For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక సంబంధం ఎక్కువ కాలం నిలబడాలంటే 20 బేసిక్ రూల్స్

|

ఒక మంచి సంబంధం చాలా తమాషగా మరియు ఉత్సాహకరంగా మొదలవుతుంది. ఒక మంచి సంబంధం ఎక్కువ కాతలం నిలబడాలన్నా లేదా ఎక్కువ రోజులు నిర్వహించాలన్నా ..స్త్రీ, పురుషుల ఇద్దరి వైపు నుండి చాలా శ్రమపడాల్సి ఉంటుంది. కాబట్టి ఇద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ నెలకొనాలంటే కొన్ని బేసిక్ టిప్స్ ఉన్నాయి. అలాగే ఇది కమిట్మెంట్, ఒకరికోసం ఒకరు అన్నట్లుగా జీవించగలిగే పరస్పర ప్రేమ మరియు గౌరవం, విశ్వాసం కోసం నిబద్ధత అన్ని అవసరం అవుతుంది.

ఈ లక్షణాలు ఇద్దరిలోనూ ఉన్నట్లైతే తప్పకుండా వారి బందం ఎక్కువ రోజులు నిలబడేలా చేస్తాయి. ఒక మంచి సంబంధాన్ని కొనసాగించడం కోసం స్త్రీ పురుషులిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొనే స్వభావం కలిగి ఉండాలి. వారి బావాలు తెలిసి ఉండాలి. పరస్పర ఇష్టాయిష్టాలు తెలిసుండాలి.

ఇలాంటివి కొన్ని బేసిక్ టిప్స్ మంచి రిలేషన్ షిష్ మెయింటైన్ చేయడానికి చాలా అవసరం అవుతాయి. ఇటువంటి ఒక రిలేషన్ షిప్ మెయింటైన్ చేయడానికి, ప్రేమగా మెలగడానికి అవసరం అయ్యే కొన్ని బేసిక్ టిప్స్ మీకోసం క్రింది విధంగా ఇస్తున్నాం పరిశీలించండి...

ఫౌండేషన్:

ఫౌండేషన్:

ఒక సంబంధాన్ని మొదలు పెట్టాక, ఆ రిలేషన్ షిప్ మరింత బలపడే విధంగా చేసుకోవడానికి కొన్ని ప్రాథమిక చర్యలు పాటించాలి. ఒకరికొకరు పరస్పరం నమ్మకంతో మరియు నిజాయితీతో ఉండాలని తెలుసుకోవాలి.

పాత విషయాలను ఎప్పటికీ చర్చించకూడదు:

పాత విషయాలను ఎప్పటికీ చర్చించకూడదు:

ప్రతి ఒక్కరి జీవితంలోనూ పాత విషయాలు(గడిచిన కాలంలో కొన్ని విషయాలను)భవిష్యత్తులో ప్రస్తావించకూడదు. అందువల్ల మీరు మీ భాగస్వామితో ఒక మంచి ఆరోగ్యకరమైన సంబంధంను కొనసాగించవచ్చు.

అర్థం చేసుకోవడం:

అర్థం చేసుకోవడం:

ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఒక రిలేషన్ షిప్ ఎక్కువ కాలం నిలబడాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా అవసరం. మీ భాగస్వామి విషయంలో ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి, అర్థం చేసుకోలేకపోవడం కన్నీ అవగాహన కలిగి ఉండటం వల్ల ఒక మంచి సంబంధాన్ని ఎక్కువ రోజుల నిలబెట్టుకోవడానికి పునాది వంటిది.

కమ్యూనికేషన్:

కమ్యూనికేషన్:

ఏ ఒక్క మంచి సంబంధమైన సరే వారి కమ్యూనికేషన్ మీదే వారి జీవితం ఆధారపడి ఉంటుంది. ఒకరికొకరికి మధ్య మంచి క్యూనికేషన్, రెగ్యులర్ కమ్యూనికేషన్ మరియు మీ భాగస్వామితో మీ భావాలు మరియు భావోద్వేగాలు పర్పస్పరం పంచుకోవడం ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా మార్చుకోవాలి.

