For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివాహమైన మొదటి సంవత్సరంలో వచ్చే సమస్యలు

|

వివాహమైన మొదటి సంవత్సరాన్ని సాధారణంగా 'ప్రమాదం కాలం' గా వర్ణిస్తారు. ఎందుకంటే, పెళ్ళైన మొదటి సంవత్సరంలో చాలా సమస్యలు ఎదురవుతాయి మరియు వాటిలో చాలావరకు తీవ్రంగా ఉంటాయి. ఈ సమస్యలను మొదటి సంవత్సరంలో అధిగమిస్తేగాని,అప్పుడు మాత్రమే మీరు వివాహం తరువాత దశలోకి అడుగుపెట్టవొచ్చు. దురదృష్టవశాత్తు, కొత్తగా వివాహం చేసుకున్న జంటలు ఒక సంవత్సరం లోపలే విడాకులు తీసుకుంటున్నారు.

చాలా జంటలు విడాకులు ఎందుకు తీసుకుంటున్నారంటే, కొత్తగా పెళ్లయిన జంట కష్టమైన సవాళ్ళను ఎదుర్కోవటానికి సిద్ధపడరు. వివాహం గురించి ఊహాలోకంలో విహరిస్తూ మెత్తనైన ఆలోచనలతో విహరిస్తుంటారు మరియు మొదటి సంవత్సరంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండరు. వివాహమైన ప్రతి జంటకు హానీమూన్ సమయం త్వరగానే ముగుస్తుందని తెలుసు,కాని వారు తరువాత వచ్చే సర్దుబాటు కాలం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండరు.

వివాహమైన మొదటి సంవత్సరం సమస్యలు తీవ్రంగా ఉంటాయి ఎందుకంటే మొదటిసారి మీ సంబంధాలు పరీక్షింపబడతాయి. డేటింగ్ మరియు సంబంధాన్ని నిలుపుకోవటం అనేది వివాహిత జంటకు చాలా భిన్నంగా ఉంటాయి. మీరు వైవాహిక జీవిత వాస్తవాల కొరకు ఏమి సిద్ధంగా ఉండరు. ఈ సమయంలో మీ వైవాహిక సంబంధం కొరకు చాలా గట్టి పునాది వేసుకోవాలి. మరియు ఇంకా, మొదటి సంవత్సరంలో ఎదురయ్యే సమస్యలను కూడా తప్పించుకోలేరు.

మీ మొదటి సంవత్సర వివాహ సమస్యలని మీరు ఎదుర్కోవటానికి ఇక్కడ ఇస్తున్నాము.

ఇంటిపని పంచుకోవటం:

ఇంటిపని పంచుకోవటం:

ఈరోజుల్లో ఆడవారు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు మరియు అందువలన ఇంట్లో పని కూడా పంచుకోవాలి. కొత్తగా పెళ్లయిన జంట వంట చేయటంలో మరియు లాండ్రీ పని ఎవరు తీసుకోవాలి నిర్ణయించుకునే ప్రయత్నంలో నరకం సృష్టించుకుంటారు.

వ్యక్తిగత పరిశుభ్రత:

వ్యక్తిగత పరిశుభ్రత:

ఇది వివాహం అయినతరువాత మాత్రమే ఎదుర్కునే సమస్య. మీ భాగస్వామి వరుసగా 3 రోజులు స్నానం చెయ్యలేదని గుర్తించినప్పుడు లేదా వార్డ్రోబ్లో మురికి లోదుస్తులను ఉంచినప్పుడు.

మీ జీవిత భాగస్వామి యొక్క వ్యక్తిగత అలవాట్లు కొన్ని తీవ్రంగా అనిపించినప్పుడు.

ఆర్థిక విషయాలు:

ఆర్థిక విషయాలు:

మీరు ఖర్చు పెడతారు మరియు ఆతను పొదుపు చేస్తాడు; వివాహినికి ముందు ఒకరి ఖర్చు, అలవాట్ల గురించి ఇంకొకరికి తెలుసుకోవడానికి ఏ మార్గం లేదు. ఎవరి ఖర్చులు, యెంత వాటా అని నిర్ణయించుకోవటం ప్రధాన మొదటి సంవత్సరం వివాహ సమస్యలలో ఒకటి.

