For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీభర్త మిమ్మల్నినిర్లక్ష్యం చేయడానికి ముఖ్య కారణాలు?

|

రిలేషన్ షిప్ లో భార్యా భర్తల సంబంధం చాలా అన్యోన్యమైనది. ఈ సంబంధాన్ని ఎక్కువ కాలం నిలిచి ఉండాలంటే, భార్య, భర్త ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు, ఈగోలు, శృంగారం పట్ల అయిష్టత, ఒకరి మీద ఒకరికి ద్వేశాలు వంటి వాటికి తావివ్వకూడదు. సర్ధుబాటు తనం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల వారి మద్య సంబంధం ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. చిన్న చిన్న మనస్పర్థాలు ఇద్దరి మద్య దూరాన్ని పెంచుతుంది. అతను రోజు రాత్రి ఇంటికి లేటుగా వస్తున్నాడా?వస్తూనే అతను మిమ్మల్ని పలకరించకపోవడం లేదా మీకు ప్రాధన్యత ఇవ్వకపోవడం? ఈ సమస్యను చాలా మంది మహిళలు తమ వివాహ భాందవ్యంలో ఎదుర్కొంటారు. ఇటువంటి సమస్యలను మీ భర్త ద్వారా ఎదుర్కొట్టున్నప్పుడు అతను మిమ్మల్ని పట్టించుకోవడంలేదని మీరు గమనించినట్లైతే, అప్పుడు మీరు ఎమి తప్పు జగురుగుతుంది?దానికి మీరు ఏం చేయాలని తెలుసుకోవాల్సి ఉంది.

ఏ రిలేషన్ షిఫ్ లోనైనా సరే ఇద్దరి మద్య సాన్నిహిత్యం, సంరక్షణ మరియు మర్యాద కలిగి ఉండటం చాలా సహజంగా, సాధారణంగా ఉండాలి. ముఖ్యంగా ఇవి పెళ్ళైన వారిలో ఉన్నప్పుడే వారి వివాహం ఒక సంపూర్ణ సంబంధంగా పిలువబడుతుంది. కానీ ఏ యొక్క వివాహ బంధం ఫర్ఫెక్ట్ అనిపించుకోబడదు. ప్రతి ఒక్కరి వివాహ బందంలో హెచ్చు, తగ్గులు, కోపతాపాలు, ఉండనే ఉంటాయి. కాబట్టి, మీ భర్త మిమ్మల్ని ఇకపై పట్టించుకోవడం లేదని అనుభూతి కలిగిస్తే, అందుకు మీరు, అతన్ని సరైన ట్రాక్ లోని తిరిగి తీసుకురావడానికి కొన్ని మార్గాలను కనుగొనాలి.

కాబట్టి, ఎప్పుడైతే మీ భర్త మిమ్మల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినా, లేదా అలా నిర్లక్ష్యం చేయకుండా ఉండాన్నా అందుకు మీరు తెలుసుకోవల్సిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.

మీ భర్త మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా?

మీ భర్త మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా?

అతను నిజంగా మిమ్మల్ని పట్టించుకోవడం లేదా?: ఏదైనా చేసే ముందు, మొదట అతను నిజంగానే మిమ్మల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడా లేదా మీరు మాత్రమే అలా భావిస్తున్నారా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అందుకు ఆధారాలకు కోసం చూడండి మరియు మీ భర్త యొక్క ఫీలింగ్స్(భావాలు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని సార్లు అది మీ తలలో మెలిగిన ఆలోచనే అన్న విషయం తెలుసుకొన్నాకా మీకు ఆశ్చర్యం కావచ్చు.

మీ భర్త మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా?

మీ భర్త మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా?

అతను వేరే ఇతర సంబంధాలు కలిగి ఉన్నాడేమో అని ఒక సారి కనుగొనాలి: మీ భర్త, అకస్మాత్తుగా మిమ్మల్ని పట్టించుకోవడం మానేసినట్లైతే, అప్పుడు అతను ఖచ్చితంగా బయట సంబంధాలతో సంతోషంగా ఉన్నడానడానికి అధికంగా అవకాశం ఉంది. దాన్ని కనుగొని, దాని గురించి అతనితో మాట్లాడటానికి ప్రయత్నించండి.

మీ భర్త మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా?

మీ భర్త మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా?