మర్యాద:

మర్యాద:

భాగస్వామికి శుభాకాంక్షలు మరియు భావాలు తెలపడం చాలా ముఖ్యం. ఎవరైతే సంబంధాన్ని కొత్తగా మొదలు పెడుతారో, అటువంటి వారికి ఈ లక్షణాలు కలిగి ఉన్నట్లైతే వారి మద్య మంచి రిలేషన్ షిప్ మొదలవుతుంది.

క్షమించడం:

క్షమించడం:

ఇద్దరి వ్యక్తుల మద్య మర్యాద ఎంత అవసరమో, క్షమించడం కూడా అంతే అవసరం ఉంటుంది. ఎవరూ కూడా ఎటువంటి తప్పలు చేయకుండా ఫర్ ఫెక్ట్ గా పుట్టి ఉండరు, అందుకే, ఏవిషయంలోనైన క్షమించడం మరియు భాగస్వామి తప్పులను మర్చిపోయి, క్షమించడం వల్ల చాలా ముఖ్యం.

ఎప్పటికీ స్నేహితులుగా:

ఎప్పటికీ స్నేహితులుగా:

ఒక మంచి ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించడం కోసం ఇది ఒక ప్రాథమిక చిట్కా. రిలేషన్ షిప్ లో స్నేహితులుగా ఉండటం అంతకంటే మరో అద్రుష్టం ఉండదేమో. మీ రిలేషన్ షిప్ దీర్ఘకాలం కొనసాగించడానికి, బలంగా నిలబడటానికి ఇది బాగా సహాయపడుతుంది.

హద్దులు:

హద్దులు:

మీరు సంబంధం దీర్ఘకాలం నిలబడాలంటే కొన్ని హద్దుల కూడా చాలా అవసరం. మీ భాగస్వామి సెట్ చేసుకొన్ని కొన్ని హద్దులకు గౌరవం ఇవ్వడం అవసరం. ఇది వ్యక్తిత్వ భావన నిర్వహించడానికి మరియు ఒకరికోసం ఒకరు జీవించడానికి చాలా సహాయపడుతుంది.

ప్రైవసీ:

ప్రైవసీ:

మనందరికీ ప్రైవసీ అనేది చాలా అవసరం. ప్రైవసీ వల్ల మనకు మనం ఎవరం అనేది తెలియజేస్తుంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవడం ముఖ్యంగా కొత్త అభిరుచులు మరియు అలవాట్లు అభివృద్ధిని గౌరవించడం చాలా ముఖ్యం.

లాయొలటీ:

లాయొలటీ:

ప్రతి ఒక్కరి సంబంధంలోను ముఖ్యంగా విదేయతను కలిగి ఉండటం ఒక బేసిక రూల్. ఇది లేకుండా ఏ ఒక్క రిలేషన్ షిప్ కూడా ముందుకు వెళ్ళదు. లాయొలటీ అనేది, ఒక ప్రాథమిక అంశం. ఒకరినొకరు గౌరవించుకోవడం, మరియు ప్రేమించడం రిలేషన్ షిప్ లో ఒక ప్రాథమిక మూలం.

త్యాగం:

త్యాగం:

ఒకరికోసం ఒకరు త్యాగం చేసుకోవడం వల్ల ఒక సంబంధం దీర్ఘకాలం నిలబడుతుంది. కొన్ని విషయాల్లో ఒకరికొకరు కట్టుబడి ఉండటం మరియు కొన్ని వస్తువులను, పనులను ఒకరికొకరు త్యాగం చేసుకోవడం వల్ల రిలేషన్ షిప్ బలపడుతుంది.

వాదనలు:

వాదనలు:

ఒక ఆరోగ్యకరమైన వాదన కలిగివున్నప్పుడు ఇద్దరి మధ్య ఒక మంచి సంబంధం కలిగి ఉంటుందనడానికి చిహ్నం. ఇద్దరిలోనూ ఏ ఒక్కరిలో ఎటువంటి సందేహం ఉన్న వాటిని వెలికి తీసి, బయటపెట్టి, వాదించి మరీ విషయాన్ని క్లియర్ చేసుకోవడం చాలా అవసరం.

సపోర్ట్(మద్దతు):

సపోర్ట్(మద్దతు):

మీ పార్ట్నర్ కు అవసరం ఉన్నప్పుడు మద్దతు ఇవ్వడం చాలా అవసరం. జీవితంలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం, నిర్ణయాలు తీసుకోవడి ఇద్దరీకి చాలా మంచిది.

