Just In
- 2 hrs ago 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- 2 hrs ago ఈ 3 రాశుల వారు ఏప్రిల్ 23 నుండి అప్రమత్తంగా ఉండాలి, అంగారకుడి వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటారు
- 7 hrs ago అయోధ్య బాలరాముడిపై సూర్య తిలకం.. కిరణాలు నుదుటిపై పడేందుకు ఏమి చేసారంటే..!
- 7 hrs ago కొత్తగా పెళ్ళైన జంటలు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీ లైఫ్ సేవ్ చేస్తుంది
కోపిష్టి గర్ల్ ఫ్రెండ్ ను సమాధానపర్చడం ఎలా ?
సంబంధాల్లో వివిధ రకాలు ఉన్నా, స్నేహితులు, భార్య భర్త, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ప్రేమికులు, డేటింగ్ చేసేవారు, తల్లిదండ్రి, అక్క చెల్లి, అన్నతమ్ముడు, ఇలా ఒకటేమిటీ చెప్పుకుంటూ పోతే రిలేషన్ ఫిప్ లో చాలానే బందాలు, అనుబందాలు ముడిపడి ఉంటాయి. వీటిలో ఏసంబంధంమైన ఎక్కువ కాలం నిలబడాలన్నా, సజావుగా కొనసాగాలన్నా, ఇద్దరి వ్యక్తుల మధ్య అవగాహణ, ఓపిక, ఇష్టఇష్టాలు ఖచ్చితంగా తెలుసుండాలి. అప్పుడు ఆసంబంధాలు దీర్ఘకాలం కొనసాగించబడుతాయి. ముఖ్యంగా ఇద్దరు మంచి స్నేహితులు ప్రేమికులుగా మారినప్పుడు ఉన్న రిలేషన్ షిప్ ఎలా ఉంటుంది? స్నేహంగా ఉన్నప్పుడు ఏదైనా పొరపాటు జరిగా సర్దుకొనే స్వభావం, క్షమాపన చెప్పే అలవాటు ఇద్దరిలోనూ ఉంటుంది. అదే ప్రేమికులైనప్పుడు అవి దూరం అవుతాయి.
బాయ్ ఫ్రెండ్ ఏదైనా తప్పు చేస్తే, అయ్యే తప్పు జరిగిపోయింది, ప్రేయసికి తెలిస్తే కోప్పడుతుంది, తిడుతుంది, ఏడుస్తుంది. అని భాదపడేవారు చాలా కొద్దిమందే ఉంటారు. అదే ఆమెను పూర్తిగా అర్ధం చేసుకొన్న వారైతే, తెలియకుండా తప్పు జరిగినా, తను ఎక్కడ బాధపుతుందో, కంట్లో నీళ్ళు వస్తాయో అని హైరానా పడే వారు లేకపోలేదు. ఆమె అతని కలల రాణి, ఆమె అతని దేవత అనిభావించే వారు కూడా ఉన్నారు. అయితే, అన్ని సార్లు ఆమెను ఎల్లప్పుడు సంతృప్తి పరచలేరు కదా?
ఒక మంచి సంబందం ఒక మంచి ఓపికను కోరుకుంటుంది. కాబట్టి, కొన్ని సందర్భాల్లో, లేదా మీరు తప్ప చేసిన సందర్బాల్లో మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఆ పరిస్థితిలో తప్పు ఎలా జరిగింది, పరిస్థితి బట్టి మలచుకోవడానికి ప్రయత్నించండి. మీరు తప్పు చేసినప్పుడు మీ ప్రేయసి మీ మీద ఎక్కువగా కోపంగా ఉన్నప్పుడు మీ ప్రేయసిని చల్లబర్చండి కోపం నుండి తేరుకుని మళ్ళీ చిరునవ్వు నవ్వేలా చేయండి. ఇలా మీకోపిస్టి గర్ల్ ఫ్రెండ్ ను నవ్వించాలని, సంతోషంగా ఉంచాలని మీరు ఫిక్స్ అయిపోవాలనుకుంటే ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి...
