For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భార్యాభర్తలు గొడవపడేటప్పుడు మాట్లాడకూడని కొన్ని మాటలు

By Super
|

ప్రతి జంట మధ్య అప్పుడప్పుడు వాగ్వివాదాలు సహజం. అయితే చిన్న చిన్న వాగ్వివాదాలలో సైతం కొన్ని పదాలు వాడకుండా ఉండడం ఉత్తమం. కొన్ని రకాల మాటలను భార్యభర్తల మధ్య వచ్చే గొడవలలో వాడకుండా వాటిని నిర్మూలించడం మంచిది.

కట్టుబడి ఉండే ప్రతి బంధంలో అటుపోట్లనేవి సహజం. మంచి చెడు అనేవి ఇరు వైపులా ఉంటాయి. ఆరోగ్యకరమైన, సంతోషదాయకమైన బంధమనేది వచ్చిపోయే వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడమనే అంశంపై ఆధారపడి ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే కొన్ని సున్నితమైన పరిస్థితులలో ఎదుటివారిని తీవ్రంగా హర్ట్ చేసే కొన్ని పదాలను వాడకుండా ఉంటే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. గొడవలలో వాడకూడని మాటలేంటో ఇప్పుడు చూద్దాం.

'తప్పంతా నీదే'

'తప్పంతా నీదే'

ఎదుటివారిని తప్పంతా నీదేనని నిందించడం వల్ల లాభం లేదు. తప్పంతా నీదేనని గొడవలో ఒకరిని ఒకరు నిందించుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. ప్రశాంతంగా కుర్చుని మాట్లాడుకుని పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నించాలి. 'తప్పంతా నీదే'నని వాదించుకుంటూ ఉంటే సమస్యని పరిష్కరించే దిశగా ఆలోచించడం మానేసి ఒకరిని ఒకరు నిందించుకునేందుకే ఆలోచనలు మళ్ళుతాయి. సమస్యను పరిష్కరించేందుకు అవసరమైనవాటిపై దృష్టిపెట్టండి. మిమ్మల్ని ఎదుటి మనిషి ప్రవర్తన ఏ విధంగా గాయపరిచిందో వివరించండి. "నువ్వు నేను చెప్పేది వినట్లేదని అనుకున్నాను అయినా నీకు నేను చెప్పి ఉండవలసింది" అంటూ ఆ పరిస్థితిలో ఇద్దరి ప్రమేయం వివరించండి.

'ఇంతకు ముందు కూడా ఇలాగే చేశావు'

'ఇంతకు ముందు కూడా ఇలాగే చేశావు'

గతాన్ని తవ్వుకుని 'నువ్విలా చేశావు...నువ్విలా చేయకుండా ఉండవలసింది' అని ఒకరినొకరు నిందించుకునేకంటే భవిష్యత్తులో సంతోషంగా ఉండేందుకు ఎలా ఉంటే బాగుంటుందో వివరించండి. 'ఇకపై ఇలాంటి పరిస్థితులలో నేనిలా ప్రవర్తిస్తాను' వంటి మాటలు చెప్పండి. పాత తప్పులను ఎత్తి చూపుతూ ఉండడం వల్ల సమస్య పరిష్కారమవడమే కాకుండా ఒకరిపై ఒకరికి స్నేహపూర్వక భావన కలగదు. అందువల్ల జరిగినవన్నీ పోరపాట్లుగా భావించి క్షమించడం నేర్చుకోండి. గతంలో జరిగినవి క్షమించినంత మాత్రాన అలాంటివి మళ్ళీ రిపీట్ అయితే క్షమిస్తారని అర్థం కాదు. పొరపాట్లని సరిచేసే దిశగా భవిష్యత్తు ఇస్తున్న అవకాశమని వివరించండి. చిన్న చిన్న వివాదాలనే పట్టుకుని కూర్చుంటే అందమైన భవిష్యత్తుని మిస్ అవుతారు. పరిస్థితులను ఎదుర్కునేందుకు ఇది ఒక విధానం.

