For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిరోద్యోగి అయిన మీ భర్తకు ఎలా సపోర్ట్ చేయాలి?

|

ప్రైవేటురంగ ఉద్యోగాలు పెరిగిపోతున్న నేటికాలంలో ప్రతి స్త్రీ ఎపుడో ఒకప్పుడు ఎదుర్కొనే సమస్యే ఇది. ఏదో ఒక సమయంలో భర్త నిరుద్యోగ సమస్యని భరించడం. ఇది నిజంగా సమస్యేనా అంటే ఇలాంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి మహిళలు తీసుకునే ముందు జాగ్రత్త చర్యలు మొదలయిన వాటి మీద ఆ సమస్య తీవ్రత ఆధారపడి ఉంటుంది. కారణాలేవయినా మీ భర్త ప్రస్తుత ఉద్యోగానికి రాజీనామా చేసి ఖాళీగా ఉన్నట్లయితే డబ్బులకు ఇబ్బందులు మామూలే. మీరు ఉద్యోగస్థులయితే కొంత నయమే అయినా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితుల్లో అప్పులు ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు.

What to do When Your Spouse is Unemployed

1. మొదట వృధా ఖర్చును ఆపండి.
2. సినిమాలు, షికార్లులాంటి సరదాలకు కొద్ది రోజులు సెలవివ్వండి.
3. కేబుల్‌ కనెక్షన్‌, పాల బిల్లు ఇంట్లోకి అవసరమయిన వస్తువుల్లో కూడా పొదుపుచేయడానికి, అనవసరమయిన ఖర్చును నిరోధించడానికి ప్రయత్నించండి.
4. ఒకవేళ అప్పటికీ పరిస్థితి తీవ్రంగా ఉంటే, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి దాచిన సొమ్మునుండి డబ్బులు వాడుకోండి.
5. కొంతమందికి వస్తువులు పాడయితే బాగు చేయించడానికి బదులు, కొత్తవాటిని కొనే అలవాటు ఉంటుంది. అలా కాకుండా బాగు చేయిస్తే ఖర్చు కలిసొస్తుంది.
6. అత్యవసర పరిస్థితి వస్తే తక్కువ వడ్డీకి అప్పు తీసుకోవడానికి వెనకాడకండి.
7. అన్నింటికన్నా ముఖ్యమయినది ఇంట్లో పరిస్థితి మీ వారి దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుపోవడం. అలాగని వారిని ఇబ్బంది పెట్టకుండా సానుకూలంగా ప్రవర్తించండి.
8. మరో ఉద్యోగం వెతుక్కునే వరకు వారికి కావలసిన నైతికస్థైర్యాన్ని మీమాటలు,చేతల ద్వారా అందించండి.
9. ఎలాంటి ఇబ్బందులు లేకుంటే ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోవడానికి ఎవరూ ఇష్టపడరు. కాబట్టి ఉద్యోగం మానేయడం వల్లనే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పదే పదే అనకండి.

English summary

What to do When Your Spouse is Unemployed

What happens if you get married and your spouse loses his or her job shortly afterward? Unemployment can happen to anyone at any time. If it happens to your spouse, especially early in the marriage, it can be devastating.
Story first published: Saturday, March 29, 2014, 13:49 [IST]
Desktop Bottom Promotion