For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంచి తండ్రి-కూతుళ్ళ మద్య సంబంధం ఎలా ఉండాలి

|

ఒక కూతురి తండ్రి శిశువు నుండి పెద్దయ్యే వరకు పెద్దయ్యే నుండి టీనేజ్ వరకు ఆమె జీవితంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరు. అందువల్ల తండ్రికి అతని చిన్న అమ్మాయి బలంగా, విశ్వాసంతో కూడిన మహిళగా అభివృద్ది చెందడానికి ఒక పెద్ద బాధ్యతను కలిగి ఉంటాడు.

కూతురి జీవితంలో తండ్రి ప్రభావం ఆమె ఆత్మా గౌరవాన్ని, ఆత్మా విశ్వాసాన్ని, పురుషులపై అభిప్రాయాన్ని తెలియచేస్తుంది. తండ్రి-కూతుళ్ళ బంధం సరిగా ఉండడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి.

స్నేహితుడిగా ఉండడం మొదటి నిబంధన:

స్నేహితుడిగా ఉండడం మొదటి నిబంధన:

తనను మీ స్నేహితురాలిలా చూడండి; ఆలోచనలు పంచుకోండి, అభిప్రాయాలూ అడగండి.

మీ కుమార్తెను మీతో సమానంగా చూడండి:

మీ కుమార్తెను మీతో సమానంగా చూడండి:

ఆమెకు ఏమీ తెలియదు అనే వైఖరితో ఉండకండి. ఈ రోజుల్లో పిల్లలు చాలా సున్నిత మనస్కులు, వారేంచేస్తున్నారో వారికి తెలుసు.

మధ్యవర్తిగా ఉండండి:

మధ్యవర్తిగా ఉండండి:

ఒకవేళ మీ అమ్మాయి మీ భార్యతో సమస్యలు ఎదుర్కుంటే, ఇద్దరి ఆడవాళ్ళ మధ్య మధ్యవర్తిగా వ్యవహరించండి. పురుషుని ప్రవేశంతో కొన్ని సమస్యలు చల్లబడతాయి.

సంభాషించడం నేర్చుకోండి:

సంభాషించడం నేర్చుకోండి:

మీరు వాస్తవానికి సంభాషణచేయని లేదా చిరాకుపడే వారిలో ఒకరి ఉంటే, ఆమెకు చదువులో సహాయం చేయడం లేదా ఎప్పుడో ఒకసారి ఆమెకు ట్రీట్ ఇవ్వడం లేదా షాపింగ్ కి తీసుకు వెళ్ళడం వంటి చిన్న పనులు చేయడం ప్రారంభించండి.

ఆమెను నమ్మండి:

ఆమెను నమ్మండి:

అమ్మాయిలూ యుక్తవయసులో ఉన్నపుడు, తండ్రులు సాధారణంగా వారి పిల్లల రక్షణకు పాటుపడుతుంటారు. ఈ ప్రవర్తన తరచుగా జరుగుతూ ఉంటే అమ్మాయిలూ తండ్రులను దూరంగా ఉంచుతారు. మీ కుమార్తె ఆచూకీ గురించి ఎక్కువ అనుమానాలు ఉండకూడదని గుర్తుంచుకోండి.

స్వేచ్చగా ఉండనివ్వండి:

స్వేచ్చగా ఉండనివ్వండి:

వాళ్ళు ఎప్పుడూ పిల్లలు కారు. వారి తప్పులను వారే సరిదిద్దుకోనివ్వండి. అలాంటి తప్పుల గురించి మంచిని ప్రస్తావి౦చేటపుడు వాటిని మీరు వారి జీవితంలో ఆశక్తిగా భావిస్తే, మీరు ఏంచెయ్యాలి అనుకుంటున్నారో వాటిని చేయలేరు. బోధించడం మానండి.

బేషరతుగా ప్రేమించండి:

బేషరతుగా ప్రేమించండి:

ఆమె మీ సొంత కూతురు. ఆమె ఏదైనా తప్పు చేసినా లేదా ఆమె మీకు తగ్గ కూతురు కాకపోయినా బేషరతుగా ప్రేమించండి. మీ ప్రేమ ఆమె తన జీవితంలో సరైన నిర్ణయం తీసుకుని మరేటట్లు చేస్తుంది.

ఆమె స్నేహితులను అంగీకరించండి:

ఆమె స్నేహితులను అంగీకరించండి:

మీ కూతురి సాంఘిక పరిచయాలను అంగీకరించడం కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది. ఆమెకున్న స్నేహితులలో రకాలను చూసి ఎక్కువమంది తండ్రులు ఆశ్చర్య పోవచ్చు.

సహనంతో ఉండండి:

సహనంతో ఉండండి:

హార్మోన్లు క్రూరంగా పరిగెత్తి, సహనాన్ని కోల్పోతాము. ఆమె ఎల్లప్పుడూ గొంతును పెంచకుండా ఉండడానికి మీరు సహనంతో ఉండడం అవసరం. మీరు సాధారణంగా స్పందించలేదని గ్రహిస్తే, ఆమె మీ ముందు మౌనంగా ఉంటుంది.

ఆమెతో కలిసి సమయాన్ని గడపండి:

ఆమెతో కలిసి సమయాన్ని గడపండి:

సమయం బంధాన్ని నిలిపే గొప్ప అంశం. ఆమెకు ఇష్టమైనవి చెయ్యడానికి ప్రయత్ని౦చి తేడా చూడండి. ఆమె మీ మార్గాన్ని ఇష్టపడుతుంది.

English summary

For a good father-daughter relationship

A girl’s father is one of the most influential people in her life, from infant to toddler to tween to teen. Because dad has such a big impact on his little girl’s development into a strong, confident woman.
Desktop Bottom Promotion