For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అతను మిమ్మల్ని పెళ్ళిచేసుకోకపోవచ్చు అనడానికి ఇవే సంకేతాలు

By Super
|

మీ ఇద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారా?ఈ మధ్య కాలంలో మీ పార్టనర్ ప్రవర్తనలో మార్పు చోటు చేసుకుంటున్నాదా? అయితే, మీరు కచ్చితంగా మీ భాగస్వామి ప్రవర్తనను అర్థం చేసుకోవాలి. ఒకవేళ, ఆ మార్పు మంచికే అయితే పరవాలేదు. అయితే మార్పు అనేది ఉహించనిది. ఎంత జాగ్రత్తగా ఉంటే భవిష్యత్తు అంత బాగుంటుంది. అతను మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోవడానికి సంకేతాలు ఇస్తూనే ఉండుంటాడు. అవి, మీరు జాగ్రత్తగా గమనించాలి.

మీ పార్టనర్ లో వస్తున్న మార్పులను గమనించడానికి అతని ప్రవర్తనపై కన్నేయడం ముఖ్యం. మీ రిలేషన్ షిప్ దీర్ఘకాలమైతే మీ ఇద్దరి మధ్య రహస్యాలు ఉండడమనేది చాలా తక్కువ. నిజానికి, మీ ఇద్దరూ ఒకరి గురించి ఒకరు పూర్తిగా అర్థం చేసుకునే ఉండుంటారు. ఒకరిని ఒకరు చదివేసే ఉండుంటారు కూడా. అయినా, మీ ఇద్దరి మధ్య ఏదైనా అఘాతం ఏర్పడవచ్చని అనడానికి సూచిక అతని ప్రవర్తనలో వచ్చే మార్పు. అటువంటి పరిస్థితులలో, పార్టనర్స్ ప్రవర్తనలో మధ్య వచ్చే చిన్న తేడా కూడా మీ రిలేషన్ షిప్ పై తీవ్ర ప్రభావం చూపవచ్చు.

Signs He Is Not Going To Marry You

మీ పార్టనర్ సమస్యను అర్థం చేసుకోండి. ఎంపతీ ప్రదర్శించండి. అర్థం చేసుకోండి. దయాభావం చూపించండి. అంకితభావం ప్రదర్శించండి. అదే సమయంలో, ఓర్పును కోల్పోకండి. ఇటువంటి సమయంలో బంధాన్ని పదిలపరచుకోవడానికి సహనం ముఖ్యం. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ను కాపాడుకుంటూ మీ పార్టనర్ తో మీకున్న బంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ, మీ ఇద్దరి మధ్య ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న అంశాలకు సంబంధించి ఏమైనా విషయాలు టుచేసుకుని ఉండుంటే ఇద్దరు కలిసి మాట్లాడుకుని ఆ విషయాలను క్లారిఫై తొలగించుకోవాలి. తద్వారా, మీ బంధంపై ఈ అంశాలు అఘాతాన్ని సృష్టించకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి.

తప్పించుకునే ధోరణి :
సమాధానాలు సరిగ్గా చెప్పకుండా ఏదో ఒక విధంగా చెప్పడం మీ పార్టనర్ మీతో బంధంపై అనాసక్తిగా ఉన్నారని తెలియచేస్తుంది. కొన్నిసార్లు, మీకు ప్రశ్నించే అవకాశం కూడా మీకు మీ పార్టనర్ ఇవ్వకపోవచ్చు. ఎటువంటి ఇబ్బందులు అలాగే కన్ఫ్యూషన్ లేకుండా లైఫ్ సజావుగా సాగిపోతున్న తరుణంలో పార్టనర్ లో ఇటువంటి మార్పు కనిపించడం విచారకరం. మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతోంది అని చెప్పడానికి ఈ అంశం ప్రధానమైనది.

Signs He Is Not Going To Marry You

మిమ్మల్ని కలవడం తప్పించుకోవడం :
మీరు ఎవరినైనా ప్రేమిస్తే వారిని తరచూ కలవాలని మీరు ఆశిస్తారు. అందుకోసం పరిస్థితులను కల్పించుకుంటారు. మీరు ప్రేమించే వారిని కలవడానికి మీకు కారణం అవసరం లేదు. ఒకవేళ, మిమ్మల్ని కలవడానికి మీ పార్టనర్ ఆసక్తి కనబరచకుండా మిమ్మల్ని కలవకుండా తప్పించుకునేందుకే మీ పార్టనర్ ప్రాధాన్యతనిస్తూ ఉంటే మీ రిలేషన్ షిప్ ప్రాబ్లెంలో ఉందని మీరు గ్రహించాలి. అతను, మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోవచ్చు అనేదానికి ఇది ఒక సంకేతం.

