For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హనీమూన్ ఎంజాయ్ చేయాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!

|

అంజలి వాళ్ళ హనీమూన్ మొదటి రోజు ఉదయాన్నే ఆమె లేవగానే తన పక్క మీద ఒక పెద్ద బాక్స్ వుండడం చూసింది. దాంట్లో ఆమె ఫోటోల సంకలనంతో పాటు, "ప్రియా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నా జీవితాన్ని అందంగా మార్చావు" అని రాసి వున్న కాగితం కూడా వుంది. తన భర్త ఎక్కడ వున్నాడా అని ఆమె ఆశ్చర్య పోయేలోగా అతను ఒక పెద్ద గులాబీల గుత్తిని ఒక కొంటె నవ్వుతో తీసుకొచ్చాడు. తరువాత కూడా జరిగిన ఇలాంటి అందమైన అనుభవాలతో, అద్భుతమైన సర్ప్రైజ్ లతో ఆమె తన హనీమూన్ ను ఆసాంతం ఆస్వాదించింది.

మీరు కూడా హనీమూన్ కు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే మీ ప్రణాళిక ఏమిటి ? మీరు సిద్ధంగా లేక పొతే బాధ పడకండి, ఎందుకంటే మీ హనీమూన్ ను పూర్తిగా ఆస్వాదించడానికి మేము ఇక్కడ కొన్ని అద్భుతమైన టిప్స్ ఇస్తాం.

మీ హనీమూన్ ఎంజాయ్ చేయడానికి మంచి టిప్స్ !!

పరస్పరం సర్ప్రైజులు :

పరస్పరం సర్ప్రైజులు :

అన్ని సర్ప్రైజులు అందుకున్న అంజలి ఇప్పటికీ తమ హనీమూన్ ను మర్చిపోలేకుండా వుంది, పెళ్ళైన 15 ఏళ్ళ తరువాత కూడా ఆ ప్రస్తావన వస్తే సిగ్గు పడుతుంది. అలాంటి అందమైన అనుభూతులు కావాలంటే మీ హనీమూన్ అప్పుడు మీ శ్రీమతి లేక శ్రీవారికి మంచి సర్ప్రైజులు ఇచ్చేలా చూసుకోండి.

సాయంత్రపు షికారు :

సాయంత్రపు షికారు :

ప్రపంచంలోని ప్రేమ, ఆప్యాయత జోడించి ఒకరి చేతులొకరు పట్టుకుని అలా బీచ్ వెంట నడుస్తుంటే ఎంత రొమాంటిక్ గా వుంటుంది!! ఇవన్నీ "నీ కోసమే" అని చెప్పే క్షణాలు. వాటిని అనుక్షణం అనుభవించండి. అలా మీరు తరువాత చాలాసార్లు వెళ్ళవచ్చు గాక, కానీ ఈ హనీమూన్ అప్పుడు నడిచింది మాత్రం ఎప్పటికీ గుర్తుంది పోతుంది.

రొమాంటిక్ డిన్నర్ :

రొమాంటిక్ డిన్నర్ :

మీరు ఎప్పుడూ అతనితో కలిసి కాండిల్ లైట్ డిన్నర్ చేయాలని కోరుకున్నారు. ఈ కోరికను మీ హనీమూన్ అప్పుడు ఒక ప్రత్యెక డిన్నర్ ప్లాన్ చేసి తీర్చుకోండి. దాన్ని మరింత రొమాంటిక్ గా మార్చేందుకు ఒక బీచ్ దగ్గర, చాలా కొవ్వొత్తులతో, ప్రేమ పాటలు వింటూ ఆ మూడ్ లో ఉండేలా ప్లాన్ చేయండి.

జలక్రీడలు లేదా పర్వతారోహణ :

జలక్రీడలు లేదా పర్వతారోహణ :

మీ ఇద్దరికీ క్రీడలు, సాహసాలు ఇష్టమైతే, జలక్రీడలు లేదా పర్వతారోహణ చేయడం మంచిది. పర్వతారోహణకు వెళ్ళే పనైతే, గైడ్ ను తీసుకు వెళ్ళకుండా మీ ఇద్దరే వెళ్ళండి. మీరిద్దరూ చేరువై కలిసి వుండే మధుర క్షణాలు కూడా ఎదురుకావచ్చు.

కొంచెం చిలిపిగా వుండండి :

కొంచెం చిలిపిగా వుండండి :

హనీమూన్ అనగానే మీ పెదాలపైకి చిరునవ్వు వస్తుంది. అది ఒకరితో ఒకరు ఉండడమే కాదు ఒకరినొకరు అర్ధం చేసుకోవడం కూడా. అందుకని మీ కల్పనలన్నీ అప్పుడే తీర్చుకోండి. కురచ దుస్తులు, చిలిపిగా వుండే లోడుస్తులతో అతనికి పిచ్చెక్కించండి.

పూలు :

పూలు :

ఆడవారికి పూలంటే ప్రాణం. ఆవిడను సాధ్యమైనన్ని సార్లు ప్రత్యేకమైన వ్యక్తీ అని గుర్తు చేయండి. ఒక పూల గుత్తి లేదా ఒక్క గులాబితో కూడా ఆ పని చేయవచ్చు. బదులుగా మీరు ఏమైనా అడగండి, మీ కోరిక ఏదైనా ఆమె తీర్చకుండా ఉంటుందని నేననుకోను.

ప్రేమలేఖ :

ప్రేమలేఖ :

మీ భాగస్వామికి ప్రేమలేఖ రాయడం పాత స్టైల్ అనుకుంటున్నారా ? ప్రయత్నించి చూడండి. మీ చుట్టూ ప్రేమ వాసనలు గుబాలిస్తాయి. ఆధునిక ప్రపంచంలో చాలా టెక్నాలజీలు వున్నాయి గానీ ప్రేమలేఖ ఇప్పటికే మీ ప్రియురాలి మీద గొప్ప ప్రభావమే చూపిస్తుంది.

English summary

Tips To Enjoy Honeymoon

Anjali found a big box on her bed when she got up on the very first morning of their honeymoon. There was a big Collage of her photographs in it with a small note saying, "I love you Darling.
Desktop Bottom Promotion