'కలిసుండలేను..విడాకులు కావాలి'

'కలిసుండలేను..విడాకులు కావాలి'

పరిస్థితుల వేడిలో 'కలిసుండలేను...విడాకులు కావాలి' అనే మాట వాడటం చాలా సులభం. అయితే, ఒక్కసారి ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ను మళ్ళీ వెనక్కు తీసుకోలేరు. ఆ తరువాత ఎన్ని సార్లు క్షమాపణలు చెప్పినా అన్న మాటను వెనక్కు తీసుకోలేరు. కోపంలో బయటకు వచ్చిన మాట వల్ల పరిణామాలను ఎదుర్కోవడం చాలా కష్టం. ఒకవేళ పొరపాటున ఈ మాట మీ నోట్లోంచి జారితే వెంటనే మీ భాగస్వామికి క్షమాపణలు చెప్పుకోండి. ఇకపై ఇటువంటి పొరపాటు జరగదని కన్విన్స్ చేయండి. క్షమాపణలు చెప్పిన తరువాత మీ భాగస్వామి మళ్ళీ మిమ్మల్ని నమ్మడానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల మాటలను ఆచి తూచి వాడండి.

'మీరో పిరికిపంద'

'మీరో పిరికిపంద'

వాగ్వివాదంలో ఎప్పుడైతే వ్యక్తిగత దూషణ ప్రారంభమవుతుందో పరిస్థితి దాదాపు మీ చేయి దాటిపోయినట్లే. నువ్వా నేనా అనే పరిస్థితి ఇలాంటి వ్యక్తిగత దూషణల వల్లే మొదలవుతుంది. వాడకూడని పదాలను వాడడం, ఒకరినొకరు కించపరచుకోవడం వంటివి పరిస్థితిని ఇంకా దిగజారుస్తాయి. సౌమ్యా నారాయణ్ అనే రిలేషన్ షిప్ ఎక్స్పెర్ట్ ప్రకారం "వ్యక్తిగత దూషణలను పాల్పడడం ద్వారా ఎదుటి వారిని ఒక మనిషిగా గుర్తించడం లేదనే అర్థాన్ని మీరిచ్చినట్టవుతుంది. అగ్రహంలో నోరు పారేసుకోకండి. నా దృష్టిలో ఇలా అనిపించింది ... అంటూ పరిస్థితిని వివరించండి".

'ఇప్పుడే నాతో మాట్లాడు'

'ఇప్పుడే నాతో మాట్లాడు'

ఇద్దరి మధ్య వివాదాలు చోటు చేసుకున్నప్పుడు ఒక వ్యక్తి మరొకరితో మాట్లాడేందుకు సంసిద్ధతను వ్యక్తం చేయడానికి నిరాకరించినప్పుడు ఇటువంటి మాటలు చోటుచేసుకుంటాయి. మీరు చెప్పినా ఎదుటి వారు వినే పరిస్థితుల్లో లేరని మీకు తెలుసినప్పుడు 'ఇప్పుడే నాతో మాట్లాడు' అనడానికి బదులు 'నేను చెప్పేది నువ్వు వినకపోవచ్చు. కాని ఈ విషయం మాత్రం నేను చెప్పదలచకున్నాను' అంటూ కన్విన్స్ చేయడానికి ప్రయత్నించండి. అభిప్రాయ బేధాలు చోటుచేసుకున్నప్పుడు అపార్థాలకు తావివ్వకుండా ఇలాంటి చిట్కాలు పాటించండి

English summary

5 Never-to-be-said things during a fight

Every couple argues once in a while, but look out for these words that will turn your spat bitter. Here are the five phrases you should completely avoid from using during a fight Any committed relationship goes through ups and downs and is full of good and bad times.
Desktop Bottom Promotion