For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ వైవాహిక బందాన్ని తెంచే టాప్ 10 మ్యారేజ్ కిల్లర్స్ తో జర జాగ్రత్త...!

|

మ్యారేజ్ కిల్లర్స్ అంటే ఏంటో తెలుసా? ఉదాహరణకు స్మోకింగ్. స్మోకింగ్ అనేది మీ మ్యారేజ్ కిలర్ స్లో పాయిజెన్ లా తయారువుతుంది. అయితే దాన్ని మీరు గుర్తించడం లేదు. ప్రస్తురోజుల్లో అతి త్వరగా.. అతి సులభంగా పెళ్ళి పెటాకులు అవుతున్న విషయాలు మనందరికి తెలిసిన విషయమే. పెళ్ళైన ఒకటి రెండు సంవత్సరాలకే విడాకులకు దారితీస్తున్నాయి. అయితే ఈ విడిపోవడం అనేది ఏ కారణం లేకుండా జరగడం లేదు. ప్రస్తుత రోజుల్లో పెళ్ళైన తర్వాత భార్యభర్తల మధ్య సరైన అవగాహన లేక చాలా మంది విడిపోవాడనికి నిరుపయోగంలేని లేదా పనికిమాలిన కారణాలే విడాకుల వరకూ దారితీస్తున్నాయి. అందుకు వారి జీవితాల్లోని నిజమైన మ్యారేజ్ కిల్లర్స్ ను గుర్తించలేకపోతున్నారు. అందువల్లే ఇలా జరగుతోంది.

అయితే కొన్ని విడాకులకు వాస్తవమైన కారణాలు లేకపోలేదు. ఉదాహరణకు వ్యభిచారం, దుర్వినియోగం, డబ్బు అధికంగా ఉండటం, డబ్బులేక పోవటం, విలాసాలకు బానిసలుగా మారడం ఇలా.... మిగిలినవి మ్యారేజ్ కిల్లర్స్ కు కారణాలు బాహ్య శక్తుల వల్లే విడాకుల వరకూ దారితీస్తున్నాయి. కొన్ని రియల్ మ్యారేజ్ కిల్లర్స్ మనలోనే ఉన్నాయి. అవి ఉద్వేగాలల వల్ల మాట్లాడే తీరు, ఉపయోగించే బాష(చెడు పదాల)వల్ల కూడా విడాకులకు దారితీస్తున్నాయి.

ఉద్వేగాల వల్ల ధిక్కారం, అహం, మరియు అనుమానం వంటి భావోద్వేగాలు వివాహ బంధాన్ని విచ్చిన్న చేస్తున్నాయి. కాబట్టి మీ వివాహ బందం విడిపోకుండా, పది కాలాల పాటు చల్లగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకొంటున్నట్లైతే ఈ మ్యారేజ్ కిల్లర్స్ గురించి తెలుసుకోండి...

వివాహ బందాన్ని తెంచే టాప్ 10 మ్యారేజ్ కిల్లర్స్ వీరే...?

ఈగో: వివాహం జరిగిన తర్వాత దాంపత్య జీవితంలో ఈగో(అహం)అనేది అతి పెద్ద శత్రువు. వివాహం అనేది ఎల్లప్పుడూ ఒక ఆట లాంటిది. కష్టం, సుఖం రెండు అనుభవించాలి. భార్య భర్త ఇందురూ సమంగా తీసుకోగలిగినప్పుడే విజయం సాధించగలుగుతారు. కాబట్టి మీ ఆట గెలవాడిని ఇద్దరూ ప్రయత్నించకపోతే.. జీవతాన్ని గెలవలేరనే విషయాన్ని గుర్తించుకోండి.

వివాహ బందాన్ని తెంచే టాప్ 10 మ్యారేజ్ కిల్లర్స్ వీరే...?

అనుమానం: అనుమానం అనేది నివారించడానికి వీలులేనటుంటి ఒక వ్యాధి. భాగస్వామి మీద ఏ ఒక్కరి అనుమానం కలిగినా వాటి చర్చించుకొని, పరిష్కారం వెతుకొన్నట్లైతే జీవితం సవ్యంగా ఉంటుంది. లేదా. అతడు లేదా ఆమె మోసం చేస్తున్నారనిపిస్తే మిమ్మల్ని మీరు ఒప్పించుకోవడానికి చాలా కష్టం అవుతుంది.

వివాహ బందాన్ని తెంచే టాప్ 10 మ్యారేజ్ కిల్లర్స్ వీరే...?

కమ్యూనికేషన్ గ్యాప్: ఇది చాలా మంది జంటల్లో అంతర్గతంగా ఉంటుంది. ఒక్కోక్కో జంటను గమనించినట్లేతై వారి మద్య నిశ్శబ్దం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉండటం కూడా భారీ అగాధానికి దారితీస్తుంది. మనస్సులోని భావాలను ఒకరితో ఒకరు పంచుకోగలిగినప్పుడే ఆ వివాహ బందం చాలా కాలం పాటు బలంగా ఉంటుంది. అలా కాకుండా కమ్యూనికేష్ దెబ్బతింటే అది మ్యారేజ్ కిల్లర్ కావచ్చు.

వివాహ బందాన్ని తెంచే టాప్ 10 మ్యారేజ్ కిల్లర్స్ వీరే...?