తప్పు చేసినప్పుడు ఆమె ముందు కొద్దిగా బెండ్ అవ్వండి(తప్పు ఒప్పుకోండి): ఆమెనే మీరు కోరుకుంటున్నట్లై, మీ సంబంధాన్ని కాపాడుకోవడం కోసం, ఆమె ముందు కొద్దిగా బెండ్ అయినా పర్వాలేదు. మీకు చాలా బాధకలిగించే పని మీరు చేసినప్పుడు మనస్పూర్తిగా ఆమెను క్షమించమని అడగండి. యాంగ్రీ గర్ల్ ఫ్రెండ్ ను హ్యాండిల్ చేయడానికి ఇది ఒక ఉత్తమ మార్గం. ఇలా ట్రై చేసి ఆమె ముఖంలో ఒక చిన్న చిరునవ్వు నవ్వేలా చేయండి.
నోరు మూసుకోండి(మాట్లాడకండి): నిశ్శబ్దం బంగారం వంటిది, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరు నిశ్శబ్దంను పాటించడం కూడా మీ సంబంధాన్ని సేవ్ చేయడానికి సహాయపడుతుంది. అది మీ గర్ల్ ఫ్రెండ్ కోపం నుండి తేరుకోవడానికి లేదా కోపం తగ్గించుకోవడానికి కొంత సమయం మీరు సమకూర్చినట్లువుతుంది. ఆమె చల్లబడిన తర్వాత, మీ సమస్యను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి ఆమెను నిశ్శబ్డంగా ఉండేలా చేయండి.
మళ్లి ఒక సారి ఆమెను కలవండి: మీ నిశ్శబ్దం పూర్తి అయిన తర్వాత, ఆమె కోపం తగ్గించుకొన్న తర్వాత ఆమెను మరోసారి కలవండి. లేదా మాట్లాడండి. ఆమెతో మాట్లాడు మీరు చేసిన తప్పుకు కారణం వివరించండి లేదా ఎందుకు అలా జరిగిందో తెలియజేయండి. మీరు ఎక్కువ విషయాలు చెప్పడానికి ప్రయత్నించొద్దు. అయితే, మరి బోర్ కొట్టే విధంగా చేయకండి. మీరు చెప్పే విధంగా కూడా మంచి పద్దతిగా ఉండాలి. దాంతో మీరు చెప్పేవన్నీ ఆమె వింటుంది. అలా అయితేనే మీ యాంగ్రీ గర్ల్ ఫ్రెండ్ యొక్క కోపం తగ్గించవచ్చు.
నో డార్లింగ్: అవసరం అయినప్పుడు తనను స్టాప్ చేయండి మరియు ఆమె మీ పట్ల వార్నింగ్ ఇచ్చేంత వరకూతీసుకురాకండి. మహిళలు చిన్ని చిన్న సమస్యలు పెద్దగా చేస్తారన్న విషయం మర్చిపోకండి. లేదా రోజంతా అవే మాట్లాడుతుంటారు. మీరు ఆమెను ఆపుచేయకపోతే, మీ రోజు మొత్తం విచారకరంగా మారిపోతుంది. అందుకే ముందుజాగ్రతతీసుకోండి.
ఆమెను మీ చేతుల్లోకి తీసుకోండి: మీ స్పర్శ ఆమెలో ఒక మ్యాజిక్ కలిగించవచ్చు. కాబట్టి, ఇది ప్రయత్నించండి!!ఒక్క సారి ఆమె ప్రశాంతంగా మారినప్పుడు, మీ ప్రేమను ఆమెకు తెలియజేయడానికి ప్రయత్నించండి భైతికంగా ప్రేమను చూపండి. ఆమె తిరిగి మీ ప్రేమలో పడొచ్చు. మీ ప్రేమనంతా ఆమె పాదా వద్ద చేర్చండి. మీ యాంగ్రీగర్ల్ ఫ్రెండ్ కు ఇలా చేయడం ఆసక్తికరమైన సూనా కాదా? తర్వాత ఆమె ముఖంలో చిరునవ్వు చూడండి.
రీవిస్ట్ చేయడానికి కొంత సమయం పడుతుంది: ఎప్పుడైతే మీ యాంగ్రీ గర్ల్ ఫ్రెండ్ కోసం ఈ చిట్కాలు మీకు అంధించామో, మేము కూడా మీ కంప్లైంట్స్ మరియు గ్రీవెన్స్స్ మర్చిపోలేదు. అలాగే మీకు కొంత సమయం ఉంది. ఈ చిట్కాలు పాటించడం వల్ల మీకు మంచి రోజులు తిరిగా రావచ్చు. మీరు ఇద్దరూ కలిసి హాపిగా కాఫీ త్రావచ్చు. ఏమంటారు?