చర్చించండి(మనస్సులోని విషయాన్ని వెలికి తీయండి): మీలో ఉన్న మీ భావాల గురించి ఒక స్పష్టంగా మాట్లాడటం వల్ల ఒక స్పష్టమైన విషయం తెలుసుకుంటారు. మీరు చెందుతున్న అనుభూతి గురించి మీ భర్తతో కూర్చొని మాట్లాడండి. అతను కెరీర్ లేదా ఆర్థిక లేదా మానసికంగా లేదా భౌతికంగా ఏదైనా హెచ్చుతగ్గులకు లోనవుతున్నారేమో అని అడిగి తెలుసుకోండి. అతను చెప్పేదాన్ని పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. మీకు ఇష్టం లేని విషయాలు చెప్పినా కూడా ఆ విషయాన్ని మీరు స్వీకరించడానికి మీరు సిద్దంగా ఉండాలి. మీ వివాహ బందాన్ని సురక్షితం చేసుకోవాలనే విషయాన్ని మనస్సులో గుర్తుంచుకోండి.

మీ భర్త మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా?

మీ భర్త మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా?

మంచిగా ఉన్న పాత రోజులను అతని గుర్తు చేయండి: వివాహం జరగడానికి ముందు మీ ఇద్దరి మద్య జరిగిన సంఘటలను గుర్తు చేయండి. మీతో ఎలా ప్రేమలో పడ్డారు? ఎందుకు పడ్డారు అన్న విషయాన్ని అతనికి గుర్తు చేసి సంతోషంగా మాట్లాడటానికి ప్రయత్నించండి. అతనితో ఎక్కువ సమయం గడపడానికి లేదా హాలిడే ట్రిప్ వెళ్ళడానికి ప్రయత్నించండి.

మీ భర్త మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా?

మీ భర్త మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా?

అతన్ని నమ్మించడానికి ప్రయత్నించవద్దు: మీ భర్తతో మీరు చర్చించేటప్పుడు, ప్రతి ఒక్క విషయానికి నిందించడం లేదా నమ్మించడానికి ప్రయత్నించకూడదు. నిశ్శబ్దంగా ఉంటూనే మీలో ప్రశ్నలను వెలికితీసి సమాధానలు రాబట్టండి. తప్పులను అంగీకరించి ఆ తప్పులను చక్కదిద్దుటకు ప్రయత్నించండి.

మీ భర్త మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా?

మీ భర్త మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా?

సాన్నిహిత్యం కొన్ని అద్భుతాలను తీసుకొస్తుంది: చాలా మంది జంటలు సాన్నిహిత్యం లేకపోవడంతోనే బాధపడుతుంటారు . ప్రస్తుత రోజుల్లో ఎక్కువ గంటలు పనిచేసే ఉద్యోగాలతో సతమతమౌతూ ఒకరి కోసం ఒకరు సమయాన్ని గడపలేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. ఇది మీ మద్య జరగకుండా చూసుకోండి. ఒక వేళ మీ భర్త మీ సాన్నిహిత్యాన్ని పొందలేకపోతున్నాడేమో గుర్తించండి. ముద్దు, కౌగిలింతలతో అతనికి ప్రేమను పంచండి.

మీ భర్త మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా?

మీ భర్త మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా?

సహాయం కోరండి: మీ విషయాలు కంట్రోల్ తప్పుతున్నాయంటే, అప్పుడు ఇతరుల నుండి సలహాలను కోరుకోండి. అందుకు మీకు నమ్మకమైన స్నేహితులు లేదా తల్లిదండ్రులు లేదా మ్యారేజ్ కౌన్సిలర్స్ తో మాట్లాడటానికి ప్రయత్నించండి. ఎవరితోనైనా నిష్పాక్షికంగా మాట్లాడటం వల్ల విషయాలను సలభంగా తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

మీ భర్త మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా?

మీ భర్త మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా?

మార్పులును తీసుకురండి: మీ వివాహబందంలో ఏదైనా విషయాన్ని దాచినట్లైతే వాటిని బయట పెట్టండి. గొడవతో లేదా ఏడుపుతో మిమ్మల్ని మీ భర్త కేర్ చేయకపోవచ్చే. అవి మీ వివాహబంధాన్ని ఎక్కువ దూరం తీసుకెళ్ళలేవు. మీరున్న పరిస్థితుల్లో మీలో మార్పలు మరియు మీ పరిసరాల్లో మార్పులు చాలా అవసరం. అవే మిమ్మల్ని మంచిగా నిలబెడుతాయి.

English summary

What To Do When Husband Doesn't Care

Is he coming home late every night? Hardly greets you or has stopped giving you attention? Most women face this problem of emotional abandonment at some point of their marriage.
Desktop Bottom Promotion