For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తప్పక గుర్తుంచుకోవల్సిన -తండ్రి చెప్పే పెళ్ళి పాఠాలు...

|

ప్రతి కూతురి జీవితంలో తండ్రి ఓ రోల్ మోడల్...అంతే కాదు తన బెస్ట్ ఫ్రెండ్ కూడా...జీవితంలో ప్రతి క్షణం కూతురి బాగోగులు చూస్తూ, అన్ని విషయాల్లోనూ ఆమెను ప్రోత్సహిస్తూ, తనకు మద్దతు పలుకుతూ, విజయం సాధించినప్పుడు వెన్నుతడుతూ వెంట ఉండేది నాన్న. కూతురికేదైనా కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఎలా నిలబడాలో సలహాలు ఇవ్వడంలో ముందుండేది కూడా ఆయనే..! అదే తండ్రీ కూతుళ్ల బంధంమంటే..పుట్టినప్పుటి నుంచి పెరిగి పెద్దయ్యే క్రమంలో ప్రేమ, నమ్మకం, ఇంకా ఎన్నో భావోద్వేగాలతో నిండిన విశిష్టమైన బంధం వారి మధ్య ఏర్పడుతుంది. అమ్మాయిలకు వయస్సును బట్టి ఎన్నో విషయాలు సహజంగానే తెలిసిపోతుంటాయి. అలాగే పెళ్లి విషయంలో కొన్ని సలహాలు తల్లి ద్వారా తెలిస్తే...మరికొన్ని విషయాలు తండ్రి ద్వారా తెలుస్తాయి. ఈ క్రమంలో పెళ్లి కాబోతున్న కూతురికి వివాహ జీవితానికి సంబంధించి తండ్రి చెప్పాల్సిన కొన్ని విషయాలేంటో తెలుసుకుందాం...

గౌరవం ఇచ్చిపుచ్చుకోండి: ఎట్టిపరిస్థితుల్లోనూ ఆలుమగలిద్దరూ పరస్పరం గౌవరం ఇచ్చిపుచ్చుకోవాలి. ఈ క్రమంలోనే భర్త తరపు బంధువులను కూడా సమానంగా గౌరవించడం నేర్చుకోవాలి. వాళ్లు ఏ చిన్న మాట అన్నా సరే..వెంటనే వాళ్లగురించి భర్తకు ఫిర్యాదు చేయడం కాదు..ముందు అందరినీ అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలి. లేదంటే మీరు అమాయంగా చేసే ఫిర్యాదులే మీ ఆలుమగల మధ్య నమ్మకానికి బీటలు వారేలా చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఎదుటి వాళ్లను కించపరిచే విధంగా ఎన్నడూ నడుచుకోకూడదు. మనల్ని మనం అసలే కించపరుచుకోకూడదు. అలా చేయడం వల్ల ఇతరులు కూడా మనల్ని గౌరవించరని గుర్గుంచుకోవాలి. అది భర్త అయినా సరే...

ప్రేమగా ఉండాలి: పెళ్లైన తర్వాత భర్తే లోకంగా మారిపోతుంది...కానీ తనతో ఉండే బంధువులు అంటే మీ తోటికోడళ్లు, మరదళ్లు, బావలు, మరుదులు...ఇలా అందరినీ ప్రేమగా పలకరించాలి. పెళ్లైన కొత్తలో వారికీ మీకు మధ్య చిన్న చిన్న అపార్థాలు తలెత్తడం, మనస్పర్ధాలు చోటుచేసుకోవడం...వంటివి సర్వసాధారణం. అయితే అవన్నీ మనస్సులో పెట్టుకోకుండా తిరిగి అందరితోనూ కలిసిపోయే తత్వాన్ని అలవరచుకోవాలి. అలాగే అత్తగారిని కూడా తల్లిలా భావించి గౌరవించాలి. అప్పుడే మెట్టినింట్లో అంతా సక్రమంగా సవ్వంగా ఉంటుంది. ఇంట్లో అందరి ప్రేమాభిమానాలు అందుతాయి.