సమయం: ప్రస్తుత ప్రపంచంలో కాలం/సమయం అనేది అత్యంత అరుదైన విషయం. ఇద్దరు భాగస్వాములు బిజీ లైఫ్ అనుభవిస్తున్నప్పుడు, ఒకరి కోసం ఒకరు సమయాన్ని కేటాయించలేకపోవడం కూడా మ్యారేజ్ కిల్లరే. మీ బందం బలపడానికి కొంత సమయాన్ని మీ భాగస్వామికోసం తప్పక వెచ్చించాలి. కాబట్టి పని వేళలు ముగించికొని త్వరగా ఇంటికి రావడం అనేది మంచి లక్షణం.

వివాహ బందాన్ని తెంచే టాప్ 10 మ్యారేజ్ కిల్లర్స్ వీరే...?

అభద్రతా భావం: మీ పాట్నర్ గురించి మీరు సరైన భద్రత కల్పించలేనప్పుడు, మ్యారేజ్ కిల్లర్ అవుతుంది. కాబట్టి భాగస్వామి మీకోసం వేచి చూసే వేళలు లేదా పనిచేసే ప్రదేశాలు సౌకర్య వంతంగా ఉండేట్లు చూసుకోవాలి. అంతే కానీ మీ భాగస్వామిని బ్లేమ్ చేయకూడదు. గుర్తించుకోండి. మనందరం కూడా పెద్ద లేదా చిన్నవి సమస్యలతో అభద్రతా కలిగిఉన్నాం.

వివాహ బందాన్ని తెంచే టాప్ 10 మ్యారేజ్ కిల్లర్స్ వీరే...?

విమర్శించడం: ప్రతి ఒక్కరిలో ఈ విషయం దాగి ఉన్నది. ఇది ఒక్క రిలేషన్ షిప్ లో మాత్రమే కాదు, అందరిలోనూ ఉన్నది. అయితే మీ పార్టర్నర్ ను సరిదిద్దుకోవడానికి ఇది ఒకరకంగా సమంజసమే. అయితే విమర్శించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. కాబట్టి కోపం చేసుకోవడం లేదా కించపరచడం లాంటివి చేయకూడదు.

వివాహ బందాన్ని తెంచే టాప్ 10 మ్యారేజ్ కిల్లర్స్ వీరే...?

చెడు ప్రవర్తన: కొన్ని సందర్భాల్లో మీ ప్రవర్తన మరియు మీ మాటలు మీ భాగ స్వామిని భాదిస్తాయి. కోపం రావడం అనేది సహజం. అంత మాత్రన జీవిత భాగస్వామి ఎక్కువ భాదపడేలా హర్ట్ చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. ఎల్లప్పుడూ గుర్తించుకోవాల్సి మాటలు తూటాలన్నా, బానాల్లా గుండెలోకి గుచ్చుకుంటాయి దాంతో మ్యారే కిల్లర్ గా తయారువుతాయి కాబట్టి అటువంటి పద్దతు మార్చుకోవడం మానవ నైజం..

వివాహ బందాన్ని తెంచే టాప్ 10 మ్యారేజ్ కిల్లర్స్ వీరే...?

కుటుంబ జోక్యం: రెండు వైపులా మీ పార్ట్నర్ ఫామీలీ కూడా రెండు వైపులా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందులోనే ఉంది వివాహ పవిత్ర బంధం. కాబట్టి మీ మద్యకు మూడో వ్యక్తిని అనుమతించకపోవడం ఉత్తమ పద్దతి.

వివాహ బందాన్ని తెంచే టాప్ 10 మ్యారేజ్ కిల్లర్స్ వీరే...?

సంస్కృతి-సాంప్రదాయం: ఇంటలెక్చ్యువల్ మ్యారేజెస్ పెరుగుతున్నాయి. ఒకరకంగా విడిపోవడానికి ఇవి కూడా కారణం అవుతున్నాయి. ఇలా ఇతర సంస్కృతిలో వివాహం చేసుకోదలచుకొన్నప్పుడు వారి సాంప్రదాయాల్ని గౌరవించడం రెండు వైపులా చాలా అవసరం. అందులో పాక్షిక దోరణి, ఆమోదం తెలపకపోవడం వంటి విషయాన్ని గుర్తించుకోవాలి. అటువంటప్పుడు మీరు చేసుకోబోయే పాట్నర్ ను పూర్తిగా సాంస్కృతిక సాంప్రదాయలతో సహా అంగీకరించడం లేదా అలా జరగనప్పుడు పూర్తిగా చేసుకోకుండా ఉండటమే మేలు.

వివాహ బందాన్ని తెంచే టాప్ 10 మ్యారేజ్ కిల్లర్స్ వీరే...?

భంగపాటు: పని ఒత్తిడి, నిరాశ వంటివి ఆఫీసులోనే వదిలేయాలి. ఆ చిరాకును మీ పాట్నర్ మీద చూపడం ఎంత మాత్రం సమంజసం కాదు.

English summary

Top 10 Marriage Killers To Beware Of | వివాహ బందాన్ని తెంచే టాప్ 10 మ్యారేజ్ కిల్లర్స్ వీరే...?

Marriage killers are like smoking. They keep slow poisoning your marriage and you never realize it till its too late. We all are aware that marriages are breaking up very easily today and divorces never happen without a cause. So many people end their marriage for absolutely frivolous sounding reasons. This happens because they are not able to identify the real marriage killers who are sinking their teeth into their relationship.
Story first published: Wednesday, March 13, 2013, 13:48 [IST]
Desktop Bottom Promotion