For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హనీమూన్ వెళ్ళడానికి అత్యవసరమైన 10 జాగ్రత్తలు

By Super
|

కొత్తగా పెళ్ళైన వారికి హనీమూన్ ఒక ప్రత్యేకమైన పర్యటన. ఇది పెళ్లి హడావిడి అయిపోయాక వారు విశ్రాంతి పొందడానికే గాక, ఒకరితో ఒకరికి బంధం బలపడడానికి ఉపయోగపడతాయి. హనీమూన్ వారికి కొంత ఏకాంతాన్ని కల్పిస్తుంది, ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. కానీ, ఈ పర్యటనకు చాలా చర్చలు, ప్రణాళికలు అవసరమౌతాయి, ఎందుకంటే లొకేషన్ నుంచి వసతి వరకు అన్నీ పెళ్ళికి ముందే నిర్ణయం అయిపోవాలి. అందుకని, మీ హనీమూన్ ప్లాన్ చేసుకునే ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ పొందుపరచాం.

ముందే ప్లాన్ చేయండి :

ముందే ప్లాన్ చేయండి :

చివరి నిమిషంలో బుకింగ్ హడావిడి, రద్దవడం లాంటివి లేకుండా మీ హనీమూన్ ను బాగా ముందుగానే ప్లాన్ చేయండి. ఇది వారికే ప్రత్యేకమైన ట్రిప్ కనుక ఇరు కుటుంబాలు కూడా హనీమూన్ ప్లానింగ్ ను ఆ జంటకే వదలి వేయాలి. అలాగే హనీమూన్ ప్లాన్ చేసే మగవారు మీ భాగస్వామి ప్రాధాన్యాలను కూడా దృష్టి లో వుంచుకోవాలి.

బాగా ప్లాన్ చేయండి :

బాగా ప్లాన్ చేయండి :

తరువాత ఇబ్బంది పడకుండా ఉండాలంటే, ఒక బడ్జెట్ నిర్ణయించుకోండి. రకరకాల పాకేజీలు చూసాక ఒక దాన్ని ఎంచుకోండి. వివిధ హోటళ్ళు, టూర్ ఆపరేటర్ల ను గురించిన సమీక్షలు చదవండి. ఇంటర్నెట్ ఉపయోగించి వివిధ ప్రదేశాల గురించి సమాచారం సేకరించుకుని, మీ ట్రిప్ కి ఒక ప్రత్యేకమైన మార్గసూచి తయారు చేసుకోండి.

వాతారణం చెక్ చేసుకోండి :

వాతారణం చెక్ చేసుకోండి :

మీ సమయం అంతా నాలుగు గోడల మధ్యనే గడిపి వేయదలచుకుంటే తప్ప మీరు వెళ్ళదలచిన ప్రదేశంలో వాతావరణం ఎలా వుండబోతోందో తెలుసుకోవడం మంచిది. గూగుల్ లో వేడికి మీరు ప్రయాణించే తేదీకి అక్కడి వాతావరణం వివరాలు తెలుసుకోండి.

ప్రయాణ పత్రాలు :

ప్రయాణ పత్రాలు :

మీరు హనీమూన్ కు వెళ్ళే ముందే వధువు పాస పోర్ట్ మీద పేరు మారే అవకాశం వుందని తెలిస్తే తప్ప, ఆవిడ పెళ్ళైన తరువాత వచ్చే పేరుతొ టికెట్లు బుక్ చేయవద్దు (అసలు ఆవిడ్ పేరు మార్చుకోదలచుకుంటే). టికెట్లు ఆవిడ పెళ్ళికి పూర్వం వున్న పేరు మీదే చేయండి. మీ పాస్ పోర్ట్ చెల్లే గడువు తేదీని ఒకసారి సరి చూసుకోండి. మీరు ప్రయాణానికి బయలుదేరే కనీసం రెండు వారాల ముందు వీసా, గుర్తింపు కార్డులు లాంటి ప్రయాణ పత్రాలు అన్నీ ఒకసారి సరిగ్గా వున్నాయో లేదో పరీక్షించుకోండి.