రిలేషన్ షిప్ లో నమ్మకం:

రిలేషన్ షిప్ లో నమ్మకం:

ఏ ఒక్కరి జీవితంలోనైనా నమ్మకం అనేది చాలా ముఖ్యం. మీ సంబంధం గురించి మీలో సందేహాలున్నప్పుడు వాటి గురించి నివ్రుత్తి చేసుకోవడం చాలా అవసరం. సంబంధం నిర్వహించేటప్పుడు ఒకరి మీద ఒకరికి నమ్మకం కలిగి ఉన్నప్పుడు మీ సంబంధం ఎక్కువ కాలం నిలబడుతుంది.

మార్పు:

మార్పు:

జీవితం ఎప్పుడూ ఒకే మాదిరి ఉంటే లైఫ్ బోర్ కొడుతుంది. కాబట్టి, మార్పు అనేది చాలా అవసరం. ఎప్పుడూ ఇల్లు, పిల్లలు, ఉద్యోగం అని కాకుండా పార్ట్నర్ తో అలా షికారు చేయండి. బయట ప్రదేశాలకు వెళ్ళండి. ఒక సంబంధం దీర్ఘకాలం నిలబడాలంటే ఇద్దరిలోని మార్పు అనేది ఉండాలి. భాగస్వామికి నచ్చిన విధంగా నడుచుకోవడం చాలా అవసరం.

శృంగారం:

శృంగారం:

ఒక సంబంధం నిర్వహించడానికి, దీర్ఘకాలం పాటు నిలబడటానికి శృంగారం ఒక ప్రాథమిక అంశం. దీని వల్ల ఇద్దరు అత్యంత సన్నిహిత స్థాయిలో కలిసి ఉండటానికి సహాయపడుతుంది. ఇద్దరి మద్య సంబంధం మరింత బలపడే విధంగా చేస్తుంది.

హార్డ్ వర్క్:

హార్డ్ వర్క్:

ఒక మంచి సంబంధ నిర్వాహణలో హార్డ్ వర్క్ అనేది సౌకర్యవంతంగా మరియు పీస్ ఫుల్ గా ఉండేలా చేసుకోవాలి. భాగస్వామి పని ఒత్తిడిలో సతమతమవుతున్నప్పుడు సహాయం చేయడంలో ఉన్న అనుభూతి, వారి సంబంధం మరింత బలపడేలా చేస్తుంది.

ఒకరికోసం ఒకరు సమయం వెచ్చించడం:

ఒకరికోసం ఒకరు సమయం వెచ్చించడం:

రిలేషన్ షిప్ లో ఇది చాలా అవసరం. ఎంత బిజీ లైఫ్ లో ఉన్న, భాగస్వామికోసం కొంత సమయం కేటాయించడం వల్ల ఇద్దరికి ఒకరి విషయాలు ఒకరు మాట్లాడుకోడం, మంచి చెడులు తెసుకోవడం వల్ల సంత్రుప్తికరమైన జీవితం అలవడుతుంది.

అపార్థాలు:

అపార్థాలు:

ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎదుర్కొనే సమస్య అపార్థ. ప్రతి చిన్న విసయానికి అపార్థం చేసుకోవడం ఒక బల పరీక్షవంటిదే. అపార్థాలు మనస్సులో ఉంటే అవి అనారోగ్యానికి దారితీస్తాయి. కాబట్టి వాటిని వెలికి తీసి వాటిని పరిష్కరించుకోవడం ఇటు ఆరోగ్యపరంగా, రిలేషన్ షిప్ పరంగా చాలా అవసరం.

నిష్కపటం:

నిష్కపటం:

ఒక మంచి సంబంధం ప్రతి రోజూ ఏదో ఒక కొత్తగా గడపడం ఒక స్థిర ప్రక్రియ. ఇద్దరిలోనూ ఏవిధమైన అపార్థాలకు చోటు ఇవ్వకుండా నిష్కపటంగా జీవించగలిగినప్పుడు ఆ సంబంధం దీర్ఘం కాలం పాటు కొనసాగుతుంది.

English summary

20 Basics Of A Good Relationship

A relationship starts with a lot of fun and excitement.Maintaining it as a good relationship takes a lots of effort from both involved.
Story first published: Friday, September 6, 2013, 17:43 [IST]
Desktop Bottom Promotion