For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆమె మిమ్మలిని నిర్లక్ష్యం చేస్తుందనటానికి 7 సంకేతాలు

By Super
|

మీ వైవాహిక సంబంధాన్ని అతికష్టం మీద అతుకుల ద్వారా వెళుతుంటే లేదా మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మలిని నిర్లక్ష్యం చేసి ప్రక్కన పెడుతున్నప్పుడు మీరు ఆలోచిస్తూ, తల గోక్కుంటూ కూర్చోకుండా, మీరు కొంత ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయం వొచ్చిందని గుర్తించాలి. ఈ మార్పులు రావటానికి గల కారణాలలో ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఏమైన ఉన్నాయేమో చూసుకొని, వాటిని విశ్లేషించుకోండి.

సంభాషణలు పొడిగా మారటం

సంభాషణలు పొడిగా మారటం

మీరు మాట్లాడుతున్నప్పుడు మీ జీవితభాగస్వామి ఎక్కడో ఇష్టం లేనట్లుగా మాట్లాడటం, పోట్లాడటానికి కూడా ఇష్టం చూపకపోవటం లేదా మిమ్మలిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడకపోవటం ఇవి అన్నీ మీ సంబంధ బాంధవ్యానికి బీటలు వారినట్లే. మీరు సంధి ప్రయత్నంలో ఏమి చెప్పినా ఆమె ఒక సన్యాసినిలాగా వింటుంది. ఆమె మీరు ఏ లక్ష్యం లేకుండా సంభాషణ జరిపినా ఆసక్తి కనపర్చాడు మరియు మీరు ఆమెకు ఫోన్ చేయటం మర్చిపోయినా కూడా అయిష్టాన్ని కనపరచదు. సహజంగా ఇద్దరు తమ ఆసక్తిని వ్యక్తపరచటాన్ని వారి కళ్ళు, ముఖకవళికలు చూసి చెప్పవొచ్చు. ఆమె మీపట్ల ఏ సమయంలోనైన అనాసక్తి, అయిష్టత వ్యక్తపరుస్తున్నప్పుడు, ఆమెకు మీపట్ల అయిష్టత, అనాసక్తి ఉన్నట్లే.

ఆమె మిమ్మలిని విమర్శించడానికి ఏ కారణం అవసరం లేదు

ఆమె మిమ్మలిని విమర్శించడానికి ఏ కారణం అవసరం లేదు

మగవారి అలవాట్లు,ఉద్దేశాలు ఎప్పుడూ తేడాగా ఉంటాయి మరియు ఆమె తరచుగా మీ ముఖం మీద వాటిని విమర్శించేవారు, కాని ఇప్పుడు మీరు ఏమి మాట్లాడినా ఆమె నుండి ప్రతిస్పందన లభించదు. చిన్నచిన్న వాదప్రతివాదాలు, వీటి తరువాత క్షమాపణలు వంటివి మీ సంబంధాన్ని పటిష్టపడటానికి ఉపయోగపడతాయి, కాని విపరీతమైన విమర్శలు చేసుకునే స్వభావం మీ సంబంధాన్ని దెబ్బతీస్తాయి.

ఆమె మీ వ్యక్తులను కలుసుకోవటానికి ఇష్టపడకపోవటం

ఆమె మీ వ్యక్తులను కలుసుకోవటానికి ఇష్టపడకపోవటం

మీరు ఆమెలాగా స్నేహితులను సంపాదించుకోవటానికి చాలా ప్రయత్నాలు చేసి ఉంటారు,కాని ఆమె వారిని కనీసం పలకరించటానికి కూడా ఇష్టపడదు. అకస్మాత్తుగా, ఆమె మీ మొత్తం బృంద సభ్యులతో కలిసి సమస్యలు ఉన్నాయి మరియు మీరు ఒక తప్పు మార్గంలో పెరిగారు అని వ్యాఖ్యలు చేస్తుంది. ఆమె మీ పట్ల ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే, ఆమెకు మీ పట్ల గౌరవం పోయింది అనటానికి గుర్తు; ఇది రాబోయే విడాకులకు సంకేతమన్నమాట.

