For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇటువంటి లక్షణాలు కనిపిస్తే మీరు ప్రమాదంలో ఉన్నట్లే

|

విషపూరిత సంబంధాలు అనే పదం మిమ్మల్ని భయ పెట్టడానికి కాదు. బాగానే మొదలైన బంధాలు కూడా కాలగమనంలో విష పూరితంగా మారవచ్చు. ఒక బంధం విషపూరితం అయితే, మీరు మీ జీవితం నుంచి ఆ విష పదార్ధాలను తొలగించుకోవాలి. చాలాసార్లు మీకు సరిపోని వ్యక్తితో ఒక విషపూరిత బంధంలో ఇరుక్కునే ప్రమాదం కూడా వుంది.

మీ భాగస్వామి మీకు సరిపోడు అంటే ప్రధానంగా దాని అర్ధం అతడు లేక ఆమె తప్పు దారి పట్టారని అర్ధం. ఇది ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్పుకోవచ్చు. మీ భాగస్వామి పొగ తాగే వారైతే, మిమ్మల్ని కూడా పొగ తాగమని ప్రేరేపిస్తే బహుశా మీరు ఒక విషపూరిత బంధంలోకి వెళ్తున్నారన్న మాట. కానీ పొగ తాగే మీ భాగస్వామి, తను పొగ తాగే సమయంలో మిమ్మల్ని దూరంగా ఉండమని చెప్తే, వ్యసనం కలిగి వున్నా అతడు బాధ్యత కలవాడని అర్ధం.

విషపూరిత బంధాలు అనారోగ్యకరమైనవి కనుక మీరు వాటిలోంచి బయటకు రావాలి. మీరు విషపూరిత బంధంలో వున్నారని చెప్పే కొన్ని సంకేతాలు ఇక్కడ ఇచ్చాము, మీరు వెంటనే మీ భాగస్వామిని వదిలి వేయాలి.

మానసిక వేధింపులు :

మానసిక వేధింపులు :

ఏదైనా గొడవ పడినప్పుడు అతను మీ బలహీనతలను ఉపయోగించుకున్నా, మీ కుటుంబాన్ని గొడవలోకి ఈడ్చినా అతను దారి తప్పాడని గుర్తు. కొన్ని సార్లు దీన్ని క్షమించవచ్చు గానీ, ఇదే అలవాటై పొతే, మీరు మానసిక వేధింపులు భరిస్తున్నట్టే.

శారీరిక వేధింపులు :

శారీరిక వేధింపులు :

కొంతమంది తమ బంధాల కోసం శారీరిక వేధింపులు కూడా భరిస్తున్నారు. మీ భాగస్వామి తాగి గానీ, మత్తు మందుల ప్రభావం వల్ల గానీ మీ మీద చేయి చేసుకుంటే అది శారీరిక వేధింపుల క్రిందికి వస్తుంది. ఇలాంటి వేధింపులు ఎదురౌతే వెంటనే మొదటి సందర్భంలోనే ఇది చెల్లదని చెప్పేయండి, రెండో అవకాశం ఇవ్వకండి.

వ్యసనం :

వ్యసనం :

మీ భాగస్వామి వ్యసనానికి బానిసైతే, అతను లేక ఆమె మీ చుట్టూ వుండడం కూడా ప్రమాదకరం అన్నమాట. వ్యసనపరులు డబ్బులు దొంగిలిస్తారు, మతి భ్రమించినప్పుడు మిమ్మల్ని చంపుతామని కూడా బెదిరిస్తారు.

మీ వృత్తిగత జీవితం మీద ప్రభావం :

మీ వృత్తిగత జీవితం మీద ప్రభావం :

మీ బంధం మీ వృత్తిగత జీవితానికి ఇబ్బంది కలిగిస్తుంటే మాత్రం ఇక దానికి ఎలాంటి విలువా లేనట్టే. మీ వృత్తికి అవరోధంగా వుండే భాగస్వామితో కలిసి ఉండకండి.

చాలా పగలు :

చాలా పగలు :

మీ భాగస్వామిని తలుచుకున్నపుడల్లా మీకు అతని మీద వున్న పగ గుర్తుకు వస్తోందా? అలా అయితే మీ బంధం చేదుగాను, విషపూరితంగానూ మారిందని అర్ధం. కాబట్టి మీరు మీ భాగస్వామితో మాట్లాడి దాన్ని బాగు చేసుకుని మళ్ళీ కొత్త జీవితం మొదలు పెట్టవచ్చు లేదా ఆ విష పూరిత బంధానికి స్వస్తి పలుకవచ్చు.

పరాజితుల ముఠా :

పరాజితుల ముఠా :

విద్యాపరంగా లేదా వృత్తిపరంగా మీ భాగస్వామి సరైన పనితీరు కనపరచడం లేదా? విజయం వెంట పరుగులు తీయవద్దని మిమ్మల్ని కూడా వత్తిడి చేస్తున్నాడా? అయితే మీ భాగస్వామి మిమ్మల్ని పరాజితుల ముఠాలో చేరుద్దామని అనుకుంటున్నాడన్నమాట! ఇలాంటి వాడిని వెంటనే వదిలివేయాలి.

English summary

Signs You Are In A Toxic Relationship

The term toxic relationship is not to scare you. Relationships that start off very well and normally can also turn toxic in the due Course of time. When a relationship becomes toxic, you have to get rid of the toxins from your life. Most often, end up in a toxic relationship with a partner who is bad for you.
Desktop Bottom Promotion