For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యుక్తవయసులో ఉన్న మీ అమ్మాయికి తల్లిగా మీరు నేర్పవలసిన ప్రేమ పాఠాలు

By Super
|

మీ అమ్మాయి ఎదుగుతున్నకొద్దీ పేరెంటింగ్ క్లిష్టతరమవుతుంటుంది.ఆమె ఎదిగే కొద్దీ కొత్త విషయాలు నేర్చుకుంటూ, సరికొత్త విషయాలని అన్వేషిస్తూ తాను నేర్చుకున్న పాఠాలతో ముందుకు సాగుతూ ఎదగాలి. సరిగ్గా ఇప్పుడే ఆమె తన భావాలాతో సంఘర్షణలో పడుతూ కొత్త వ్యక్తులతో ప్రేమలో పడే అవకాశం ఉంది.


ఒక తల్లిగా మీరు ఆమె తన భాగస్వామి ని వెతుక్కునేటప్పుడు సహాయ పడచ్చు.మీరు ఆమె జీవితాన్ని జీవించకపోయినా ఆమెకి దారి మాత్రం చూపవచ్చు.తనకి తగని వ్యక్తి ని ఆమె ప్రేమించకూడదని అనిపిస్తుంది కదా.మీ అమ్మాయిని ని ఒక గొప్ప మనిషి గా పెంచి ఆమెకి తనని తాను గౌరవించుకోవడం నేర్పి ఉంటారు.ఆమె ని మరొకరు పూర్తిగా మార్చెయ్యకూడని అనిపిస్తుంది కదా.

తల్లిగా ఆమె భావాలతో మీరే కనెక్ట్ అవ్వగలిగి ఆమెని సరైన దారిలో నడిపించగలరు.

ఇక ముఖ్యమైన ప్రేమ పాఠాలు చూద్దామా

గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం

గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం

గౌరవం ఇచ్చి పుచ్చుకోవడమంటే ఎవరినో గౌరవించడమో వారి గురించి కేర్ తీసుకోవడమో కాదు,మిమ్మల్ని మీరు గౌరవించుకోవడమే.తనని తాను గౌరవించుకోవడం మీరు మీ అమ్మాయికి నేర్పాలి.ఆమె తనని తాను ప్రేమించుకున్నప్పుడే ఇతరులతో ప్రేమించబడుతుంది.తన అవసరాలని గౌరవించుకుంటూ తనని తాను ప్రేమించాలని చెప్పండి.

నీవు నీలాగే ఉండు

నీవు నీలాగే ఉండు

“నువ్వు నీలో ఏ విషయాన్నీ మార్చుకొనక్కర్లేదు” ఇది ఒక తల్లిగా మీరు మీ అమ్మాయికి నేర్పించాలి.తనని మారమని డిమాండ్ చేసేవాళ్ళు లేదా తను ప్రేమకి అర్హురాలు కాదు అనేవాళ్ళకి ఆమె జీవితం లోకి వచ్చే అర్హత లేదని గుర్తించమని చెప్పండి.

సెక్స్ ఎడ్యుకేషన్

సెక్స్ ఎడ్యుకేషన్

“సెక్స్”గురించి మీరు మీ అమ్మాయితో మాట్లాడటానికి ఇష్టపడకపోవచ్చు. కానీ తన శరీరం లో వస్తున్న మార్పులని వివరిస్తూ ,సెక్స్ గురించి పాజిటివ్ గా పరిచయం చేస్తే తగిన సమయం వచ్చినప్పుడు ఆమె ఆనందాన్ని పొందగలుగుతుంది.

తన మీద నమ్మకం కలిగించడం

తన మీద నమ్మకం కలిగించడం

ఆమెకి తన మీద తనకి బలమైన నమ్మకం ఉంచుకోవడం నేర్పండి.ఒక్కోసారి తనకి ఇది సరిగ్గా లేదనో లేదా ఏదో మిస్స్ అవుతున్నామనో అనిపించే చిన్న చిన్న విషయాలే బాధ కలిగించచ్చు. కానీ తన మనసు తప్పు అని హెచ్చరిస్తే అంతటితో వదిలెయ్యకుండా అసలు పొరపాటు ఎక్కడ జరిగిందో అర్ధం చేసుకుని, ఆ సమస్య ని పరిష్కరించుకోమని చెప్పండి.ఒక బంధం లో ఇలాంటి చిన్న విషయాలని నిర్లక్ష్యం చేస్తుంటే ఆ బంధాన్ని బలవంతం గా ఈడుస్తున్నట్లే.

వెంటబడద్దు

వెంటబడద్దు

తగిన సమయం వచ్చినప్పుడు ప్రేమ ఆమె ముంగిట వాలుతుందనీ, దానికోసం అర్రులు చాచి వెతక్కొద్దని చెప్పండి.ఈ పాఠం నేర్పించడం వల్ల ఆమె ని విఫల ప్రేమల నుండి కాపాడినవారవుతారు.

లిట్మస్ టెస్టులొద్దు, నమ్మకం మీదే బంధం ఏర్పడాలి

లిట్మస్ టెస్టులొద్దు, నమ్మకం మీదే బంధం ఏర్పడాలి

ఒక బంధాన్ని నమ్మకం అనే పున్నాది మీద నిర్మించుకోవాలని ఆమెకి చెప్పండి.ఆమె ఒక బంధం లో కొనసాగాలంటే తనని తాను నమ్మడంతో పాటు అవతలి వ్యక్తిని కూడా పూర్తిగా నమ్మాలి.భాగస్వామి ప్రేమని పరీక్షించడం వల్ల ఏమీ రాదనీ,నమ్మకం అనే సహజమైన పునాది మీదే బంధం మొదలవ్వాలని చెప్పండి.

English summary

Love lessons to teach your daughter

Parenting can be tough spot especially when your daughter is growing older. It’s time for your daughter to learn and unlearn new things, explore the far and the wild and grow with each chapter of her life.
Desktop Bottom Promotion