డబ్బుల వ్యవహారం :

డబ్బుల వ్యవహారం :

క్రెడిట్ కార్డ్ లు, ట్రావెలర్స్ చెక్ లు ఎక్కడైనా స్వీకరిస్తారు. కానీ కొన్ని స్థానిక దుకాణాల్లో నగదు చెల్లి౦పులే అడుగుతారు. అందుకని కొంత నగదు కూడా స్థానిక కరెన్సీ లో మీ దగ్గర ఉంచుకోవడం మంచిది.

కొన్ని మందులు :

కొన్ని మందులు :

బ్యా౦డెజీలు, యాంటిసెప్టిక్ ఆయింట్మెంట్లు, నొప్పి నివారిణి లాంటివి తప్పని సరిగా తీసుకువెళ్ళాలి. మీరు లేక మీ భాగస్వామి ఏదైనా ప్రత్యేకమైన మందులు తీసుకు౦టూ వుంటుంటే అవి కూడా సరిపడినన్ని తీసుకు వెళ్ళాలి.

కెమెరా :

కెమెరా :

మీరిద్దరూ కలిసి గడిపే అందమైన క్షణాలను బంధించడానికి ఒక మంచి కెమెరా తీసుకు వెళ్ళడం మరచి పోకండి. మీ హనీమూన్ ట్రిప్ మీ ఇద్దరికీ గుర్తుంది పోవాల్సిన పర్యటన కనుక ఆ చిత్రాలు మీ జ్ఞాపకాలను తాజాగా ఉంచుతాయి.

సరైన డ్రస్సులు :

సరైన డ్రస్సులు :

అబ్బాయిలూ, మీ హనీమూన్ ట్రిప్ అమ్మాయికి ఆశ్చర్యం కలిగించాలని మీరు అనుకోవచ్చు, కానీ తీర ప్రాంతాలకు వెళ్ళేట్లయితే ఆమె జీన్స్ గానీ, చీరలు గాని సర్దుకు౦దనుకోండి, ఆమె ఆ పర్యటనను ఆస్వాదించలేదు. అందుకని ఆమెకు వెళ్ళే ప్రదేశం గురించి కొన్ని సూచనలు ఇవ్వండి. అబ్బాయిలు కూడా జీన్స్, ఫార్మల్ దుస్తులు కాకుండా కాజువల్ దుస్తులు ధరిస్తే ఆస్వాదించ గలుగుతారు.

లోదుస్తులు :

లోదుస్తులు :

ఇది మాత్రం కాబోయే వదువులకు ప్రత్యేకం. మీ ఇద్దరి మధ్యా ప్రణయాన్ని రగిల్చేలా కొన్ని సెక్సీగా వుండే లోదుస్తులు తీసుకు వెళ్ళండి. శారీరికంగా, మానసికంగా మీ ఇద్దరూ ఒకరినొకరు బాగా తెలుసుకునేందుకు ఈ ఏకాంతాన్ని ఉపయోగించుకోండి.

కొన్ని సర్ప్రైజులు కూడా ప్లాన్ చేయండి :

కొన్ని సర్ప్రైజులు కూడా ప్లాన్ చేయండి :

ప్లానింగ్ అంతా తమ చేతుల్లోనే ఉంచుకున్న అబ్బాయిల కోసం ఇది ప్రత్యేకం. మీ హనీమూన్ ట్రిప్ ను మరింత ప్రత్యేకంగా తయారు చేసుకోవడానికి టూర్ ఆపరేటర్ల తో సంప్రదించండి, ఇంటర్నెట్ లో శోధించండి. ఒక ఏకాంత దీవికి పారిపోవడం లేదా ఒక ప్రశాంతమైన సరస్సు వెంట మీ కోసం వేసిన పొదరింట్లో రాత్రి బస చేయండం లాంటివి ప్రణయ సరాగాలుగా మీ భాగస్వామి భావిస్తారు.

English summary

Top Ten Honeymoon Planning Essentials

Honeymoon is a special trip for a newlywed couple. It is not just a vacation that would help them to de-stress after the wedding hustle-bustle, but also help them to bond with each other.
Desktop Bottom Promotion