపశమానాన్ని కలిగిస్తుంది. కొన్ని యుగాల నుండి ఇది నిరూపితమైంది.

మిమ్మల్ని మీరు ఆహ్లాదకరంగా మార్చుకోండి. సహజంగా సామాజిక సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇతరులు మీతో గడపడానికి ఇష్టపడతారు. ఇతరులని విమర్శించడం కంటే ప్రశంసించడం ద్వారా బాగా దగ్గరవుతారు. బట్టల గురించి, అలవాట్ల గురించి, లేదా జుట్టు గురించి విమర్శించకండి. వారి బట్టల పైన మరక ఉందనే విషయం గుర్తు చెయ్యడం వారు ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనవసరం. నిజానికి, ఇతరులు వారిని సంతోష పెట్టే చిన్న చిన్న విషయాలైనా ఉదాహరణ కి మీ స్వెట్టర్ బాగుందనో మీరు రచించిన వ్యాసం బాగుందనో చెప్పడం వారిని సంతోషపెడుతుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలే ఇతరులు మీ పట్ల ఇష్టాన్ని కనబరచడానికి క్రమ క్రమంగా మీతో స్నేహం చెయ్యడం కోసం ముందరికి రావడానికి ఉపయోగపడుతుంది.

English summary

How to Deal With Loneliness | ఒంటరితనం వేదిస్తోందా...


 People feel lonely for a number of reasons, including simple social awkwardness or intentional isolation. Everyone experiences loneliness. Luckily, though, there are a number of ways to overcome it.
Story first published: Sunday, January 13, 2013, 15:34 [IST]
Desktop Bottom Promotion