రెండు కుటుంబాల సమావేశాలు ఉండకపోవచ్చు :
ఎప్పుడైతే పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారో అప్పుడే ఇరు కుటుంబాల సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం సహజం. మీ కుటుంబంతో మీ బాయ్ ఫ్రెండ్ స్నేహపూర్వకంగా మెలగాలని మీరు ఆశిస్తూ ఉంటారు. అయితే, మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడో అప్పుడే ఇరు కుటుంబాల సమావేశాలు ఆగిపోతాయి. మీ ఫ్యామిలీతో కలిసి గడపడం మీ బాయ్ ఫ్రెండ్ అవాయిడ్ చేయడం, తన ఫ్యామిలీకి సంబంధించిన ముఖ్యమైన ఫంక్షన్స్ కు మిమ్మల్ని ఆహ్వానించకపోవడం మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోవచ్చనడానికి సంకేతం.

Signs He Is Not Going To Marry You

వర్క్ లోడ్ పెరగడం:
మీరు ప్రేమించేవారి కోసం మీ వద్ద ఎప్పుడూ సమయం ఉంటుంది. అది చిన్న మీటింగ్ కావొచ్చు లేదా ఇద్దరు కలిసి భోజనం చేయడం కూడా కావచ్చు. కాని ఎప్పుడైతే రిలేషన్ షిప్ లో 'టైం లేదు' అనే మాట చోటుచేసుకుంటుందో అప్పట్నుంచి ఆ రిలేషన్ షిప్ కష్టమైనా దశలో ఉందని అర్థం చేసుకోవచ్చు. సడన్ గా వర్క్ లోడ్ పెరగడం, టైం సరిపోవట్లేదని పదే పదే పార్టనర్ కు చెప్పడం మీ పార్టనర్ కు మీపై ఇంట్రెస్ట్ పోయింది అనడానికి సంకేతం.

కాల్స్ తగ్గిపోవడం:
రిలేషన్ షిప్ ధృడంగా ఉన్నప్పుడు మీ పార్టనర్ మీకు తరచూ ఫోన్ చేస్తూ ఉండడం సహజం. అంతే కాదు మీ నుంచి కూడా ఫోన్స్ ఆశించడం కూడా సహజమే. ఎప్పుడైతే రిలేషన్ షిప్ లో గ్యాప్ చోటుచేసుకుందో అప్పుడు సాధారణంగా చోటు చేసుకునే మార్పులలో పార్టనర్ కు ఫోన్ చేయకపోవడమనేది ప్రధానమైన మార్పు. ఇద్దరి మధ్య ఇదివరకటిలా ఫోన్ కాల్స్ ఉండవు. ఒకవేళ ఫోన్ కాల్స్ ఉన్నా అవి ఫార్మల్ గా ఉంటాయి. ఇవన్నీ, అర్థం చేసుకుని పార్టనర్ లోని మార్పుకు కారణాన్ని తెలుసుకోవడం మంచిది.

Signs He Is Not Going To Marry You

ఫ్యూచర్ ప్లాన్స్ ఉండవు
జీవితం పంచుకునే వ్యక్తితో ఫ్యూచర్ ప్లాన్స్ షేర్ చేసుకోవడం సహజం. ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య దూరం చోటు చేసుకుందో అప్పట్నుంచే ఎన్నో మార్పులు మీ ఇద్దరి రిలేషన్ షిప్ లో చోటు చేసుకుంటాయి. మీ పార్టనర్ మీతో ఫ్యూచర్ ప్లాన్స్ పంచుకోకపోవడం ఇందులో గమనించదాగిన మార్పు. అతను మిమ్మల్ని పెళ్లి చేసుకోడు అనడానికి ఇదొక సంకేతం.
Signs He Is Not Going To Marry You

నమ్మకం
బంధాలు నమ్మకం మీదే ఆధారపడి ఉంటాయి. మీరిద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటేనే మీ మధ్యనున్న బంధం పదిలంగా కలకాలం ఉంటుంది. ఇద్దరి మధ్య ఏర్పడే ఏ చిన్న సంఘటన నమ్మకాన్ని కోల్పోయేలా ఉండుంటే మీ బంధం ఎంతో కలం నిలవలేదు. అటువంటి సంఘటనలను మీరు గమనించి ఉండుంటే మీ బంధం పెళ్లి వరకు వెళ్ళకపోవచ్చు, అతను మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోవచ్చని అర్థం చేసుకోండి. ఒకవేళ, అతను మీనుంచి దూరం కావడానికి నిజంగా ఇష్టపడితే అతని ఇష్టాన్ని గౌరవించండి.

English summary

Signs He Is Not Going To Marry You

If you are in a relationship and recently started noticing changes in your partner’s behaviour, your mind may start racing. If the change is good, all is fine. But if the change is unexpected and uncalled for, then you better be careful. He could be giving signs he isn’t going to marry you.
Desktop Bottom Promotion