For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివాహా భాగస్వామి గురించి తెలుసుకోవటానికి చిట్కాలు

By Lakshmi Perumalla
|

భారతదేశంలో నేటి వరకు పెద్దలు కుదిర్చిన వివాహాల్లో పాత సంప్రదాయంను అనుసరిస్తున్నారు. పెద్దలు కుదిర్చిన వివాహాల్లో ఇద్దరు భాగస్వాములలో వారి ఆలోచనలు మరియు ఇష్టాలు వ్యతిరేకంగా ఉండవచ్చు. తల్లిదండ్రులు తగిన భాగస్వాముల కోసం అన్వేషణ మరియు కలవడం లేదా ఇద్దరి జీవితాలకు సంబందించిన నిర్ణయంను వారే తీసుకుంటారు. వివాహానికి ముందు భాగస్వాముల ఇద్దరి గురించి పరస్పరం చాలా తక్కువగా తెలుస్తుంది.

అరేంజ్డ్ మ్యారేజ్ ఒక లాటరీ ఏర్పాటు వంటిది అని చెప్పవచ్చు. మీరు అదృష్టవంతులు అయితే మీరు ఊహించిన భాగస్వామి రావచ్చు. ఒకవేళ అదృష్టం లేకపోతె జీవితంలో సర్దుబాట్లు మరియు ఒప్పందాలతో జీవించాలి. ఒక విధంగా,అపరిచితులుగా ఉండటం వలన వివాహం తర్వాత స్పైసిగా ఉంటుంది. వారిలో ప్రేమ తెలియకుండానే నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది.

పెద్దలు కుదిర్చిన వివాహాల్లో మీ భాగస్వామి యొక్క అలవాట్లను అర్థం చేసుకోవటం మరియు వాటిని తెలుసుకోవడం పెద్ద సవాలుగా ఉంటుంది. ఇది కష్టం కాదు. అలాగే సులభం మాత్రం కాదు. అరేంజ్డ్ మ్యారేజ్ లలో మీ భాగస్వామి గురించి త్వరగా తెలుసుకోవటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

Tips to Know Your arranged marriage partner

1. స్నేహితులు


అరేంజ్డ్ మ్యారేజ్ వివాహ భాగస్వామి యొక్క సీక్రెట్స్ స్నేహితులు ద్వారా తెలుసుకోవటం అనేది ఉత్తమమైన మార్గం. స్నేహితుల ద్వారా మీ భాగస్వామి యొక్క నిజమైన వ్యక్తిత్వం తెలుస్తుంది. వారి ఇష్టాలు మరియు ఇష్టం లేనివి,కళాశాల సీక్రెట్స్ మరియు మీ భాగస్వామి యొక్క అద్భుతమైన సంఘటనలు చాలా తెలుస్తాయి. మీరు వారి స్నేహితులు ద్వారా తరచుగా వెళ్ళే ఇష్టమైన ప్రదేశాలు,మీ భాగస్వామి యొక్క గత సంబంధాలు మరియు ప్రేమ జాబితాను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒక వివాహ సలహా ఏమిటంటే మీ భాగస్వామి యొక్క స్నేహితులతో చర్చించటం మీకు సహాయపడుతుంది. అరేంజ్డ్ మ్యారేజ్ వివాహ భాగస్వామి గురించి తెలుసుకోవటం వలన మీరు ఖచ్చితంగా ఆనందించవచ్చు. మీ భాగస్వామికి స్నేహితులు లేకుంటే, అప్పుడు మీకు విచిత్రమైన వ్యక్తిగా అన్పించవచ్చు.

2. తోబుట్టువులు

ఒక కుటుంబంలో పెద్దలు మరియు తోబుట్టువుల ద్వారా అరేంజ్డ్ మ్యారేజ్ వివాహ భాగస్వామి గురించి తెలుసుకోవచ్చు. మీ భాగస్వామి యొక్క చిన్ననాటి జ్ఞాపకాలను మరియు అలవాట్లను సోదరీమణులు మరియు సోదరుల ద్వారా తెలుసుకోవచ్చు. వారి గురించి చాలా సమాచారం మీకు తెలుస్తుంది. వారి కుటుంబ చరిత్ర తెలిస్తే మీకు చాలా ఆసక్తికరముగా ఉంటుంది.

3. పేస్ బుక్

చాలా ప్రసిద్ధి చెందిన పేస్ బుక్ లో అనేక మందికి సంబందించిన సమాచారం ఉంటుంది. ఇప్పటికీ అతను మీ పేస్ బుక్ జాబితాలో లేకపోతే మీ భాగస్వామిని శోధించటానికి ప్రయత్నించవచ్చు. పేస్ బుక్ ఖాతా చిత్రాలను మీకు అందిస్తుంది. అంతేకాక స్నేహితులు మరియు మీ భాగస్వామి యొక్క మొత్తం వ్యక్తిత్వం యొక్క ఆలోచనలను ఇస్తుంది. మీరు సంగీతం ఇష్టం ఉందొ లేదో కనుగొనడానికి వీలు ఉంటుంది. అలాగే సినిమాలు చూడటం మరియు విద్యా నేపథ్యం గురించి కూడా తెలుసుకోవచ్చు. హోదా అప్డేట్ కూడా మీరు మీ భాగస్వామి గురించి బాగా తెలుసుకోవటానికి సహాయపడుతుంది.

4. రూమ్ శోధన

అరేంజ్డ్ మ్యారేజ్ వివాహ భాగస్వామి యొక్క బెడ్ రూమ్ మీకు అతని వ్యక్తిత్వంనకు సంబంధించిన స్పష్టమైన సమాచారాన్ని ఇస్తుంది.బెడ్ రూమ్ లో ప్రతిచోటా వస్తువులు బాగా విస్తరించి గందరగోళంగా ఉంటే మీ భాగస్వామి సోమరి అని చెప్పవచ్చు. మీ భాగస్వామి చాలా క్రమశిక్షణ మరియు బెడ్ రూమ్ కొద్దిగా ఎక్కువ తాజాగా మరియు వ్యవస్థీకృతంగా ఉంటే కూడా కొద్దిగా బోరింగ్ కావచ్చు. పడకగదిలో మ్యాగజైన్స్ మరియు పుస్తకాలు కోసం అన్వేషణ చేయండి. మీ భాగస్వామి చదివే పత్రికలు లేదా పుస్తకాలు రకంను బట్టి వారి వ్యక్తిత్వంను చెప్పవచ్చు.

5. అత్తగారిని సంప్రదించండి

అరేంజ్డ్ మ్యారేజ్ వివాహ భాగస్వామి యొక్క మంచి పనులను తెలుసుకోవాలనుకుంటే మీరు మీ అత్తగారిని సంప్రదించండి. మీరు వారికి ఇష్టమైన ఆహారాలు మరియు రోజువారీ అవసరాలను తెలుసుకోవాలి. చాలా ఉపయోగకరమైన వివాహ సలహా ఏమిటంటే అరేంజ్డ్ మ్యారేజ్ వివాహ భాగస్వామి గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే మీ అత్తగారితో స్నేహపూర్వక సంబంధాలు ఉంచుకోవాలి.

English summary

Tips to Know Your arranged marriage partner

Arranged marriages are an old tradition being followed in India till date. Arranged marriages are two partners coming together with no idea of what the opposite person is like.
Story first published: Thursday, December 19, 2013, 18:00 [IST]
Desktop Bottom Promotion