For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దంపతులు పిల్లలు వద్దని ఎందుకు అనుకుంటారు ?

|

ఈ భూమ్మీద నడిచే చిన్ని జీవుల్లో అందమైన వారు పిల్లలు, కానీ దురదృష్టవశాత్తూ పిల్లలు వద్దు అనుకునే దంపతులు కూడా ఉన్నారు. ఓ జంట పెళ్లి చేసుకున్నప్పుడు ఒక ఏడాది గడిచీ గడవకుండానే అత్తింటి వారు అడిగేది ముందుగా పిల్లల గురించే. దంపతులు పిల్లలను వద్దనుకుంటే, మీకు షాక్ కలిగించే కొన్ని ఖచ్చితమైన కారణాలు వున్నాయి.

తమ ఉద్యోగోన్నతికి అడ్డు వస్తారేమోనన్న భయంతో కొంతమంది పిల్లలను వద్దనుకుంటారు. పిల్లలు పుట్టాక వారిని చూసుకోవడానికి ఎవరూ ఉండరనే ఆందోళన కూడా దంపతులు పిల్లలు వద్దనుకోవడానికి మరో కారణం. కానీ, ఈ రోజుల్లో ఉద్యోగం ఇతర సమస్యల కన్నా పిల్లల్ని కనలేక పోవడమే అసలు సమస్యగా మారింది.

జీవితంలో ఒత్తిడి వల్ల స్త్రీ పురుషులు చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దంపతులు పిల్లలు వద్దనుకోవడానికి ఉండే చాలా ప్రధానమైన కారణాలలో ఇది ఒకటి. సమాజం అంగీకరిస్తుందో లేదోనన్న భయం వల్ల దత్తత తీసుకోవడం కూడా సమస్యగా మారింది.

దంపతులు పిల్లలను వద్దనుకోవడానికి గల కారణాలు చూస్తె, వారు అసలు కుటుంబ వ్యవస్థను ఎందుకు ఎంచుకోవడం లేదో మీకు అర్ధం అవుతుంది. ఇద్దరికీ మించి తమ బంధాలను విస్తరించుకోక పోవడానికి వారు చెప్పే ఈ ప్రధానమైన కారణాలు పరిశీలించండి.

వృత్తికి ప్రాధాన్యత

వృత్తికి ప్రాధాన్యత

దంపతులు పిల్లలు వద్దు అనుకోవడానికి ప్రధాన కారణం వృత్తికి ప్రాధాన్యతను ఇవ్వడమే. కొంతమంది పిల్లలతో గడపడానికి, వారితో పాటు పిల్లల్ని అటుఇటు తిప్పడానికి ఇష్టపడరు.

పిల్లల కోసం సమయం లేకపోవడం

పిల్లల కోసం సమయం లేకపోవడం

మీరు మీ భాగస్వామితోనే గడపడానికి సమయం లేనపుడు, పిల్లలకి సమయం ఎలా కేటాయిస్తారు. పిల్లల్ని కనాలి అనే ఆలోచన వచ్చినపుడు దంపతులకు ఈ ఆలోచన ముందు కనిపిస్తుంది. అందుకని, పిల్లలు కావాలి అనుకోవడం మంచి ఆలోచన కాదు.

చాలా పెద్ద బాధ్యత

చాలా పెద్ద బాధ్యత

నేటి ఆధునిక దంపతులు పిల్లలు ఉండడం అనేది చాలా పెద్ద బాధ్యతగా భావిస్తున్నారు. వారి ఆలోచనా విధానం ఈ విధంగా ఉన్నపుడు ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశం లేదు. చాలామంది దంపతులు పిల్లలు వద్దనుకోవడానికి ఉన్న అనేక కారణాలలో ఇదికూడా ఒకటి.

నిండైన కుటుంబానికి ఇద్దరు చాలు

నిండైన కుటుంబానికి ఇద్దరు చాలు

దంపతులు కేవలం ఇద్దరు ఉండే చాలు పిల్లల్ని బైటి వ్యక్తులుగా భావిస్తారు. మీకు మీరే ఉన్నపుడు పిల్లలు ఉండడం అనేది సంపూర్ణ కుటుంబంగా అనిపించవచ్చు. అనేక కారణాలలో ఇదికూడా ఒకటి కావడం వల్ల దంపతులు పిల్లల్ని వద్దనుకుంటున్నారు.

ఒత్తిడి తీసుకోవట్లేదు

ఒత్తిడి తీసుకోవట్లేదు

ప్రారంభంలో పిల్లలు కలగడం అనేది చాలా ఒత్తిడితో కూడుకున్నది. ఈ విధమైన ఒత్తిడిని భరించడానికి దపతులు తయారుగా లేరు. ఎక్కువమంది దంపతులు ఆ సమయంలో పని ఒత్తిడిని భరించలేక కావచ్చు.

తల్లిదండ్రులు కావడానికి సిద్ధంగా లేరు

తల్లిదండ్రులు కావడానికి సిద్ధంగా లేరు

పిల్లలు కావలి అనేది మనసులోనుండి రావాలి. మీరు తల్లిదండ్రులు కావాలి అని అనుకున్నపుడు ఈ సవాలుని ఎదుర్కొనడానికి మీరు సిద్ధ పడతారు. చాలామంది దంపతులు ఇలా అనుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు, తల్లిదండ్రులు కావడానికి మనస్పూర్తిగా సిద్ధంగా లేరని వారిలోవారే భావించుకుంటారు.

ప్రయత్నాన్ని వదలకండి

ప్రయత్నాన్ని వదలకండి

స్త్రీలు గర్భధారణ సమయంలో పని ఒత్తిడి, కుటుంబ పరిస్థితులతో అనేక సమస్యలను ఎదుర్కుంటారు. గర్భధారణ సమయంలో ఆరోగ్య సమయాలు కూడా ప్రధాన పాత్రను పోషిస్తాయి. అనేక సార్లు గర్భం పోవడం, అబార్షన్లు వంటివి స్త్రీలకూ ఆశ మందగించి పిల్లల్ని వద్దనుకుంటారు.

ఎక్కువ కాలం వారిద్దరే ఉండాలని అనుకోవడం

ఎక్కువ కాలం వారిద్దరే ఉండాలని అనుకోవడం

కొంత సమయం తరువాత దంపతులు కేవలం వారిద్దరే ఒకరికోసం ఒకరు ఉండాలనుకుంటారు. ఎక్కువకాలం కలిసి ఉండడానికి ఇంట్లో సంతోషం నింపడానికి పిల్లలు అవసరం లేదు. నిజమే, దంపతులు పిల్లలు వద్దనుకోవడానికి ఇది సరైన కారణమే.

Desktop Bottom Promotion