For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ బాయ్ ఫ్రెండ్ కు దగ్గర కావడం ఎలా?

|

మీ బాయ్ ఫ్రెండ్ తో మరింత సన్నిహితం కావాలనుకుంటున్నారు, కానీ ఆ విషయం అతనికి చెప్పడానికి భయపడుతున్నారా? అయితే చదవండి.

చర్యలు:

1. అతనితో మాట్లాడండి. మీ దినచర్య గురించి అతనికి చెప్పి, అతని దినచర్య గురించి తెలుసుకోండి. అతనికి ఆ రోజు బాగుండక పొతే అతన్ని ఉత్సాహపరచడం ఎలాగో చూడండి. ఒకసారి ఆలింగనం చేసుకుని మీరు అతని పట్ల శ్రద్ధ కలిగి వున్నారని తెలియచేయండి.

2. మీరు అతన్ని ప్రశంసిస్తున్నారని తెలియచేయండి. అతను ఒక క్రీడా బృందం సభ్యుడైతే, అతని పోటీలకు వెళ్ళండి. గట్టిగా అతన్ని ఉత్సాహపరచండి, మీరు అతని కోసం, అతనికి మద్దతుగా ఉన్నారని తెలియచేయండి.

3. అతనితో మరింత సమయం గడపండి. అతన్ని మీ ఇంటికి ఆహ్వానించండి, లేదా అతనితో ఏకాంతంగా ఎలా గడపగలరో చూడండి లేదా బాగా సన్నిహిత మిత్రులతో పాటుగా అతని సాహచర్యంలో గడపండి. అదే సమయంలో అతని వ్యక్తిగత స్వేచ్చను గౌరవించండి. మీ ఇద్దరి మధ్యలో కూడా వ్యక్తిగత స్వేచ్చ, మీతో మీరు గడుపుకోవాల్సిన సమయం ఉంటాయని మర్చిపోకండి.

How to Get Closer to Your Boyfriend

4. అతని గురించి అతను బాగా ఆలోచించేలా చేయండి. అతనికి ఒక కానుక కొనండి. అతన్ని ప్రశంసించండి. జోకులు వేయండి. మీకు అతనితో వ్యక్తిగత బంధం బలపడే కొద్దీ మీతో ఉండడాన్ని అతను సౌకర్యంగా భావిస్తాడు.

5. అతనికి ఇబ్బంది లేదనుకుంటే స్పర్శించండి. సరదాగా నెట్టడం, పొడవడం లాంటివి చేసి అతను ఎలా స్పందిస్తాడో చూడండి. అతనూ సరదాగా స్పందిస్తే సరే. లేదంటే మరీ అతనికి కోపమోచ్చేలా ముట్టుకోకండి.

6. అతనికి మిమ్మల్ని నమ్మడానికి కావలసిన కారణాలు ఇవ్వండి. మీ బంధం మీద నమ్మకం వుంచండి - అతన్ని మోసం చేయకండి. అతని చర్యలను నమ్మండి - అతను గమనిస్తాడు. ఒక ఆరోగ్యకరమైన బంధానికి నమ్మకం, సంభాషణ చాలా ముఖ్యమైన భాగాలని గుర్తుంచుకోండి. నమ్మకం లేకపోవడం వల్ల ఎలాంటి బంధమైనా విచ్చిన్నం అవుతుందని తెలుసుకోండి.

7. అతన్నేనేరుగా అడగండి. మీరిద్దరూ ఒకరితో ఒకరు సౌకర్యంగా వున్నారని మీరనుకుంటే, నేరుగా అతన్నే ఈ బంధాన్ని మరింత ముందుకి తీసుకు వెళ్ళడం గురించి ఏమనుకు౦టున్నావని అడిగేయండి. అతను ఈ బంధానికి ఒడంబడాలని మీరు అనుకుంటే, మీ బంధం తొలిదశలో ఇలా చేయడం అంత మంచిది కాదు,

8. అతను మిమ్మల్ని ఎలా గౌరవిస్తున్నాడో గమనించండి. మీకు పెద్దగా బాలేని రోజు మిమ్మల్ని ఉత్సాహ పరచడానికి ప్రయత్నిస్తున్నాడా? మిమ్మల్ని సంతోష పెడుతున్నాడా, నవ్వేలా చేయగలుగు తున్నాడా? మిమ్మల్ని గౌరవిస్తున్నాడా? అలా ఐతే, మీరు మీ బాయ్ ఫ్రెండ్ తో బంధంలో మరింత ముందడుగు వేయడానికి దగ్గరలో ఉన్నట్టే!

చిట్కాలు:

మీరు అతనికి కానుక కొంటుంటే, అతను మీకు కూడా కానుక ఇవ్వాలని అనుకోవద్దు. అది బాగానే వుంటుంది కానీ అతను ఈ చిన్న చిన్న కానుకల బదులు ఏదైనా మంచి పెద్ద కానుక ఇస్తాడేమో - ఏవైనా వస్తువులు కన్నా విలువైనది ఏదైనా!

సహనంగా వుండండి. మీ బాయ్ ఫ్రెండ్ కి సన్నిహితం కావడం ఒక రోజులోనో, వారంలోనో జరగదు - కాస్తంత సమయ౦ పడుతుంది మరి!

English summary

How to Get Closer to Your Boyfriend | బాయ్ ఫ్రెండ్ కు దగ్గర కావడం ఎలా?

So, you want to go to the next step with your boyfriend, but you are too scared to tell him. If so, please read on!
Story first published: Tuesday, January 8, 2013, 7:59 [IST]
Desktop Bottom Promotion