For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్ళికి వచ్చిన అతిథులను ఆనందపరచటానికి చిట్కాలు

|

ప్రతి జంట వారి వివాహం గురించి కలలు కంటారు. వివాహం అనేది ప్రతి జంట వారి ఆనందాన్ని పంచుకోవడం కొరకు జరుపుకొనే ఒక చిరస్మరణీయ ఉత్సవం. తరువాత ప్రియమైన వారి యొక్క ఒక అధికారిక పునఃకలయిక అని చెప్పవచ్చు. కాబట్టి మీ వివాహ ఏర్పాట్ల ప్రణాళిక మరియు మీరు మీ అతిథుల సౌకర్యంనకు ప్రాధాన్యత ఇవ్వటం ముఖ్యమైనది. వారిని సంతోషంగా ఉంచే బాధ్యత మీది అవుతుంది. మీ వివాహ వేడుకల సమయంలో వచ్చిన మీ అతిథులు ఉండటానికి మరియు సౌకర్యవంతముగా భావించడానికి సహాయం చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

బడ్జెట్ విషయాలు

బడ్జెట్ విషయాలు

ప్రతి ఫంక్షన్ కోసం ఒక బడ్జెట్ సెట్ చేసుకొని దానికి అనుగుణంగా అతిథులను ఆహ్వానించండి. ప్రతి ఒక్కరికీ స్థానం కల్పించే విధంగా వేదిక తగినంత పెద్దదిగా ఉండేలా చూసుకోవాలి. లేకుంటే అది మీ అతిథులకు ఇరుకుగా ఉంటుంది. అతిథుల అందరి మీద దృష్టి పెట్టటం కష్టం అయినప్పటికీ ఎవ్వరిని విస్మరించకూడదు. వ్యక్తిగతంగా అతిథులు అందరు హాజరవుతారు. వారికి ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన అనుభూతి ఉండేటట్లుగా చేస్తుంది. ఇది చాలా అత్యధిక ఒత్తిడితో కూడినదని తెలుసు. కానీ ఇది ఖచ్చితంగా ఒక రెగ్యులర్ వ్యవహారం కాదు.

వివాహానికి ముందు కలవటం

వివాహానికి ముందు కలవటం

వివాహం ముందు విందు ఇవ్వటం వల్ల అతిధులతో కలసి ఉండటానికి సహాయం చేస్తుంది. కొంతమంది అతిథులు మొదటిసారి కలవటం జరుగుతుంది. ఇటువంటి ఒక విందు మీ అతిథులు సులభంగా కలిసేటట్లు చేస్తుంది. అంతేకాక వారు మరింత ఆనందిస్తారు.

వాష్ రూమ్ లను శుభ్రంగా ఉంచాలి

వాష్ రూమ్ లను శుభ్రంగా ఉంచాలి

అతిథులలో ముఖ్యంగా పిల్లలు మరియు ముసలి వారు తరచుగా వాష్ రూమ్ లకు వెళ్ళతారు. కాబట్టి వాష్ రూమ్ లు మంచి నిర్వహణ మరియు పరిశుభ్రమైనవిగా ఉండాలి. మీరు శుభ్రతను పర్యవేక్షించుటకు ఒక సహాయ సిబ్బందిని ఏర్పాటు చేయాలి.

సిట్టింగ్ అమరిక

సిట్టింగ్ అమరిక

సాధారణంగా అతిథుల సంఖ్య కంటే ఎక్కువ సీట్లు అందుబాటులో ఉండాలి. మీ అతిథి సీటులో కూర్చోటానికి తోపులాట లేకుండా చూడాలి. మీరు తగిన స్థానాలను ఏర్పాటు చేయడానికి మీ వేదిక మేనేజర్ అడగవచ్చు. అతనికి అదనపు కుర్చీలు ఉండాలని చెప్పాలి.

వెరైటీ ఆహారం

వెరైటీ ఆహారం

మీ అతిథులు శాశ్వతంగా గుర్తుంచుకోవటానికి ఫుడ్ మెన్యూ మరియు అందిస్తున్న అమరిక అత్యంత జాగ్రత్తగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. మంచి ఆహారం ఎల్లప్పుడూ ఉండాలని గుర్తుంచుకొవాలి. అర్దరాత్రి వరకు విస్తరించే వివాహ కార్యక్రమాలలో మీరు మీ అతిథులు ఆకలితో లేరని నిర్ధారించుకోండి. మీ అతిథుల తోపులాట నిరోధించడానికి మీ బడ్జెట్ ప్రకారం స్నాక్స్ కొరకు వివిధ రకాల స్టాల్స్ ఏర్పాట్లు చేయండి. తాజా ఆహారం వడ్డిస్తున్నారని నిర్ధారించుకోండి.

వినోదం

వినోదం

వివాహం అంతటా అతిథులకు వినోదం అందించటానికి కొంతమంది కార్యక్రమాల ప్రణాళికను సిద్ధం చేస్తారు. గాయకుడు లేదా ఒక ఆర్కెస్ట్రా పార్టీని ఆహ్వానించవచ్చు. అంతేకాక డాన్స్ ట్రూప్ ను కూడా ఆహ్వానించవచ్చు. అంతేకాకుండా పిల్లల కోసం ఎంటర్టైన్మెంట్ ప్రణాళికను విస్మరించవద్దు.

పెద్ద శబ్దంతో మ్యూజిక్ ను నివారించాలి

పెద్ద శబ్దంతో మ్యూజిక్ ను నివారించాలి

ఒక క్లోజ్డ్ సమావేశ మందిరంలో వేదిక దగ్గర బిగ్గరగా సంగీతం ప్లే చేయుట వల్ల కొంతమంది అతిథులకు నిజంగా చిరాకు కలిగించవచ్చు. సంగీతం పరిమాణం ఎల్లప్పుడూ ఎవ్వరికి ఏ ఆటంకం లేకుండా వారి సంభాషణ కొనసాగించడానికి అనుమతించే ఒక స్థాయిలో ఉంచవలెను.

మీరు ధన్యవాద బహుమతులు ఇవ్వండి

మీరు ధన్యవాద బహుమతులు ఇవ్వండి

మీరు స్నేహితులు మరియు బంధువులకు అద్భుతమైన బహుమతులు అందచేయండి. అప్పుడు వారికి ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. మీరు చూపించిన ప్రేమ మరియు శ్రద్ధ వలన మీ వివాహాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు.

English summary

8 Ideas to Keep Your Wedding Guests Happy

A perfect wedding is what every couple dreams of. It is a memorable occasion for a couple to share their happiness.
Desktop Bottom Promotion