స్పార్క్స్ ఇప్పుడు లేవు

స్పార్క్స్ ఇప్పుడు లేవు

ఇది కేవలం భౌతికమైన ఆకర్షణే కాదు మీ సంబంధం తెగిపోయే స్థాయిలో వెళుతున్నదన్న మాట. మీ జోకులు, మీరు కొన్ని నిర్దిష్ట పదాలను ఉచ్ఛరించడం మరియు మీరు ఆమెను మెచ్చుకునే విధానం ఆమెను ఎప్పుడు కరిగించేవి. ఇప్పుడు, ఈ స్పార్క్స్ ఆమె మీద ఏ ప్రభావం చూపకపోగా, మీ విమర్శలవల్ల అగాథాలు ఏర్పడతాయి.

ఆమెతో శారీరకంగా ఉండటం ఇప్పడు టీ త్రాగినట్లు కాదు

ఆమెతో శారీరకంగా ఉండటం ఇప్పడు టీ త్రాగినట్లు కాదు

కేవలం బెడ్ రూమ్ లో జంతువులుగా కలిసిఉండటం కాదు, కాని సాధారణంగా శృంగారంలో మీ అభిమానం వ్యక్తం పరచే సాధారణ మార్గాలు, గట్టి కౌగిలింతల, ముద్దులు మరియు లాలింపులు ఇప్పుడు ఉండవు. మీరు వీటితో ప్రయత్నించినా, ఆమె ఒక సన్యాసినిలాగా విముఖత తెలుపుతుంది. ఆమెతో భౌతిక సంగమం యాంత్రికమే, కాని ఎటువంటి అనుభూతి ఉండదు అని తెలపటానికి ఇది ఒక సంకేతం.

భవిష్యత్తు గురించి చర్చ ఉండదు

భవిష్యత్తు గురించి చర్చ ఉండదు

ఇంతకుముందు రాబోయే రోజుల గురించి, ఆఖరికి రేపటి రోజు గురించి మరియు వారాంతపు ప్రణాళిక గురించి మాట్లాడేది లేదా పుట్టబోయే శిశువు గురించి మాట్లాడుతూనే ఉండేది. ఇప్పుడు, భవిష్యత్తు గురించి ఏ సంభాషణ కూడా జరపదు, ఆమె సంభాషణలో మీ సంబంధం కొనసాగుతుందన్న విశ్వాసం కనపడదు.

సాధారణంగా అందంగా తయారయ్యే ఆమె అవన్ని నిలిపివేస్తుంది

సాధారణంగా అందంగా తయారయ్యే ఆమె అవన్ని నిలిపివేస్తుంది

ఇప్పటివరకు, ఆమె సినిమాకు వెళ్ళాలన్నా ఎక్కువ సమయం కేటాయించి డ్రెస్సింగ్ మరియు మేక్-అప్ అయి, మీతో గడపాలని ఎక్కువ ఆసక్తిగా ఉండేది. ఇప్పుడు, ఆమె మీతో గడపటానికి అనాసక్తిగా ఉండటం, కోమా నుండి లేచినట్లుగా బద్ధకంగా, అనాసక్తంగా ఉండటం; ఇవి అన్నీ విడిపోవటానికి సంకేతాలు. ఒకప్పుడు పటిష్టంగా ఉన్న బంధం, ఇప్పుడు బలహీనమయింది అనటానికి సంకేతాలు.

English summary

7 Signs She's Going to Dump You

If you been left scratching your head, unsure whether your relationship is just going through a difficult patch or if your girlfriend is about to dump you, it is time to do some introspection. Try to analyze if the following signs have surfaced lately.
Desktop Bottom Promotion