For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇష్టం లేని పెళ్లి చేసుకొన్నా సంతోషంగా సంసారం చేసుకోవడం ఎలా

|

‘పెళ్ళిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయన'న పెద్దలు ఊరికే అనలేదు. ఇది అక్షరాల నిజం. ప్రేమించి పెళ్లాడినా లేక పెద్దలు కుదిర్చిన వివాహమే అయినా...ఏదైనా దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. అయితే కొందరి విషయంలో పరువు -ప్రతిష్టలు, తల్లిదండ్రులపై ఉండే గైరవం, పెద్దలు ఒత్తిడి చేయడం, మనసులో పలు రకాల భయాలు...ఆంధోళనలు, లేద వ్యక్తిగత సమస్యలు, శరీరంలో లోపాల మొదలైన కారణాల వల్ల ఇష్టం లేని వివాహాలు జరుగుతుంటాయి. మరి ఒకరంటే ఒకరికి ఇష్టం లేకపోవడం వల్ల వారి బంధం అలాగే మోడువారిపోతుందా అంటే? లేదనే చెప్పాలి.

ఎందుకంటే పెళ్లికి ముందు భాగస్వామి అంటే ఇష్టం లేకపోయినా, పెళ్లి తర్వాత సంబంధబాంధవ్యాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించగలిగితే సంసారంలో సరిగమలు పలికించుకోవచ్చు. మరి అందుకు అసరం అయ్యే సూచనలు సలహాలేంటో ఒక సారి తెలుసుకుందాం...

Could you marry a man you didn't love?

1. భయాలు తొలగించుకోవాలి: పెళ్లికి ముందు ప్రతి అమ్మాయినీ కొన్ని రకాల భయాలు వెంటాడుతాయి. పెళ్లయ్యాక అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో, అత్తమామలు ఎలా ఉంటారో..ఇలా కొన్ని అనుమానాలు, ఆందోనలు ఉండడం సహజం. ఇవి కూడా పెళ్లి నిరాకరించడానికి ఒక కారణం కావచ్చు. నిజమే...పెళ్లి తర్వాత అక్కడి వాతవరణం కొత్తగా ఉంటుందడంలో సందేహం లేదు. అయితే ఆ పరిస్థితులలో కొత్త మనుషులు, వాల్ల నడవడిక, వారి అలవాట్లు, అభిరుచులు...ఇలా ఒకదాని తర్వాత ఒకటి అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. అంతేకానీ ‘నేను ఎందుకు మారాలి...ఎప్పటిలాగే ఉంటానంటే...అన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు. కాబట్టి అనవసర భయాలన్నీ తొలగించుకుని కొత్త వాతావరణానికి, మనుషులకు మానసికంగా సంసిద్దులైతే తర్వాత అంతా హ్యాపీగా ఉండవచ్చు.

2. నీకు నేను...నాకు నువ్వు: మీకు ఎంత ఇష్టం లేకుండా జరిగిన పెళ్లయినా భార్యాభర్తలిద్దరూ వ్యక్తిగత అలవాట్లు అభిప్రాయాలు, లక్ష్యాలు..మొదలైన అంశాల గురించి ఒకరికొకరు ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాత వాటికి అనుగుణంగా నడుచుకునే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు...మీ భర్తకు చికెన్ అంటే చాలా ఇష్టమనుకోండి..చికెన్ తో రకరకాల వంటకాలు చేసి పెట్టండి...అలాగే మీ భార్యకు జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యం ఉందనుకోండి...ఆ లక్ష్యం దిశగా ఆమె విజయం సాధించే వరకూ మీరు ప్రోత్సహిస్తూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల అయిష్టాలన్నీ ఇష్టాలుగా మారే అవకాశం ఉంటుంది.

చిన్న విషయాలకే గొడవలా? కొన్ని జంటలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతుంటారు. ఉదాహరణకు...‘నాకు ఇది కొనివ్వలేదు, అది కొనివ్వలేదు' అని భార్య అంటే..‘నన్ను అలా చూసుకోలవట్లేదు, ఇలా చూసుకోవట్లేదు..అని భర్త అంటాడు...ఇలాంటి చిన్నచిన్న విషయాల్లో కొంతమంది గొడవలు పడుతుంటారు, ఫలితంగా బంధంలో ప్రేమలేమోగానీ పగలు పెరిగిపోతాయి. కాబట్టి, అసలు ఎందుకలా జరిగిందో ముందు ఒక చోటా కూర్చునొ ఒకరికొకరు చెప్పుకోండి. అంతే... సమస్ అదే పరిష్కారమవుతుంది. అంతే కానీ గొడవలు పడితే ఉపయోగమేమీ ఉండదని గుర్తుంచుకోండి.

