For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల కలిగే 7 నష్టాలు

|

చాలా మందికి తమ ఇష్టానుసారం వేర్వేరు వయసులప్పుడు పెళ్ళిళ్ళు అవుతుంటాయి. అందువల్ల సాధారణ అంచనాల ప్రకారం 25 నుంచి 30 ఏళ్ళ మధ్య పెళ్ళికి సరైన వయసని చాలా మంది అనుకున్నప్పటికీ – పెళ్ళికి సరైన వయసనేది ఏమీ లేదు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే సమస్యల గురించి ఈ వ్యాసంలో చూద్దాం. చాలా మంది జంటలు పెళ్లి ఆలస్యంగా చేసుకోవాలనుకుని అందరూ బాగా ఆలస్యం అనుకునే దాకా చేసుకోక పోవడానికి గల సమస్యలు ఏమిటో చూద్దాం.

మరి ఏ వయసులో అయితే ఆలస్యం చేసుకున్నట్లో చూద్దాం. 25-30 ఏళ్ళ వయసు దాటితే ఆలస్యం అయిందని అనవచ్చు. మగవారికైతే 30-35 మధ్య కూడా పెళ్లి వయసే. దీని మీద భిన్నాభిప్రాయాలు వున్నాయి, ఏ వయసు ఆలస్యం అనేది మనం చెప్పలేం. కానీ, సాధారణ జనాభిప్రాయం ప్రకారం మగవారికి 35 పైనా, ఆడవారికి 30-32 పైనా అయితే ఆలస్యం అయిందని చెప్పవచ్చు.

ఆలస్యంగా పెళ్ళయితే వచ్చే సమస్యలను మనం తెలుసుకుందా౦. ఆలస్యంగా అయ్యే పెళ్ళిళ్ళ వల్ల వచ్చే 7 బాంధవ్య సమస్యలు ఇవిగో. చదవండి.

యవ్వనపు ఉత్సాహం మాయం అవుతుంది :

యవ్వనపు ఉత్సాహం మాయం అవుతుంది :

మీరు యవ్వనంలో వున్నప్పుడు చేయగలిగిన పనులు ఆలస్య వివాహంలో చాలా పెద్ద సమస్య. మీరు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే యవ్వనంలోని ఉత్సాహం, ఆసక్తి దెబ్బ తింటాయి. మీరు, మీ భాగస్వామి కలిసి చేయగల పనులు కూడా పరిమితంగానే వుంటాయి.

ఆర్ధిక విషయాలు మరీ ఎక్కువ ప్రాధాన్యం వహిస్తాయి.

ఆర్ధిక విషయాలు మరీ ఎక్కువ ప్రాధాన్యం వహిస్తాయి.

విడిగా అయినా ఆర్ధిక విషయాలు అప్రదానమైనవని కాదు. కానీ ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే, చాలా విషయాల కన్నా ఆర్ధిక ప్రణాళిక మరీ ముఖ్యం అయిపోతుంది.

పిల్లల కోసం తొందర :

పిల్లల కోసం తొందర :

ఆలస్యంగా పెళ్లి అయితే పిల్లల కోసం పడే తొందర కూడా మరో ఇబ్బంది. పిల్లల ప్రస్తావన తరచూ వస్తూనే వుంటుంది, మీరూ కాదనలేరు, అనగలరా ?

సరిగా దృష్టి పెట్టలేరు :

సరిగా దృష్టి పెట్టలేరు :

పెళ్ళికి ముందు చాలా కాలం మీరు మీ భాగస్వామితో బంధంలో వుంటే సరే. లేదంటే చాలా మంది వయసు దృష్ట్యా హడావిడిగా పెళ్లి చేసుకుంటారు, ఈ బంధం నుంచి ఏమి ఆశి౦చవచ్చో ఖచ్చితంగా తెలియకుండానే.

మీకు మీరే వింతగా తోస్తారు :

మీకు మీరే వింతగా తోస్తారు :

మీ స్నేహితుడి కొడుకు స్కూల్ కు వెళ్తుండగా, మీకు ఇప్పుడే పెళ్ళయిందని గుర్తించగానే మీకు మీరే వింతగా తోస్తారు.

మీ భాగస్వామి అవసరమైనంత సమయం ఇవ్వలేకపోతారు :

మీ భాగస్వామి అవసరమైనంత సమయం ఇవ్వలేకపోతారు :

మీకు ఆలస్యంగా పెళ్లి అయితే, తరచుగా మీ ఉద్యోగం చాలా ముఖ్యం అయిపోతుంది. ఎందుకంటే వయసు గడిచే కొద్దీ మీరు ఉద్యోగం మారడం కూడా కష్టం అయిపోతుంది, మీ ఉద్యోగం మీద మీరు మరీ ఎక్కువగా ఆధార పడతారు. దీంతో మీ ఉద్యోగం నుంచి వచ్చే సమస్యలకు, అవి ఎంత అసమంజసంగా వున్నా, ఎక్కువ సమయం కేటాయించి మీ భాగస్వామికి కేటాయించలేక పోతారు.

శృంగార౦లొ ఆసక్తి తగ్గడం :

శృంగార౦లొ ఆసక్తి తగ్గడం :

చాలా విషయాలను సమతూకంగా చేయడం వల్ల కలిగే ఒత్తిడితో మేరు శృంగారంలో ఆసక్తిగా పాల్గోనలేరు. పైగా పురుషులలో వయసుతో పాటు టెస్టొస్టిరాన్ స్థాయి తగ్గుతుంది, యవ్వనంలో అంతటి ఆనందం వుండదు.

English summary

7 Relationship Problems Of A Late Marriage

People get married at different ages as a matter of choice. As such, there doesn't accurately exist the ideal age for marriage although people do feel that anytime between the ages 25 and 30 is the best age to get married- this is the general perception. In this article, we look to explore the problems of getting married late.
Desktop Bottom Promotion