వివాహం

వివాహం

వివాహం మొదటి సంవత్సరంలో ఉన్న అబ్సెసివ్,మీ ప్రేమ ఇప్పటికీ తాజాగా ఉన్నది. భాగస్వాముల్లో ఒకరు ఇప్పటికి ప్రేమగా, అదే అనుభూతితో ఉంటారు. వారు తమ భాగస్వామి వివాహం తరువాత నిరాసక్తంగా ఉన్నట్లుగా అనుభూతి చెందటం.

జీవనశైలి తేడాలు:

జీవనశైలి తేడాలు:

వివాహమైన తరువాత ఎదుర్కునే సమస్యలలో వారివారి జీవనశైలులు ఒకటి. దీనివలన వొచ్చే సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఉదాహరణకి మీరు వారానికి మూడుసార్లు బయట తినటానికి ఇష్టపడతారు మరియు మీ భాగస్వామి ఆరోగ్యకరమైన ఇంటి ఆహారాన్నే ఇష్టపడతారు, అప్పటినుండి సర్దుబాటులో ఇబ్బందులు ప్రారంభమవుతాయి.

తల్లిదండ్రుల జోక్యం:

తల్లిదండ్రుల జోక్యం:

వివాహం తరువాత ఇద్దరూ రెండు కుటుంబాలలో ఒక భాగంగా మారతారు. కావున మీరు ఒకరికొకరు మాత్రమే కాదు, ఇద్దరి కుటుంబాలతో కూడా గౌరవంగా వ్యవహరించవలిసి ఉంటుంది. మీరు రెండు కుటుంబాల పెద్దవారి పోట్లాటల వలన కూడా మీ ఇద్దరి మధ్య తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి.

వివాహం

వివాహం

మీరు జంటగా ఉన్నప్పుడు, బయట ఒకరికొకరు కలుసుకునేవారు. కాని వివాహం తరువాత మీరు ఇంటి వద్ద కొన్ని రాత్రులు అనాసక్తంగా గడపవలసి ఉంటుంది. వివాహమైన జంటలో ఎవరికైనా సరే 'బోరింగ్' అన్న పదం ఉండకూడదు.

స్నేహితులతో సమయం గడపటం:

స్నేహితులతో సమయం గడపటం:

వివాహం తరువాత, మీ సమయమంతా మీ భాగస్వామితో గడపవలసి ఉంటుంది. దీనివలన మీరు స్నేహితులతో సమయం గడపటం కోల్పోతారు. నిజానికి, స్నేహితులతో చాలా సమయం గడపటం కూడా పోట్లాటలకు దారి తీయవచ్చు.

హద్దుగీత గీసుకోవటం:

హద్దుగీత గీసుకోవటం:

వివాహమైన మొదటి సంవత్సర సమస్యల వలన వొచ్చే వివాదాలు మీ నియంత్రణలో ఉంచుకోవాలి. క్రొత్తగా వివాహమైన జంటకు పోట్లాటకు ఎక్కడ స్వస్తి చెప్పటానికి కొంత సమయం అవసరం. లేదా చిన్న సమస్యలు తీవ్రమైనవాటికి దారితీస్తాయి.

అహం యుద్ధాలు:

అహం యుద్ధాలు:

అప్పుడే వివాహమైన జంట, ఇద్దరూ వారికి వారి రక్షణలో ఉండాలి. ఇద్దరూ వారి అహాలు వదిలివేయాలి. వివాహమైన తరువాత, అహం అంటే ఏమి ఉండదు అనే విషయం గ్రహించటానికి కొంత సమయం పడుతుంది.

అనుభూతి:

అనుభూతి:

వివాహానికి ముందు మీ ఇద్దరికీ, ఒకరిపట్ల ఒకరికి కావాలనే తపన ఉండేది. వివాహమైన తరువాత ఆ అనుభూతి కొద్దిగా తగ్గుతుంది. ఇద్దరికీ కూడా ఒకరికోసం ఒకరు అనే భావన,తపన గట్టిపడతాయి.

English summary

First Year Marriage Problems To Beware Of

The first year of marriage is often described as the 'danger period'. This is because, first year marriage problems are many in number and they are mostly critical.
Story first published: Monday, September 23, 2013, 11:51 [IST]
Desktop Bottom Promotion