Marriage Lessons that Fathers Must Give to their Daughters

మార్పు తప్పదా? వివాహానంతరం ఆడపిల్ల జీవితంలో ఎన్నో రకాల మార్పులు చోటుచేసుకుంటాయి. పెల్లికి ముందు జీవితం ఎలా ఉన్నా తర్వాత మాత్రం భర్త, మెట్టినిల్లు, అక్కడి కుటుంబ సభ్యులు, వాళ్ల అలవాట్లు, అభిరుచులు...వీటన్నిటికి అనుగుణంగా కొత వరకూ మీరు కూడా మారాల్సి ఉంటుంది. మీ గౌరవానికి, వ్యక్తిత్వానికి భంగం కలగనవంతవరకూ ఇలా చేయడంలో తప్పులేదు. అయితే కొందరమ్మాయిలు మొండిగా...‘మేమెందుకు మారాలి...మేం కరెక్ట్ గానే ఉన్నాం...వాళ్లే మారాలి...' అనే ఉద్దేశ్యంతో ఉంటారు. ఈ రకమైన ప్రవర్తన అస్సలు మంచిది కాదు. కొన్ని సార్లు మనం సర్దుకుపోతే మరికొన్ని సార్లు ఎదుటి వాళ్లు సర్దుకుపోయే అవకాశం ఉంటుంది.

నెమ్మదిగా తెలుసుకోండి: కొత్తగా పెళ్లై అత్తారింటికి వెళ్లిన తర్వాత ఆ ఇంటి గురించి, అక్కడి మనుషుల గురించి వెంటనే పూర్తిగా తెలుసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి నిదానంగా, జాగ్రత్తగా ఒకదాని తర్వాత మరొకటిగా అన్ని విషయాలూ తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే మెట్టినింట్లో కోడలిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించుకోవడానికి పక్కా ప్రణాళిక వేసుకోవాలి. అక్కడ ఒక్కొక్కరి జీవన విధానం ఒక్కోలా ఉండవచ్చు. ఒక వేళ ఏదైనా విషయం తెలీకపోతే, కంగారు పడకుండా, మొహమటాపడకుండా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అని చెప్పాలి.

ఎప్పటికీ నీ ఇల్లే...: అమ్మాయికి పెళ్లి తర్వాత భర్త ఇల్లే తన ఇల్లు అవుతుంది. అంతమాత్రన పుట్టిల్లు పరాయి ఇల్లైపోదు. ఈ క్రమంలో ఇది కూడా ఎప్పటికీ నీ ఇల్లే అని గుర్తుంచుకోవాలి అని కూతుళ్లకు తండ్రులు తెలియజేయాలి. అలాగే అత్తరింట్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటనిి మనోబలంతో ఎదుర్కోవాలని సూచించాలి. ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ కోల్పోకూడదని చెప్పాలి. అలాగే ఎంతటి కష్టం వచ్చినా సరే పుట్టింటివారి అండ ఎప్పుడూ తనకు ఉంటుందన్న భరోసా కల్పించాలి.

వివాహ జీవితానికి కూతురిని సిద్ధం చేయడం కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదు. తండ్రి కూడా ఈ విషయంలో కీలకపాత్ర పోషించాలి. వివాహ జీవితం సంతోషంగా సాగడానికి అవసరమైన కొన్ని విషయాలను తను కూడా సందర్భానుసారంగా కూతురికి తెలియజేయడం ఎంతగానో అవసరం..

English summary

Marriage Lessons that Fathers Must Give to their Daughters


 There might be few things that your girl is already aware of, but hearing it from you will make a lot of difference to her. So, daddy dearest, there are a few advices that you should be sharing with your loving daughter. And, if you are not too comfortable talking to your little princess, like most Indian fathers who love to leave things unspoken, share this with her, and she will understand.
Story first published: Wednesday, December 3, 2014, 18:05 [IST]
Desktop Bottom Promotion