For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివాహేతర సంబంధాల వల్ల దుష్ప్రభావాలు

|

How Extra Marital affair affects a Relationship
వివాహేతర సంబంధాలు ప్రధానంగా ఆవేశంలో మొదలయ్యి, వినాశనానికి దారి తీస్తాయి. చాలా సందర్భాలలో ఇలాంటి సంబంధాలు పెట్టుకునే వారు , భవిష్యత్తులో దాని విపరీత పరిణామాల గురించి ఆలోచించరు. వారు ఆలోచించే సమయం వచ్చే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అసలు ఈ వివాహేతర సంబంధాల వల్ల కుటుంబ బాంధవ్యాలకు జరిగే హాని ఏమిటి?

ముఖ్యంగా ...

1. ఆత్మ గౌరవం: మొదటిగా, దాంపత్యం లో మోసానికి గురి అయిన వ్యక్తి యొక్క ఆత్మ గౌరవం తగ్గిపోతుంది. తన వల్లే ఇదంతా జరిగింది అనే అపరాధ భావన వెంటాడుతుంది. దీని వల్ల వారు విపరీతమైన మానసిక సంఘర్షణకి, తద్వారా ఒత్తిడి కి లోనవుతారు. వారి దైనందిన జీవితం విచ్ఛిన్నమవుతుంది. సాధారణ కార్యకలాపాలను కూడా ఆత్మ విశ్వాసం తో చేయడం లో ఇబ్బంది పడతారు. ఉద్యోగస్థులకు ఈ అవస్థ మరీ కష్టంగా ఉండి, తమ వృత్తికి న్యాయం చెయ్యటం లో విఫలమయ్యే పరిస్థితి రావచ్చు.

2. విశ్వాస లేమి: ఒక సారి తమ నమ్మకం వమ్ము అయ్యాక, అంత తొందరగా బాధితులు మరో మనిషి ని నమ్మటానికి ఇష్టపడరు. ఇంకొక భాగస్వామి ని స్వీకరించేందుకు సందేహిస్తారు. పరిచయాలను, సంబంధాలలో ఒక రకమైన అనుమాన ధోరణి తమకి తెలియకుండానే ప్రదర్శించటం మొదలు పెడతారు. ఇది వారి సంబంధ బాంధవ్యాలను బాగా ఒత్తిడి కి గురి చేస్తుంది.

3. అస్థిరత్వం: అంతవరకూ తమ సర్వస్వం అని నమ్మిన జీవిత భాగస్వామి మోసం చేసే సరికి బాధితులు తాము నిర్మించుకున్న వ్యక్తిగత మద్దతు వ్యవస్థ ఒకే సారి కూలిపోయినట్టు భావిస్తారు. వారి జీవితంలోని ఒక అవిభాజ్య పాత్ర పోషించిన మనిషి ని విడిపోవటం తప్ప వేరే మార్గం లేదు అనే నిజం నమ్మటం వారికి చాలా కష్టంగా ఉంటుంది. అస్థిరత్వం జీవితాన్ని కమ్మి వేసి వారి ప్రపంచాన్ని తల్లకిందులు చేస్తుంది.

4. మానసిక క్షోభ: వివాహేతర సంబంధం వల్ల బాధితుల అనుభవించే ముఖ్యమైన సమస్య ఇది. జరిగిన పరిణామానికి వారు తమని తాము నిందించుకుని అనిర్వచనీయమైన మానసిక క్షోభ అనుభవిస్తారు. ఇలా ఎందుకు జరిగింది అనే ప్రశ్న వారి మెదడుని తొలచివేసి వారిని కారణాల అన్వేషణ కు ఉరి కొల్పుతుంది. తప్పులో తమ భాగాన్నే వారు ఎక్కువ చేసి చూడటం, వారి మనసుకు ఇంకా కష్టం కలిగిస్తుంది.

5. అనారోగ్యం: ఒక రకమైన నైరాశ్య భావన తో ఉండటం, తరచూ ప్రతికూల ఆలోచనల తో గడపటం వల్ల, నిద్ర లేమి, సరి అయిన సమయానికి ఆహారం తీసుకోకపోవటం వల్ల వచ్చే నీరసం బాధితుల ఆరోగ్యానికి హాని చేకూరుస్తుంది.

6. సామాజిక జీవితం: వివాహేతర సంబంధం వల్ల బాధితుల సామాజిక జీవితం బాగా దెబ్బ తింటుంది. వారి కుటుంబాన్ని, బంధువులను, సహోద్యోగులను, పొరుగు వారిని వారు కొత్త దృక్కోణం నుంచి చూడటం ఆరంభిస్తారు. వారి సంభాషణలలో ఇది వరకటి ఉత్సాహం లోపిస్తుంది. కొందరు తమ పిల్లల కోసమైనా తేరుకోవాలని ప్రయత్నిస్తే, మరి కొందరు వారికి దూరం అయిపోతారు.

7. పిల్లపై దుష్ప్రభావం: వివాహేతర సంబంధం బయటపడటం వల్ల, దంపతులు విడిపోతే, దాని ప్రభావం పిల్లలపై చాలా బలంగా ఉంటుంది. తాము ఎంతగానో ఆరాధించిన తల్లిదండ్రులు ఇద్దరితో తాము ఉండలేకపోవటం వారు జీర్ణించుకోలేకపోతారు. యుక్త వయసు వచ్చాక వారి ప్రేమ/పెళ్ళి విషయాలలో వారు అంత నిశ్చింతగా నిర్ణయాలు తీసుకోలేక పోవచ్చు. వారి వైవాహిక బంధం మీద కూడా ఈ నీలి నీడ ప్రసరిస్తుంది.

సాధారణంగా క్షణికావేశం లో మొదలయ్యే వివాహేతర సంబంధాలు దీర్ఘకాలిక దుష్ప్రభావాలు చూపిస్తాయి. అయితే, బాధితులు సాధ్యమైనంత త్వరగా మామూలు జీవితం మొదలుపెట్టే దారులు వెతకటం అత్యంత ఆవశ్యకం. విశ్వసనీయమైన స్నేహితులు, బంధువుల తో ఒక మద్దతు వ్యవస్థ ను ఏర్పాటు చేసుకుని, వీలైనంత వరకు సానుకూల ఆలోచనలతో భవిష్యత్తు పట్ల ఆశావహ దృక్పథం తో ఉండటం చాలా అవసరం.

English summary

How Extra Marital affair affects a Relationship | వివాహేతర సంబంధాల వల్ల దుష్ప్రభావాలు

Extramarital affairs cause problems not only in the husband and wife's relationship, but with daily home life. Even if the betrayed spouse does not know of the affair, its effects are still stark. The cheating spouse is gone more frequently, comes home later and her attention is not totally focused on the family when she is at home.
Story first published:Tuesday, January 15, 2013, 18:26 [IST]
Desktop Bottom Promotion