సర్దుకుపోవాలి: పెళ్లయిన కొత్తలో చిన్న చిన్న పొరపాట్లు చేయడం, కొన్ని ఇబ్బందులు ఎదురవడం సహజం. అలాంటి సందర్బాల్లో సర్ధుకుపోవాలే కానీ...వాటిని భూతద్దంలో చూడకూడదు. ఉదాహరణకు పెళ్ళైన మొదట్లో అప్పుడప్పుడూ ఇంట్లో అన్ని పనులూ చేయాల్సి రావచ్చు. ఇంత మాత్రానికే ‘అత్తయ్య అన్ని పనులూ నాతోనే చేయిస్తుంది...తను సమాయం కూడా చేయట్లేదు..' ఇలా మీ భర్త దగ్గర చెప్పకపోవడమే మంచిది. ఇలాంటి విషయాలు తనంతట తనే తెలుసుకునేంత వరకూ మీరు ఏమీ అనకుండా ఓపికతో వ్యవహరించడమే మంచిది. లేదంటే గొడవలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. అలాగే మీ ఇద్దరి మధ్య ప్రేమ కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది.

మనస్సు విప్పి: ఆఫీస్ పనీ, ఇంట్లో ఉండే పని...ఇవి ఎప్పుడూ ఉండేవే. కాబట్టి రోజులో కాసేపు ఒకరితో ఒకరు మనస్సు విప్పి మాట్లాడుకోవడం, కష్టసుఖాలు పంచుకోవడం లాంటివి చేయాలి. అలాగే వారాంతాల్లో సినిమాకి, షికారుకి, లంచ్ కో లేదంటే డిన్నర్ కో వెళ్ళడం వంటివి చేయడం కూడా మంచిదే. అంతే కానీ ఏ విషయమైనా..‘నాకు తెలియదు..నేను రాను..' అని చిరాగ్గా సమాధానం ఇవ్వడం మంచిది కాదు. అలాగే మీ ఇద్దరి మద్య ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండడం మంచిది. మీకున్న సమయంలో మీ ఇద్దరి కోసమే కాకుండా ఇద్దరి కుటుంబ సభ్యులతో కూడా కాస్త సమయం కేటాయించడం వల్ల ఇద్దరూ మరింత దగ్గరయ్యే అవకాశం ఉంటుంది.

ఓపిగ్గా ఉండాలి: ఇష్టంలేని వివాహంలోకూడా ప్రేమలుండవా అంటే ఉంటాయనే చెప్పాలి. కానీ వాటిని వ్యక్తం చేయరు. అందువల్లే ప్రేమలు లేవని చాలా మంది భావిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఒకరు వ్యక్తం చేసిన ప్రేమను అర్ధం చేసుకోవడానికి ఎదుటి వ్యక్తికి కొంత సమయం పడుతుంది. కాబట్టి, వెంటనే జవాబు రావాలంటే కొన్ని సందర్భాల్లో కుదురకపోవచ్చు. ఇలాంటప్పుడు ఓపికతో ఉండాలి. అంతేకానీ ‘నేను ఎంత బాగా ఉన్నా...తను మాత్రం నాతో కలుపుగోలుగా ఉండట్లేదు..' అనుకొన కోపం తెచ్చుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ప్రత్యేక సందర్భాల్లో వారికిఇష్టమైన కానుకలతో సర్ ఫ్రైజ్ చేయడం, నచ్చిన దుస్తులు ధరించడం..లాంటివి కూడా చేయచ్చు. ఇలా భార్యాభర్తల్లో ఎవరైనా సరే.. ఒకరిపై మరొకరికి ప్రేమ పుట్టే వరకూ ఓపిగ్గా వేచి చూస్తునే అనుకున్న ఫలితం వస్తుంది.

సో...ఇష్టం లేని వివామం చేసుకున్నా...తర్వాత ఆ బంధాన్ని ముక్కువగా ఎలా మలచుకోవాలాలో తెలుసుకున్నారు కాదా!కాబట్టి, మాకు ఇష్టం లేదకుంటే లేదు అని మొండి పట్టు మాని ఈ సులభమైన చిట్కాలు పాటించి దాంపత్య సంబంధాన్ని బలపరచుకోండి...

English summary

Could you marry a man you didn't love?

Some people die to get married and some resent the idea of getting tied down to one person for the rest of their life. If you decide not to tie the knot around your neck, then here are some of the reasons why you shouldn't get married. Getting married is a personal choice and parents should first understand this!
Story first published: Saturday, November 22, 2014, 16:02 [IST]
Desktop Bottom Promotion