For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జంటలు ఎక్కవుగా పోట్లాడుకోవడానికి 7 సాధారణ కారణాలు

|

సాధారణంగా పెళ్ళైన కొత్తలో ఎటువంటి ఇబ్బందులుండవు. అయితే పోను పోనూ ఇందరి మద్య కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతో ఒకరినిఒకరి అర్ధం చేసుకోవడం తక్కువ అవ్వడంతో ఇద్దరి మద్య పోట్లాటలు మొదలవుతాయి. ఎప్పుడైతే ఇద్దరి మద్య కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందో, అప్పుడు పోట్లాడుకోవడం అనేది చాలా సహజం. అటువంటి పోట్లాటలు చాలా మంది జంటల మద్య కామన్ గా, ఒకే విధంగా ఉంటాయి. అలా కొన్ని జంటల మద్య ఏర్పడే కామన్ ఫైట్స్ ను మీకోసం ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలిజేస్తున్నాం.

ప్రస్తుత రోజుల్లో జంటలు ఎదుర్కొంటున్నటువంటి కామన్ ఫైటింగ్స్ కొత్తేమీ కాదు. వివిధ రకాల టాపిక్స్ మీద పొట్లాటలనేవి ఒక్కో జంట మద్య ఒక్కో విధంగా ఉంటుంది . ఉదాహరణకు: అత్తకోడళ్ళ మద్య, భార్య భర్తల మద్య, ఇద్దరు స్నేహితుల మద్య....కొంత మంది జంటల మద్య సాధారణంగా వచ్చే కామన్ ఫైట్స్, ఎటువంటి విషయాల్లో, ఎలా ఉంటాయంటే...?

డబ్బు విషయంలో :

డబ్బు విషయంలో :

జంటల మద్య చాలా ముఖ్యంగా, సాధారణంగా వచ్చే ఒక కామన్ ఫైట్ ఇది. సహజంగా పార్ట్నర్ అనవసరంగా డబ్బు ఖర్చుపెడుతుంటే, గొడవలు పడటం సహజం.

తోబుట్టువుల వల్ల:

తోబుట్టువుల వల్ల:

మీ భాగస్వామి యొక్క తోబుట్టువల విషయంలో, వ్యతిరేఖంగా ఏదైన మాట్లాడినప్పుడు. ఖచ్చితంగా ఇటువంటి సందర్భం మీజీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎదుర్కోక తప్పదని గుర్తించుకోండి. జంటల మధ్య ఇది చాలా సాధారణమైనటువంటి ఫైట్.

షాపింగ్ అధికమైనప్పుడు:

షాపింగ్ అధికమైనప్పుడు:

అవసరం అయినవి కాకుండా, అనవసరమైనవాటిని ఎక్కువగా డబ్బు ఖర్చుపెడుతూ, బిల్ల్ పే చేసే కౌంటర్ల వద్ద ఎక్కువ సమయం గడం వల్ల ఇద్దరి మద్య గొడవ మొదలవుతుంది. ముఖ్యంగా ఆడవారి షాపింగ్ విషయంలో మగవారికి ఏమాత్రం ఇష్టం ఉండదు.

మాజీ ప్రియుల గురించి టాపిక్ వచ్చినప్పుడు:

మాజీ ప్రియుల గురించి టాపిక్ వచ్చినప్పుడు:

మాజీల గురించి మాట్లాడినప్పుడు, తప్పనిసరిగా ఇద్దరి మద్య గొడవ వస్తుంది. ఇది ఒక మోస్ట్ కామన్ ప్రాబ్లెమ్. ముఖ్యంగా ఈగో ఎక్కువగా ఉన్న జంటల మద్య ఈ గొడవలు మరింత సీరియస్ గా కూడా మారుతాయి.

చెడు అలవాట్లు మానుకోనప్పుడు:

చెడు అలవాట్లు మానుకోనప్పుడు:

స్మోకింగ్ మరియు ఎక్కువగా త్రాగుడుకు అలవాటు పడటం వంటివి ఎక్కువైతే ఇద్దరిలోనూ, ఏఒక్కరికీ నచ్చవు. ఇటువంటి చెడు అలవాట్లు మానుకోనప్పుడు, ఇద్దరి మద్య వాదప్రతివాదనలతో పోట్లాటలకు దారితీస్తుంది.

కొన్ని సన్నిహితమైన సున్నితమైవిషయాల్లో:

కొన్ని సన్నిహితమైన సున్నితమైవిషయాల్లో:

కొన్ని విషయాల్లో వారి పాట్నర్స్ ఎలా ఉండాలో వారికి తెలపనప్పుడు, కొన్నివ్యక్తి గత విషయాలు చర్చుకోనప్పుడు, మనస్పర్థాలతో పాటు, పోట్లాటలకు కూడా సహజం. రిలేషన్ షిప్ లో ఇది ఒక సాధారణ సమస్య.

టైమ్ మేనేజ్మెంట్:

టైమ్ మేనేజ్మెంట్:

టైమ్ కు పనులు పూర్తిచేయకపోవడం, అనుకొన్న సమయానికి కలుసుకోలేకపోవడం ఇలా సాధారణ విషయాల్లోనే ఎక్కువగా జంటల మద్య పోట్లాట మొదలవుతుంది.

English summary

7 Common Fights Between Couples

Couples who do not communicate much in their relationship often end up having a lot of fights due to it. When there is a communication gap, fights become common. There are some fights which are common to most couples. In this article, Boldsky shares a list of the common fights that happen among couples.
Story first published: Thursday, April 17, 2014, 17:02 [IST]
Desktop Bottom Promotion